మేఘాలయలోని ఇరవై పొడవైన గుహలలో, మౌషున్ అనే గుహ 3,339 మీటర్ల పొడవుతో చిన్నది మరియు లియాత్ప్రాహ్ అనే గుహ 30,957 మీటర్ల పొడవుతో పొడవైనది.
90వ దశకంలో లేదా తర్వాత బాల్యంలో ఉన్న ఎవరైనా, చెప్పగల ఒక భౌగోళిక యుగం జురాసిక్ యుగం! ఎందుకు కాదు! డైనోసార్లు అంత పెద్దవి, భయానకమైనవి, ఆశ్చర్యపరిచేవి మరియు చనిపోయినవి.
వాస్తవానికి, డౌనోసార్లు సాముహికంగా అంతరించిపోవడం. ఈ యుగాన్ని భూగర్భశాస్త్రవేత్తలకు ఆసక్తికరమైనదిగా మార్చింది.భౌగోళికంగా ఈ సంఘటనలు గుర్తించిదగిన అంశాలుగా నిలిచాయి, వీటి కాలాన్ని కనుగొనడం ద్వారా భూగర్భ శాస్త్రవేత్తలు మన అందమైన గ్రహం గురించి మరియు మన గురించి అవగాహనను పెంచుతున్నారు. భూగర్భ శాస్త్రం అంటేనే లక్షలాది సంవత్సరాలుగా మనం వదిలేసినా అవక్షేపాలను, తరతరాలుగా అధ్యయనం చేయడం. కాబట్టి, అంతరించిపోవడం వంటి పెద్ద సంఘటన ఏదైనా జరిగినప్పుడు, వాటిని భూమి పొరలలో నుండి వెలికి తీస్తారు.
మన ప్రస్తుత యుగం, హోలోసీన్ కూడా అలాంటి సంఘటనతోనే గుర్తించబడింది. డైనోసార్ల చివరి ఘటనల అంత నాటకీయంగా ఉండకపోవచ్చు. సమారు 11,700 సంవత్సరాల క్రితం, ఉత్తర అమెరికా, ఉత్తర ఐరోపా మరియు ఆసియాను కప్పి ఉంచిన భారీ హిమనదీయ మంచు పలకలు చివరకు కరగడం ప్రారంభించాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, శాశ్వత వేసవి హిమం భూమి యొక్క ఉపరితలంలో 8% మరియు చివరి హిమనదీయ గరిష్ట సమయంలో 25% భూభాగంలో కప్పబడి ఉంది. కాబట్టి, ఈ హిమానీనదాలు కరగడం ప్రారంభించినప్పుడు ఇది చాలా కీలక ఘటనగా నిలిచింది. కానీ అది హోలోసీన్‌ను ముఖ్యమైనదిగా నిలిపింది.
హోలోసీన్ “మానవ యుగం”గా ప్రసిద్ధి చెందింది మరియు మీకు గుర్తున్న పూర్వీకులందరూ జీవించిన యుగం ఇది. నిజానికి, మీరు ప్రపంచంలో ఎక్కడైనా మ్యూజియంలో చూసిన ఏవైనా కళాఖండాలు ఈ యుగం నుండి వచ్చినవే. మానవులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించా, ఆహారాన్ని ఎలా పండించాలా మరియు సంఘాలను ఎలా సృష్టించుకోవాలో నేర్చుకున్నారు, కుండలు మరియు ఆభరణాలు మరియు నాణేలు ఎలా తయారు చేయాలి నేర్చుకున్నారు మరియు వాణిజ్యాన్ని అభ్యసించారా మరియు మన కథలు ఇంకా చరిత్రలను వ్రాయడం మరియు చెప్పడం నేర్చుకున్నారు.
ఇది కాలంలో చాలా పెద్ద భాగం అన్నది తెలుస్తున్న విషయమే. కానీ మానవులు తమ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడం కొనసాగించడంతో వారు వదిలేసిన అవక్షేపం కూడా మారిపోయింది మరియు మరింత గుర్తించదగినదిగా మారింది, పురావస్తుశాస్త్రం వంచి రంగాలు ఉనికిలోనికి వచ్చాయి. అయితే, భౌగోళికంగా చెప్పాలంటే, హోలోసీన్ మూడు భాగాలుగా విభజించబడింది, అందులో తాజాది (మన ప్రస్తుత యుగం) మేఘాలయన్ యుగం! అవును, భారతీయులమైన మనకు మన రాష్ట్రాలలో ఒకదాని పేరు మీద భౌగోళిక యుగం ఉంది!
ఈజిప్ట్, గ్రీస్, సిరియా, పాలస్తీనా,మెసొపొటేమియా, సింధు లోయమరియు యాంగ్జీ నదీ లోయలలో అనేక నాగరికతల పతనానికి కారణమైన ఆకస్మిక భారీ కరువుతో మేఘాలయన్ యుగం సుమారు 4,200 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యింది. ఇది మనకు ఎలా తెలుసు అంటారా, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్‌కు చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు మేఘాలయాలోని మామ్లూహ్ గుహలలో ఈ సంఘటనకు రుజువుని కనుగొన్నారు. ఎర్గో, మేఘాలయన్ యుగం!
మామ్లూహ్ గుహల లోపల ఉండటం కొన్నిసార్లు పెద్ద డైనోసార్ భారీ నోటి లోపల నడుస్తున్నట్లు అనిపిస్తుంది! స్టలాగ్మైట్ నిర్మాణాలు భారీ కోరల వంటి దంతాలలా కనిపిస్తాయి మరియు గుహలోని చీకటి ప్రదేశాలలో నడవడం నిషేధించబడిన ప్రదేశాలలో నడుస్తున్నట్టు మరియు అకస్మాత్తుగా ప్రకృతిలోకి అడుగుపెట్టినట్టు అనుభూతిని కలిగిస్తుంది. చాలా ఉత్తేజకరంగా అనిపిస్తుంది మరియు రాతిలో కనిపించే చరిత్ర మధ్యలో నడవడం అనే అనుభూతికి ఏది సాటి రాదు. భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అధ్యయనం చేసే పోరాటాలు ఇక్కడ ముందు మరియు మధ్యలు ఉన్నాయి – కంటికి కనిపించేంత స్పష్టంగా!
ఈ గుహలు తడిగా ప్రదేశంలో, తడి సోహ్రా (చిరపుంజీ)లో ఉన్నందున, రుతుపవనాల సమూహాలు మరియు కరువులను అంచనా వేయడానికి కొంతమంది శాస్త్రవేత్తలు స్టాలిగ్మైట్లను అధ్యయనం చేస్తున్నారు. వాండర్బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇక్కడ స్టాలిగ్మైట్పై గత 50 సంవత్సరాల వృద్ధిని అధ్యయనం చేశారు మరియు ఇక్కడ శీతాకాలపు వర్షపాతం అలాగే పసిఫిక్ మహాసముద్రంలోని వాతావరణ పరిస్థితుల మధ్య ఊహించని సంబంధాన్ని కనుగొన్నారు. మీరు శాస్త్రవేత్త కాకపోయినా, మామ్లూహ్ గుహలను తప్పక సందర్శించండి. సోహ్రా (చిరపుంజీ) నుండి టాక్సీలో మామ్లూహ్ చేరుకోవడం ఉత్తమ మార్గం. మీకు భద్రత ఉండేలా, మీకు మంచి ప్రదేశాలను చూపించడానికి అలాగే మీకు వాటి గురించి చెప్పడానికి గైడ్, మీరు నీటిలో నడుస్తారు కాబట్టి రబ్బరు బూట్లు ఉంటే మంచింది.
వాస్తవానికి ఇక్కడ నీరు చేరుకుంటుంది కాబట్టి, వర్షాకాలం సందర్శించడం అంత మంచిది కాదు. (ఎందుకంటే, ఇది సాధారణ వర్షాకాలం కాదు, ఇది సోహ్రా (చిరపుంజీ) అని గుర్తుంచుకోండి.) పర్యటనకు నవంబర్ నుండి ఫిబ్రవరి సరైన సమయం.
అయితే గుహల పర్యటన మీకు ఆసక్తి ఉన్న విషయం అయితే, మేఘాలయా మీకు సరైన ప్రదేశం. రాష్ట్రం మొత్తం గుహ వ్యవస్థలతో నిండి ఉంది. మేఘాలయలోని ఇరవై పొడవైన గుహలలో, మావ్షున్ గుహ 3,339 మీటర్ల పొడవుతో చిన్నది మరియు లియాత్రాప్ గుహ 30,957 మీటర్లతో పొడవైనది. మీకు ఇక్కడ సాహసాలకు, కొత్త ప్రదేశాలకు కొదవ ఉండదు. ఈ గుహ వ్యవస్థల్లో కొన్ని ఇప్పటికీ మ్యాప్ చేయబడుతున్నాయి. కాబట్టి ఎవరికి తెలుసు, బహుశా మీరు కొత్త దాన్ని కూడాకనుగొనవచ్చు!
ఈ సంవత్సరం మేఘాలయా రాష్ట్రం ఏర్పాటయ్యి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా సంబరాలు జరుగుతున్నాయి. ఏడాది అనుభవాల విందును ఆఫర్లో అందించే ఏడాది పొడవునా జరిగే పుట్టినరోజు పార్టీ అనుకోండి. మీరు ఇంకా మేఘాలయాకు వెళ్ళి ఉండకపోతే, సందర్శించడానికి ఇంతకంటా మంచి సమయం మరొకటి ఉండదు. వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మేఘాలయన్ యుగం వేడుకల ప్రత్యేక దృష్టితో మేఘాలయన్ యుగాన్నిచూడండి మరియు వేడుకలో పాల్గొనండి. ఆహారం, సంస్కృతి, సాహస క్రీడలు, పర్యావరణ పర్యాటకం లేదా విశ్రాంతి సెలవులు ఏదైనా సరే, మేఘాలయాలో ప్రత్యేక ఆసక్తులు ఉన్న ప్రతీ ప్రయాణికుడికి ఏదో ఒక అనుభవం ఖచ్చితంగా ఉంటుంది.
మేఘాలన్ యుగంలో జీవించడం గురించి మాట్లాడండి!
ఇది భాగస్వామ్య పోస్ట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.