Salary Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబుర అందబోతోందా? వచ్చే ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం వీరికి శుభవార్త అందించనుందా? వీరి వేతనాలు (Salary) పెరగబోతున్నారా? వెలువడుతున్న నివేదిక ప్రకారం చూస్తే.. భారత ప్రభుత్వం కొత్త ఏడాదిలో డియర్‌నెస్ అలవెన్స్‌ను (DA Hike) పెంచనుందని తెలుస్తోంది. మార్చి కల్లా డీఏ పెంపు ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం డీఏ అరియర్స్ విషయంలో ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. కోవిడ్ 19 నేపథ్యంలో నిలపుదల చేసిన 18 నెలల డీఏ పెంపును అందించే యోచన లేదని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడిఆశలు అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు వచ్చే ఏడాది కేంద్రం డీఏ పెంచొచ్చనే అంచనాలు నెలకొనడం సానుకూల అంశం అని చెప్పొచ్చు.
రూ.లక్ష కన్నా తక్కువ ధరలో లభిస్తున్న టాప్-5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాదిలో డీఏను 3 నుంచి 5 శాతం మేర పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే కేంద్రం మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెరుగుతుందో చెప్పలేం. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా డీఏను రెండు సార్లు పెంచుకుంటూ వెళ్తోంది. జనవరి నుంచి జూన్ వరకు కాలానికి ఒకసారి పెంపు ఉంటుంది. అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు కాలానికి మరోసారి డీఏ పెంపు జరుగుతుంది. అయితే కోవిడ్ 19 సమయంలో 18 నెలలు డీఏ పెంపు లేదు.
3 నెలల్లోనే రూ.లక్షకు రూ.6 లక్షలు.. ఒక్కో షేరుకు 10 షేర్లు ఉచితం, ఇంకా 11 బోనస్ స్టాక్స్!
కేంద్ర ప్రభుత్వం చివరిగా 2022 సెప్టెంబర్ నెలలో డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68 లక్షల మంది పెన్షనర్లకు ఊరట కలిగింది. అప్పుడు డీఏ 4 శాతం పెరిగింది. దీంతో ఉద్యోగులకు లభించే డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతానికి చేరింది. సెప్టెంబర్ డీఏ పెంపునకు ముందు చూస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 34 శాతం డీఏ లభించేది. ప్రభుత్వం మార్చి నెలలో డీఏను 3 శాతం పెంచిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పుడు మళ్లీ కోవిడ్ 19 భయాలు నెలకొన్నాయి. కొత్త వేరియంట్లు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. చైనాలో అయితే కేసులు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. పరిస్థితులు మళ్లీ జఠిలంగా మారితే కేంద్రం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. అందువల్ల డియర్‌నెస్ అలవెన్స్ అంశంపై కూడా ప్రతికూల నిర్ణయం తీసుకున్న కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central govt employees, DA Hike, Dearness allowance, Employees, Money, Salary Hike