హోమ్ /వార్తలు /బిజినెస్ /

Dearness Allowance: ఉద్యోగులకు కేంద్రం షాక్.. కీలక ప్రకటన!

Dearness Allowance: ఉద్యోగులకు కేంద్రం షాక్.. కీలక ప్రకటన!

Dearness Allowance: ఉద్యోగులకు కేంద్రం షాక్.. కీలక ప్రకటన!

Dearness Allowance: ఉద్యోగులకు కేంద్రం షాక్.. కీలక ప్రకటన!

Employees | కేంద్ర ప్రభుత్వం స్ఫస్టం చేసింది. ఉద్యోగుకలు ఝలక్ ఇచ్చింది. అలాంటి ఆశలు ఏవీ పెట్టుకోవద్దని కుండ బద్దలు కొట్టేసింది. దీంతో చాలా మందికి నష్టం కలిగిందని చెప్పుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

DA arrears | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు సంబంధించిన డియర్‌నెస్ అలవెన్స్‌పై ప్రభుత్వం కుండ బద్దలు కొట్టేసింది. డియర్‌నెస్ అలవెన్స్ అరియర్స్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. కోవిడ్ 19 సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Employees) రావాల్సిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ - DA) ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వెల్లడించింది.

’డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి మూడు ఇన్‌స్టాల్‌మెంట్లు నిలుపుదల చేశాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది వర్తిస్తుంది. 01.01.2020, 01.07.2020, 01.01.2021 కాలానికి సంబంధించి 3 ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ ఉద్యోగులకు అందలేదు. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వంపై ఆర్థిక పరమైన ఒత్తిడి నెలకొంది. అందుకే డీఏ ఇవ్వలేకపోయాం’ అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తాజాగా లోక్ సభలో ఈ విషయాన్ని వెల్లడించింది.

రైతులకు శుభవార్త.. బ్యాంక్ అకౌంట్లలోకి రూ.42 వేలు, ఇలా పొందండి!

ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వపు ఆర్థిక లోటు ఎక్కువగానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ఆర్‌బీఏం యాక్ట్‌లో పేర్కొన్న దాని కన్నా రెట్టింపు స్థాయిలో ఉందని తెలిపారు. కోవిడ్ 19 ప్రతికూల సమయంలో కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన డీఏ అరియర్స్‌ను మళ్లీ విడుదల చేస్తుందా? ఒకవేళ చేస్తే.. ఏ సమయం కల్లా ఈ డీఏ అరియర్స్ ఉద్యోగులకు, పెన్షనర్లకు అందుతాయి? అని ప్రశ్నకు పంకజ్ చౌదరీ సమాధానం ఇచ్చారు.

శుభవార్త.. అదే జరిగితే, భారీగా పడిపోనున్న బంగారం ధరలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ నిలుపుదల వల్ల రూ. 34,402 కోట్లు ఆదా అయ్యాయి. వీటిని కోవిడ్ 19 సమయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపయోగించామని ఆయన తెలిపారు. మళ్లీ ఆ డీఏ అరియర్స్‌ను అందించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అంశంపై ఆశలు వదిలేసుకోవచ్చు.

కాగా మరో వైపు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు తీపికబురు అందించే అవకాశం ఉంది. డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచనుంది. డీఏ పెంపు ఈసారి కూడా 4 శాతంగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన ఉండొచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఏ 38 శాతంగా ఉంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ అందిస్తూ వస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్ లెక్కింపునకు పలు అంశాలను ప్రమాణికంగా తీసుకుంటారు.

First published:

Tags: Central govt employees, DA Hike, Dearness allowance, Employees

ఉత్తమ కథలు