Money Needs: జీవితంలో ఎదురయ్యే అవసరాలను ఎవరూ ఊహించలేరు. ప్రత్యేక అవసరాల కోసం అత్యవసరంగా డబ్బు అవసరమైతే.. లోన్(Loan) తీసుకోవడమే మన ముందు ఉన్న మార్గం. లేదా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే లిక్విడేట్ చేయాలి. అయితే చిన్న అవసరాలకు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను లిక్విడేట్ చేయడం సరైన ఆలోచన కాదని నిపుణులు సూచిస్తున్నారు. రుణాలు తీసుకోవడం కూడా సరైంది కాదని.. కానీ పరిస్థితుల ఆధారంగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నవారు ఎలాంటి ఆప్షన్లు ఎంచుకోవడం మంచిదో మనీకంట్రోల్‌తో చెప్పారు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (RIA), స్టేబుల్ ఇన్వెస్టర్ స్థాపకులు దేవ్ ఆశిష్. ఆ వివరాలు..
ఎమర్జెన్సీ అవసరాల విషయంలో ఒక వ్యక్తి లోన్ రేట్లు, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ పోల్చి చూడాలి. ఏ ఆప్షన్ ఎంచుకుంటే డబ్బు ఆదా అవుతుందో చూసుకోవాలి. మీకు డబ్బు అవసరమైనప్పుడు, మీవద్ద 5 శాతం ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఉంటే, 12-15 శాతం రేటుతో పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది కాదు. అటువంటి సందర్భంలో కేవలం ఫిక్స్డ్ డిపాజిట్‌ని ఉపయోగించుకోవాలి. కానీ అధిక రాబడిని అందించే అసెట్స్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఉదాహరణకు 10-12 శాతం రిటర్న్స్ ఇచ్చే ఈక్విటీలో పెట్టుబడులు ఉంటే.. లిక్విడేషన్‌కు బదులుగా లోన్ తీసుకొనే ఆప్షన్ పరిశీలించవచ్చు.
ఎక్కువ రిటర్న్స్ అందించే అసెట్స్ నుంచి కచ్చితంగా అధిక రాబడి అందుతుందన్న హామీ లేదు. ఈక్విటీలు దీర్ఘకాలంలో సగటున 10-12 శాతం రాబడిని అందించే అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఎటువంటి హామీ లేదు. ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మంచి రిటర్న్స్ అందుతున్న సమయంలో రుణం తీసుకోవడం మేలు. అది మంచి నిర్ణయం అవుతుంది. కానీ రుణం తీసుకున్న తర్వాత మార్కెట్లు నష్టపోతే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నిర్ణయం ఎలా తీసుకోవాలి..?
ఆస్తులు అమ్మడం, లోన్ తీసుకోవడంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. ఈ విషయంలో డబ్బు ఎంత అవసరం, లిక్విడేట్ చేయాలనుకుంటున్న అసెట్ వ్యాల్యూ ఎంత అనేది పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ అవసరాలకు అత్యవసరంగా రూ.10 లక్షలు అవసరం అనుకుంటే.. ఉన్న ఆస్తి విలువ రూ.15 లక్షలు మాత్రమే అయితే.. అలాంటప్పుడు, ఆస్తిని అమ్మడం నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాబట్టి లోన్ తీసుకోవచ్చు. అయితే మీకు రూ.4 లక్షలు అవసరం అయితే.. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.4 లక్షలు ఉంటే.. మరే ఇతర ప్లాన్స్ లేనప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లను ఉపయోగించుకోవడం మంచిది.
HDFC Bank క్రెడిట్ కార్డు లోన్.. క్షణాల్లో అకౌంట్లోకి డబ్బులు, ఇలా అప్లై చేసుకోండి!
మ్యూచువల్ ఫండ్స్ ఉంటే విత్‌డ్రా చేయవచ్చు
అవసరం చాలా తక్కువగా ఉన్న సందర్భాల్లో, అందుబాటులో ఉన్న ఆస్తి చాలా పెద్దది అయితే విక్రయించడం సరైన ఆలోచన కాదు. కాబట్టి లోన్ తీసుకోవడం మంచిది. మ్యూచువల్ ఫండ్ (MF) వంటి వాటిలో పెట్టుబడి ఉంటే, అవసరమైన మేరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ లిక్విడేషన్ను ఎంచుకున్నప్పుడు, పన్ను చిక్కులను గుర్తుంచుకోవాలి.
ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి
ఊహించని, ప్రణాళిక లేని, ఇన్సూరెన్స్ కవర్ చేయని అంశాలు ఎదురైనప్పుడు ఇబ్బందులు తప్పవు. ఇలాంటి అవసరాల కోసమే ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే.. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను లిక్విడేట్ చేయాల్సిన అవసరం ఉండదు. రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురుకాదు. చిన్న అవసరాలను ఎమర్జెన్సీ ఫండ్స్ తీర్చగలవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Mutual Funds