Employees | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజా కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మోదీ సర్కార్ ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 4 శాతం మేర పెంచింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలుగనుంది. తాజా పెంపు వల్ల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 38 శాతానికి చేరింది. ఇదివరకు డీఏ 34 శాతంగా ఉండేది.
మోదీ సర్కార్ చివరిగా మార్చి నెలలో డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచింది. అప్పుడు డీఏ 3 శాతం మేర పైకి కదిలింది. ఈ పెంపు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి భారత ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు వల్ల ఉద్యోగులకు భారీ ఊరట కలుగుతుంది. వేతనాలు పెరుగుతాయి.
శుభవార్త.. పడిపోయిన బంగారం ధర!
అంతేకాకుండా కేంద్ర కేబినెట్ పెన్షనర్లకు కూడా తీపికబురు అందించింది. డీఏ పెరిగితే ఆటోమేటిక్‌గానే డీఆర్ కూడా పైకి చేరుతుంది. డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) పెరుగుదల వల్ల పెన్షనర్లకు ఊరట లభిస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ రిలీఫ్‌కు సంబంధించి అదనపు ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలకు అంగీకారం తెలిపింది.
రూ.5 వేల పొదుపుతో రూ.3.5 లక్షలు.. ఈ బ్యాంకులతో భారీ లాభం
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాల వల్ల పండుగ సీజన్‌లో డిమాండ్ పెరిగేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకించి కన్సూమర్ డ్యూరబుల్స్ డిమాండ్ పైకి చేరొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంటే ఏడాదిలో రెండు సార్లు డీఏను సవరిస్తూ వస్తుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏ పెంపు అనేది ఉంటుంది. జనవరి, జూలై నుంచి డీఏ పెంపు నిర్ణయాలు అమలులోకి వస్తాయి. ప్రతి ఏటా ఇదే జరుగుతుంది. అలవెన్స్ పెంపు అనేది పలు అంశాల ప్రాతిపదికన మారుతుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు కూడా దసరా బొనాంజా అందించింది. 78 రోజుల బోనస్ ప్రకటించింది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ కింద ఈ ప్రయోజనాన్ని అందించింది. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ఈ బెనిఫిట్ లభిస్తుంది. 11.56 లక్షల మంది ఉద్యోగులకు ఊరట కలుగనుంది. బోనస్ ప్రకటన నిర్ణయం వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల మేర భారం పడనుంది. రైల్వే ఉద్యోగులకు గరిష్టంగా రూ.18 వేల వరకు బోనస్ లభించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central govt employees, DA Hike, Dearness allowance, Salary Hike