DA Hike | ఫెస్టివ్ సీజన్‌లో కేంద్రం ప్రభుత్వం అదిరిపోయే ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Employees) తీపికబురు అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏ ఈసారి 4 శాతం మేర పెరిగింది. దసరా ముందు కేంద్రం ఈ ప్రకటన చేయడంతో చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఉద్యోగులకు, అటు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
కేంద్ర ప్రభుత్వపు తాజా డీఏ పెంపు నిర్ణయం వల్ల ఉద్యోగుల వేతనాలు ఎంత వరకు పెరగచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. డీఏ ఇప్పుడు 4 శాతం పెంపుతో 34 శాతం నుంచి 38 శాతానికి చేరింది. దీని వల్ల 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వపు ఉద్యోగులకు, 62 లక్షల మంది పెన్షనర్లకు ఊరట లభిస్తుంది. ప్రభుత్వం ప్రతి ఏటా రెండు సార్లు డీఏను సవరిస్తుంది. జనవరి, జూలై నెల నుంచి డీఏ పెంపు వర్తిస్తుంది.
రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్రం అదిరే శుభవార్త! కీలక ప్రకటన!
సాధారణంగా డీఏను ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రాతిపదికన లెక్కిస్తారు. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు 38 శాతం డీఏను చెల్లిస్తారు. అంటే ఉద్యోగి బేసిక్ వేతనం రూ. 33 వేలు అనుకుంటే.. 4 శాతం డీఏ పెంపును పరిగణలోకి తీసుకుంటే రూ. 12,540 అవుతుంది. అదే 34 శాతం డీఏ ప్రకారం చూస్తే.. అప్పుడు అలవెన్స్ రూ. 11,200 అవుతుంది. అంటే జీతం రూ.1320 మేర పెరుగుతుంది.
శుభవార్త.. పడిపోయిన బంగారం ధర!
అలాగే రూ. 35 వేల బేసిక్ వేతనం ఉన్న వారికి డీఏ పెంపు ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. వీరికి 4 శాతం పంపు తర్వాత చూస్తే డీఏ రూ. 13,300 అవుతుంది. అంటే వీరికి జీతం రూ. 1400 మేర పెరుగుతుంది. 34 శాతం డీఏ పరంగా చూస్తే అలవెన్స్ రూ. 11,900 అవుతుంది.
కాగా ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ అనేది పని చేసే ప్రాంతం ప్రాతిపదికన మారుతుంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, పాక్షిక పట్టణాలు అనే కేటగిరిలు ఉంటాయి. దీని ప్రకారం డీఏ మారుతుంది. ఉద్యోగి బేసిక్ వేతనం పరంగా అలవెన్స్ ఎంత పెరుగుతుంది, జీతం ఎంత పైకి చేరుతుందనే అంశాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల డియర్‌నెస్ అలవెన్స్ పెంపు నేపథ్యంలో ఒక్కో ఉద్యోగికి వేతనం పెంపు ఒక్కోలా ఉంటుందని గుర్తించుకోవాలి. మరో వైపు కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. దీంతో వీరికి కూడా చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central govt employees, DA Hike, Dearness allowance, Employees, Salary Hike