7th Pay Commission: కొత్త సంవత్సరం 2023 లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Govt Employees) కేంద్రం నుంచి తీపికబురు అందుకోనున్నారు. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఉద్యోగుల జీతాలకు సంబంధించిన డీఏ- డీఆర్ పెంపు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రివిజన్, 18 నెలల డీఏ బకాయిలను క్లియర్ చేయడం వంటి అంశాలపై 7వ వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* 2023లో డీఏ పెంపు ?
మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. 2023 మార్చిలో డీఏ, డీఆర్ పెంపు 3 నుంచి 5 శాతం ఉండే అవకాశం ఉంది. ఈ పెంపుతో డీఏ 43 శాతానికి చేరుకుంటుంది. డీఏ పెంపును 2023 జనవరి నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
* డీఏ పెంపు ఎలా లెక్కిస్తారంటే?
దేశంలో ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గత 10 నెలలుగా RBI కంఫర్ట్ జోన్ 2-6 శాతం కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఇది జీతాల పెంపునకు కారణం అవుతుంది. 2022 జూన్ ముగింపుతో ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) 12 నెలవారీ సగటు పెరుగుదల శాతం ఆధారంగా DA, DR పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
* ఏడాదికి రెండుసార్లు సవరణ
డియర్నెస్ అలవెన్స్(డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. జనవరి 1వ తేదీన ఒకసారి, తరువాత జులై 1వ తేదీన రివైజ్ చేస్తారు. గత పెంపుతో దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందారు. డీఏ 4 శాతం పెంచడంతో ప్రస్తుతం ఇది 38 శాతంగా ఉంది. అంతకంటే ముందు ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సు మేరకు మార్చిలో డీఏను 3 శాతం పెంచడడంతో అది 34 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.
బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్లు త్వరగా తీసుకోండి.. 2023లో మరోసారి RBI షా
* ఫిట్మెంట్ ఫ్యాక్టర్
తమ జీతాల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించాలని ఉద్యోగుల సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక సాధారణ విలువ. ప్రస్తుతం ఉద్యోగుల మొత్తం జీతం పొందడానికి, బేసిక్ పేతో దీన్ని మల్టిప్లై చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అన్ని గ్రూపులకు ఉమ్మడి ఫిట్మెంట్ ప్రయోజనం ప్రస్తుతం 2.57గా ఉంది. ప్రస్తుతం ఎవరైనా 4200 గ్రేడ్ పేలో రూ.15,500 బేసిక్ వేతనం పొందుతుంటే.. అతని మొత్తం వేతనం రూ.15,500 × 2.57= రూ.39,835 అవుతుంది. 6వ వేతన సంఘం ఫిట్మెంట్ నిష్పత్తిని 1.86గా సిఫార్సు చేసింది. అయితే ఉద్యోగులు దీన్ని 3.68కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పెంపుతో కనీస వేతనం ప్రస్తుతం రూ.18,000 నుంచి రూ.26,000కు పెరుగుతుంది.
* 18 నెలల డీఏ బకాయిలు
2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు ఉన్న 18 నెలల డీఏ బకాయిల చెల్లింపు సమస్యను కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో పరిష్కరించే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగులు 18 నెలల డీఏ బకాయిలు పొందే అవకాశం ఉంది. డీఏ బకాయిల మొత్తం ఉద్యోగుల పే బ్యాండ్ అండ్ స్ట్రక్చర్ ద్వారా నిర్ణయిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Central govt employees, Employees