క్రెడిట్ కార్డ్ అవసరానికి ఆదుకుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు గురించి టెన్షన్ పడకుండా ఆసరాగా నిలుస్తుంది. అంతేకాదు రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్స్, డిస్కౌంట్స్... ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే క్రెడిట్ కార్డు ఉపయోగించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. బ్యాంకులు కూడా పోటీపడి మరీ క్రెడిట్ కార్డులను ఇచ్చేస్తున్నాయి. అయితే డబ్బులైనా, క్రెడిట్ కార్డైనా కాస్త క్రమశిక్షణతో ఉపయోగించుకోకపోతే సమస్యలు తప్పవు. క్రెడిట్ కార్డు లావాదేవీల్లో మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే చివరకు మీ క్రెడిట్ స్కోర్‌ను దారుణంగా దెబ్బతీస్తాయి. మరి క్రెడిట్ కార్డు విషయంలో ఎక్కువగా చేసే తప్పులు ఇవే. తెలుసుకోండి.
కరెంట్ బిల్లు అయినా, క్రెడిట్ కార్డు బిల్లైనా గడువులోగా చెల్లించకుండా ఆ తర్వాత జరిమానాలతో చెల్లించడం చాలామందికి అలవాటే. కరెంట్ బిల్లు అయితే పర్లేదు జరిమానా చెల్లిస్తారు సరిపోతుంది. కానీ... క్రెడిట్ కార్డు బిల్లైతే జరిమానా చెల్లించడంతో పాటు క్రెడిట్ స్కోర్ పడిపోవడానికి మీ ఆలస్యం కారణమవుతుంది. ఒక్కసారి గడువులోగా బిల్లులు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ 80-110 పాయింట్లు పడిపోతుంది. బ్యాంకులు కూడా గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటాయి. మీరు ఏదైనా లోన్‌కు అప్లై చేస్తే మీ రీపేమెంట్ హిస్టరీని బ్యాంకులు పరిశీలిస్తాయి. అందుకే క్రెడిట్ కార్డ్, లోన్ చెల్లించే విషయంలో ఏమాత్రం ఆలస్యం వద్దు. చివరి తేదీ లోపే బిల్లు చెల్లించడం అలవాటు చేసుకోండి. మినిమమ్ అమౌంట్ చెల్లించే అలవాటును వదిలేయండి. అప్పు చేసైనా సరే పూర్తి బిల్లు చెల్లించండి.
Read this: Paytm First: అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా 'పేటీఎం ఫస్ట్'... ఇలా సబ్‌స్క్రైబ్ చేసుకోండి
బ్యాంకు ఎంత క్రెడిట్ లిమిట్ ఇస్తే అంత వాడుకోవచ్చని చాలామంది అనుకుంటారు. మీరు మొత్తం వాడుకున్నా బ్యాంకు నుంచి ఎలాంటి అడ్డు ఉండదు. కానీ... క్రెడిట్ రేటింగ్ ఇచ్చే సంస్థలు మాత్రం మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఎంత ఉంది అని గమనిస్తాయి. అంటే మీకు ఇచ్చిన క్రెడిట్ లిమిట్‌లో మీరు ఎంత శాతం ఉపయోగిస్తున్నారని పరిశీలిస్తాయి. ఉదాహరణకు మీ క్రెడిట్ లిమిట్ రూ.1 లక్ష అయితే మీరు 30-40 శాతం మాత్రమే వాడుకోవాలి. అంతకు మించి వాడినట్టైతే మీరు అధికంగా అప్పు చేసినట్టే. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. అందుకే మీరు క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడే మీ లిమిట్‌లో 30-40 శాతం మాత్రమే వాడుకునేలా మీరు లక్ష్మణరేఖ గీసుకోవాలి. ఒకవేళ మీరు అంతకన్నా ఎక్కువ వాడుకోవాల్సి వస్తే ముందు మీ లిమిట్ పెంచుకోండి. లేదా మరో క్రెడిట్ కార్డు తీసుకోండి.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం లాంటి ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు క్రెడిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయం కల్పిస్తుంటాయి. నో కాస్ట్ ఈఎంఐ అనగానే చాలామంది ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటారు. రూ.10 వేల ఫోన్ కొన్నా ఈఎంఐ ఆప్షన్ తీసుకుంటారు. ఇలా చేస్తే మీరు తక్కువ మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించలేరేమో అన్న భావన కలుగుతుంది. ఇది కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపించేదే.
Read this: LIC Alert: మోసపోతారు జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎల్ఐసీ
క్రెడిట్ కార్డు ద్వారా అత్యవసర సమయాల్లో నగదు కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఇందుకోసం క్యాష్ అడ్వాన్స్ ఫీజు 3.5 శాతం వరకు చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటు మరిన్ని ఛార్జీలు వేస్తాయి బ్యాంకులు. అందుకే క్రెడిట్ కార్డుతో నగదు అస్సలు విత్‌డ్రా చేయొద్దు.
అసలు చాలామందికి క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ గురించి తెలియదు. క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చన్న విషయం కూడా తెలియదు. ఆన్‌లైన్‌లో క్రెడిట్ రిపోర్ట్‌ను ఉచితంగా చెక్ చేసుకోవచ్చు. క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయడం వల్ల మీ తప్పులు తెలుస్తాయి. మరోసారి అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడొచ్చు.
మీరు క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసిన ప్రతీసారి మీ క్రెడిట్ రిపోర్ట్ కోసం దరఖాస్తు చేస్తాయి బ్యాంకులు. ఇలా మీ క్రెడిట్ రిపోర్ట్ కోసం ఎక్కువగా దరఖాస్తులు వెళ్లినా మీ క్రెడిట్ స్కోర్‌కు ఇబ్బందే. మీరు తక్కువ సమయంలో లోన్లు, క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఒకసారి మీ క్రెడిట్ కార్డు అప్లికేషన్ తిరస్కరణకు గురైతే మళ్లీ కొంతకాలం వరకు అప్లై చేయొద్దు.
Read this: SBI Gold Scheme: మీ బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీ ఇవ్వనున్న ఎస్‌బీఐ
చాలామంది క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తారు తప్ప వాటిపై వచ్చే రివార్డ్ పాయింట్స్ గురించి అస్సలు పట్టించుకోరు. అలా రెండుమూడేళ్లు రివార్డు పాయింట్స్ ఉపయోగించుకోకపోతే ఎక్స్‌పైరీ అవుతాయి. దీని వల్ల మీకు రావాల్సిన అదనపు ప్రయోజనాలు కోల్పోయినట్టే. అందుకే రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకొని అదనపు లాభాలు పొందండి.
ఇది చాలా పెద్ద తప్పు. చాలామంది పాత క్రెడిట్ కార్డుల్ని క్యాన్సిల్ చేసుకొని ఆఫర్ల కోసం కొత్త క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. కానీ... బ్యాంకులు మీ దగ్గర ఎంతకాలం నుంచి క్రెడిట్ కార్డులు ఉన్నాయో గమనిస్తాయి. అంటే మీ దగ్గర చాలాకాలంగా ఒకే క్రెడిట్ కార్డు ఉంటే మీకు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ పైనా ప్రభావం ఉంటుంది. అందుకే పాత క్రెడిట్ కార్డుల్ని కొనసాగించడం మీ మంచిది.
Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్
ఇవి కూడా చదవండి:
Facebook Messenger: ఫేస్‌బుక్‌లో సీక్రెట్ ఛాటింగ్ గురించి మీకు తెలుసా?
IRCTC App: నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న 'రైల్ కనెక్ట్ యాప్'... టాప్ 10 ఫీచర్లు ఇవే...
Business Loan: 59 నిమిషాల్లో కోటి రూపాయల లోన్... ఆ వెబ్‌సైట్ ఇదే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Credit cards, Personal Finance