Double Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఈ వారం డబుల్ బోనస్ రానుందా?.. జీతం ఎంత పెరుగుతుందంటే..!

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సీజన్‌ సందర్భంగా డబుల్ బోనస్ రానుందనే వార్త ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. 7వ వేతన సంఘం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందుతుందని పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

  • Share this:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సీజన్‌ సందర్భంగా డబుల్ బోనస్ రానుందనే వార్త ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. 7వ వేతన సంఘం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందుతుందని పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ(డియర్‌నెస్ అలవెన్స్), డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) పెంపుతో కలిపి ఈ వారం డబుల్ బోనస్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 17శాతం నుంచి 28 శాతానికి పెంచగా.. అది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత HRAని (హౌజ్ రెంట్ అలవెన్స్)ని కూడా పెంచింది.

ఉద్యోగుల బేసిక్ శాలరీ ఆధారంగా రెంట్ అలవెన్స్‌తో పాటు DAలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం HRA.. 3 శాతం పెరగనుండగా, DA.. 25 శాతం దాటనుంది. అయితే HRAకి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా ఈనెల జీతంతో పాటు వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

* HRA ఎలా పెరుగుతుందంటే..
ప్రభుత్వ ఉద్యోగులు ఉండే నగరాల ఆధారంగా HRAను ప్రభుత్వం అందిస్తుంది. నగర జనాభా ఆధారంగా మూడు క్యాటగిరీలుగా నగరాలను విభజించింది. X క్యాటగిరీలో 50 లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగిన నగరాలు ఉన్నాయి. ఈ క్యాటగిరీలోని ఉద్యోగులకు HRA 27 శాతానికి పెరగనున్నట్లు తెలుస్తోంది. Y క్యాటగిరీ.. అంటే 5 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరంలోని ఉద్యోగులకు 18%, Z క్యాటగిరీ.. అంటే 5 లక్షల కన్నా తక్కువ జనాభా ఉండే నగరాల్లోని ఉద్యోగులకు 9% HRA అందించనున్నట్లు సమాచారం.

చీర కట్టుకుని వచ్చిన మహిళను అనుమతించని రెస్టారెంట్.. గట్టి షాక్ ఇచ్చిన అధికారులు.. ఇప్పుడా రెస్టారెంట్ పరిస్థితి ఏమిటంటే..

* జీతం ఎంత పెరుగుతుంది?
లెవల్-1లో ప్రభుత్వ ఉద్యోగి నెలవారీ వేతనం రూ .18 వేల నుంచి రూ.56,900 వరకు ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగి వేతనం కనీసం రూ .18వేలు ఉంటుంది. 17 శాతం DA రేటు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు 2021 జూన్ వరకు డియర్‌నెస్ అలవెన్స్‌గా రూ. 3,060 పొందుతున్నారు. అయితే జూలై 2021 నుంచి (DA పెంపు తర్వాత) ఉద్యోగులు నెలకు రూ. 5,040 పొందుతున్నారు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతం రూ. 1,980 పెరిగింది.

కాగా కరోనా సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి ఈ ఏడాది ప్రథమార్ధం వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు DA పెంపును నిలుపుదల చేసింది. తాజాగా DA, DRలను పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో పాటు కొన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా త‌మ ఉద్యోగుల‌కు DAను పెంచడంతో వేతనాలు పెరిగాయి. ఈ మేరకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, జ‌మ్మూ కాశ్మీర్‌, అసోం, జార్ఖండ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్ రాష్ట్రాల ఉద్యోగుల వేత‌నాలు భారీగా పెరిగాయి. కాగా క‌ర్ణాట‌క రాష్ట్రం మాత్రం 21.5 శాతం DA మాత్ర‌మే పెంచింది.
Published by:Sumanth Kanukula
First published: