కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు శుభవార్తలు చెప్పబోతోంది. పెండింగ్‌లో ఉన్న 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) బకాయిల్ని ఒకేసారి విడుదల చేయబోతోంది. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు డీఏ బకాయిలు (DA Arrears) పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. డీఏ బకాయిల్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు. డీఏ బకాయిల్ని ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో కాకుండా సింగిల్ సెటిల్మెంట్‌లో రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ఉద్యోగులకు రూ.2 లక్షల పైనే డీఏ బకాయిలు ఒకేసారి వస్తాయి.
లెవెల్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య, లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900 మధ్య, లెవెల్ 14 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీఏ బకాయిలు రావాల్సి ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం మరోసారి డీఏ పెంచేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు సార్లు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచుతుంది. ప్రతీ ఏటా జనవరిలో ఓసారి, జూలైలో ఓసారి ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెరుగుతుంది. ఇప్పటికే 2022 జనవరి డీఏ, డీఆర్ పెరిగింది. ప్రస్తుతం ఉద్యోగులకు, పెన్షనర్లకు 34 శాతం డీఏ, డీఆర్ లభిస్తోంది. ఉద్యోగులకు జూలైలో మరోసారి డీఏ పెరగనుంది.
EPFO Rules: ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులున్నాయా? ఈ పనిచేయకపోతే నష్టం తప్పదు
జూలై 1న డీఏ పెంపు ప్రకటన రావొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ఆధారంగా డీఏ ఎంత పెంచాలో నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) 2022 మే విడుదలైంది. మేలో రీటైల్ ద్రవ్యోల్బణం 7.04 శాతంగా ఉంది. AICPI ఇండెక్స్ ప్రకారం జూలైలో 4 శాతం డీఏ పెరగొచ్చని అంచనా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉద్యోగులకు 38 శాతం డీఏ లభించనుంది. ఈ లెక్కన ఉద్యోగులకు 4 శాతం వేతనం పెరగుతుంది.
UPI Payment: ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ చేస్తున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి
కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచితే రూ.56,900 బేసిక్ వేతనం ఉన్నవారికి 38 శాతం డీఏ చొప్పున రూ.21,622 డీఏ లభిస్తుంది. ప్రస్తుతం 34 శాతం చొప్పున రూ.19,346 డీఏ లభిస్తుంది. 4 శాతం డీఏ పెరిగితే అదనంగా రూ.2,276 వేతనం లభించనుంది. ఉద్యోగులకు వార్షికంగా రూ.27,312 ప్రయోజనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటే 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 7th Pay Commission, Central govt employees, DA Hike, Personal Finance