Home /News /business /

10 లక్షల విలువైన కరెన్సీని ఒకటికి తగ్గింపు.. కరెన్సీలో భారీ మార్పులు.. అక్టోబర్ నుంచి అమలు.. ఎక్కడంటే..

10 లక్షల విలువైన కరెన్సీని ఒకటికి తగ్గింపు.. కరెన్సీలో భారీ మార్పులు.. అక్టోబర్ నుంచి అమలు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయాల్లో దేశాలు ఒక్కోసారి కరెన్సీ విలువలో మార్పులు చేస్తుంటాయి. చాలాసార్లు అవి స్వల్పస్థాయిలోనే ఉంటాయి. అయితే వెనిజులా మాత్రం తమ కరెన్సీలో భారీ మార్పులకు సిద్ధమైంది. ఎంతలా అంటే ప్రస్తుతం 10లక్షల విలువగా పరిగణిస్తున్న దాన్ని ఒకటికి తగ్గించేంతలా. వెనిజులా కరెన్సీ బొలివర్. దీని విలువ చాలా తక్కువకు దిగజారింది.

ఇంకా చదవండి ...
ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయాల్లో దేశాలు ఒక్కోసారి కరెన్సీ విలువలో మార్పులు చేస్తుంటాయి. చాలాసార్లు అవి స్వల్పస్థాయిలోనే ఉంటాయి. అయితే వెనిజులా మాత్రం తమ కరెన్సీలో భారీ మార్పులకు సిద్ధమైంది. ఎంతలా అంటే ప్రస్తుతం 10లక్షల విలువగా పరిగణిస్తున్న దాన్ని ఒకటికి తగ్గించేంతలా. వెనిజులా కరెన్సీ బొలివర్. దీని విలువ చాలా తక్కువకు దిగజారింది. ఆ దేశంలో ఇప్పుడు 10కోట్ల విలువైన 100 బొలివర్ కరెన్సీ నోటు.. అత్యధిక వాల్యూ ఉన్న కరెన్సీగా ఉంది. అయితే 10లక్షల విలువ నుంచి బొలివర్ విలువను ఒకటికి తగ్గిస్తున్నట్టు ఆ దేశ సెంట్రల్ బ్యాంకు తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. దీంతో బొలివర్ విలువ ఆరు సున్నాలు తగ్గిపోయింది. దేశంలో గణనీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకే వెనిజులా బొలివర్​ విలువ భారీ సవరణకు పూనుకుంది. కాగా తమ కరెన్సీ విలువలో వెనిజులా మార్పులు చేయడం ఇది మూడోసారి. 2008లోనూ కరెన్సీలో మూడు సున్నాలను ఆ దేశం తగ్గించింది. హుగో చావెజ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ మార్పు జరిగింది.

కాగా 2018లో నికోలస్​ మదురో ప్రెసిడెంట్​గా ఉన్న సమయంలోనూ ఐదు సున్నాలను తొలగించగా.. ఇప్పుడు మరోసారి భారీగా సవరణ జరగనుంది. వరుసగా ఆరో సంవత్సరం కూడా వెనిజులా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ దేశంలోని లక్షలాది మంది పేదరికంలో కూరుకుపోయారు. డాలర్​తో పోలిస్తే బొలివర్ విలువ అతి తక్కువ ఉండడంతో వెనిజులా ప్రజలకు అతి తక్కువ దినసరి జీతాలు వస్తున్నాయి. మరోవైపు రాజకీయ అనిశ్చితి వల్ల కూడా ఆ దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ప్రస్తుతం బొలివర్ విలువ ఎంతలా పడిపోయిందంటే.. 5 లీటర్ల నీటి బాటిల్ కొనేందుకు 7.4 మిలియన్ బొలివర్లను వెనిజులాలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం 1.84 అమెరికా డాలర్లతో సమానం.

ఈ నేపథ్యంలో బొలివర్ విలువను ఆరు సున్నాలు తగ్గిస్తే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని వెనిజులా ప్రభుత్వం ఆశిస్తోంది. ఒకప్పుడు చమురు ఎగుమతులతో ధనిక దేశంగా వెలుగొందిన వెనిజులా ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకే ఆ దేశంలో ధరలు ఏకంగా 265 శాతం వరకు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే 2020లో 3వేల శాతం ద్రవ్బోల్బణం నమోదు కావడం ఆ దేశం క్లిష్ట పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: Central bank, Financial problem, International news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు