Home /News /business /

7TH PAY COMMISSION NEWS PRIME MINISTER NARENDRA MODI MAY TAKE DECISION ON DA HIKE FOR CENTRAL GOVERNMENT EMPLOYEES ON MARCH 16 SS

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... డీఏ పెంపుపై ప్రధాని మోదీ నిర్ణయం ఆ రోజే

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... డీఏ పెంపుపై ప్రధాని మోదీ నిర్ణయం ఆ రోజే
(ప్రతీకాత్మక చిత్రం)

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... డీఏ పెంపుపై ప్రధాని మోదీ నిర్ణయం ఆ రోజే (ప్రతీకాత్మక చిత్రం)

7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్. డీఏ, డీఆర్ పెంపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిర్ణయం తీసుకోనున్నారు. ఎప్పుడో తెలుసుకోండి.

    కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance), డియర్‌నెస్ రిలీఫ్ (Dearness Relief) పెంపు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు డీఏ పెంపుపై (DA Hike) కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్చి 16న జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) డీఏ, డీఆర్ పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంచుతుంది. ప్రతీ ఏటా జనవరి, జూలై నెలల్లో డీఏ పెరుగుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడల్లా పెన్షనర్లకు డీఆర్ కూడా పెరుగుతుంది. 2022 జనవరికి సంబంధించిన డీఏ, డీఆర్ పెరగాల్సి ఉంది.

    డీఏ, డీఆర్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం హోళీ కన్నా ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్చి 18న హోళీ పండుగ ఉంది. కేంద్ర కేబినెట్ సమావేశం మార్చి 16న జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోజున డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్చి నెల కాబట్టి ఇప్పటికే ఉద్యోగులకు రెండు నెలల వేతనం వచ్చేసింది. కాబట్టి ఉద్యోగులకు ఈ రెండు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

    LIC Policy: ఎల్ఐసీ నుంచి మీకు పాలసీ డబ్బులు రావాల్సి ఉందా? ఇలా చెక్ చేయండి

    మార్చి వేతనంలో పెరిగిన డీఏతో పాటు జనవరి, ఫిబ్రవరి డీఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. 2021 జూలైలో డీఏ 17 శాతం నుంచి 28 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. అంతకుముందు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు కలిపి ఒకేసారి 11 శాతం డీఏ పెంచింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 2021లో మరో 3 శాతం డీఏ పెంచింది. దీంతో డీఏ 31 శాతానికి పెరిగింది. జనవరి డీఏ 3 శాతం పెరిగితే 34 శాతం డీఏ లభించనుంది. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరగనుంది.

    ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) డేటాను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచుతూ ఉంటుంది. ఈ డేటా ప్రకారం 3 లేదా 4 శాతం డీఏ పెరగొచ్చు. ఈసారి 3 శాతం డీఏ పెంచుతారని అంచనా. డీఏ 34 శాతానికి పెరిగితే రూ.18,000 బేసిక్ వేతనం ఉన్నవారికి రూ.73,440 వార్షిక డీఏ లభిస్తుంది. గరిష్టంగా వార్షికంగా రూ.2,32,152 డీఏ లభించే అవకాశం ఉంది. బేసిక్ వేతనాన్ని బట్టి డీఏ లెక్కిస్తారు కాబట్టి బేసిక్ వేతనం ఎక్కువ ఉన్నవారికి ఎక్కువ డీఏ లభిస్తుంది. పెరిగే ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ పెంచుతూ ఉంటుంది. చివరిసారిగా అక్టోబర్‌లో 2021 జూలైకి సంబంధించిన డీఏ పెరిగింది.

    Post Office Account: పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

    ఇక ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు 18 నెలల డీఏ బకాయిలు రావాల్సి ఉంది. డీఏ బకాయిల కోసం ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. డీఏ బకాయిల్ని సింగిల్ సెటిల్మెంట్‌లో రిలీజ్ చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 18 నెలల డీఏ బకాయిల్ని ఒకేసారి రిలీజ్ చేస్తే ఉద్యోగులకు రూ.2,00,000 వరకు బెనిఫిట్ లభించే అవకాశం ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 7th Pay Commission, Central govt employees

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు