కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. బేసిక్ పే రూ.50 వేలు దాటిన వారు కూడా ప్రైవేట్ ఆస్పత్రుల వార్డులను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(CGHS) తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఉద్యోగులు వివిధ చికిత్సలను పొందవచ్చు. ప్రస్తుతం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ(DHFW), సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(CGHS) కింద ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రులలో వార్డుల అర్హతకు సంబంధించిన నిబంధనలను సవరించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ అధికారి అందుకుంటున్న బేసిక్ పే ప్రకారం ఇప్పుడు వార్డులకు అర్హత ఉంటుంది.
డిపార్ట్‌మెంట్ తాజాగా తెలిపిన వివరాల మేరకు.. రూ.50,500 కంటే ఎక్కువ బేసిక్ పే ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులు CGHS కింద ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల ప్రైవేట్ వార్డులకు అర్హులు. రూ.36,500 వరకు బేసిక్ పేగా పొందుతున్న ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జనరల్ వార్డులకు అర్హులు. అదే విధంగా రూ.36,501 నుంచి రూ.50,500 మధ్య బేసిక్ పే పొందుతున్న ఉద్యోగులకు సెమీ-ప్రైవేట్ వార్డులకు అర్హత ఉంటుంది. 2022 అక్టోబర్ 28 నాటి DHFW ఆఫీస్ మెమోరాండమ్‌లో.. సంబంధిత మంత్రిత్వశాఖ 2017 జనవరి 9 నాటి O.Mకు కొన్ని సవరణలు చేసింది. O.M పారా 3(B8)లో ఉన్న విధంగా CGHS కింద ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రులలోని వార్డుల అర్హతను సవరించింది.
Mangaluru Blast: మంగళూరులో బ్లాస్ట్... రైల్వే ఉద్యోగిని చిక్కుల్లో పడేసిన ఆధార్ కార్డ్
2022 అక్టోబర్ 28 నుంచి అమలులోకి కొత్త వార్డ్ అర్హతలు అమల్లోకి వస్తాయి. బేసిక్ పే రూ.36,500 వరకు జనరల్ కిందకు వస్తుంది. రూ. 36,501 నుంచి రూ.50,500 వరకు సెమీ ప్రైవేట్‌గా నిర్ణయించారు. రూ.50,500 దాటితే ప్రైవేట్‌గా పేర్కొన్నారు. ఈ ఆర్డర్ వాస్తవికతకు సంబంధించి చాలా విచారణలను స్వీకరించిన తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫీస్ మెమోరాండంను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది.
గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022 ఏప్రిల్ నుంచి 7.1 శాతం వడ్డీతో హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ అవకాశాన్ని 2023 మార్చి 31 వరకు పొడిగించారు. అంతకుముందు 2021-22 ఆర్థిక సంవత్సరానికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌పై వడ్డీ రేటు 7.9 శాతంగా ఉంది. ఈ రేటును 2020 అక్టోబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు అంటే 18 నెలలపాటు అమలు చేశారు.
EPFO Update: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... వారికి ఊరట కల్పించిన ఈపీఎఫ్ఓ
ప్రస్తుత HBAను ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం అందిస్తున్నారు. HBA నిబంధనల ప్రకారం.. కొత్త ఫ్లాట్ కొనుగోలు చేయడం, లేదా ఉద్యోగులు తమ సొంత స్థలంలో కొత్త ఇంటిని నిర్మించడం లేదా ఉద్యోగి ఉన్న ఇంటిని అభివృద్ది చేసుకోవడం వంటి వివిధ ప్రయోజనాలకు రుణాలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7.1 % అతి తక్కువ రేటుతో రూ.25 లక్షల వరకు రుణం అందుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 7th Pay Commission, Central govt employees, Health department