హోమ్ /వార్తలు /బిజినెస్ /

ఉన్న ఊరిలోనే నెలకు రూ. 3.5 లక్షలు ఆదాయం.. ఆ 62 ఏళ్ల మహిళ చేస్తున్న అద్భుతాలేంటో తెలుసుకోండి

ఉన్న ఊరిలోనే నెలకు రూ. 3.5 లక్షలు ఆదాయం.. ఆ 62 ఏళ్ల మహిళ చేస్తున్న అద్భుతాలేంటో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Navalben Dalsangbhai Chaudhary: డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం తిరిగే యువకులు అనేక మందిని మనం చూస్తూనే ఉంటాం. నెలకు పది, ఇరవై వేల రూపాయల కోసం పట్టణాల బాట పట్టిన వారు లక్షలు కాదు.. కోట్లల్లోనే ఉంటారు. అయితే ఓ 62 ఏళ్ల మహిళ ఉన్న ఊరిలోనే నెలకు రూ. 3.5 లక్షలు సంపాధించి ఎలా సత్తా చాటుతోందంటే..

ఇంకా చదవండి ...

  డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం తిరిగే యువకులు అనేక మందిని మనం చూస్తూనే ఉంటాం. నెలకు పది, ఇరవై వేల రూపాయల కోసం పట్టణాల బాట పట్టిన వారు మన దేశంలో లక్షలు కాదు.. కోట్లల్లోనే ఉంటారు. అయితే ఓ 62 ఏళ్ల మహిళ ఉన్న ఊరిలోనే నెలకు రూ. 3.5 లక్షలు సంపాధించింది. అంటే రోజుకు పది వేలకు పైగానే సంపాధించిందన్నమాట. ఆమె ఏదో వజ్రాలో, ఇంకా ఖరీదైన వ్యాపారమేదో చేసిందనుకుంటే పొరపాటే. కేవలం పాల వ్యాపారం ద్వారానే ఆ మహిళ ఇంతగా సంపాధించింది. 2020లో ఆమె అమ్మిన పాల విలువ రూ. 1.10 కోట్లు. ఆమెకు నలుగురు వయస్సులో ఉన్న కుమారులు ఉన్నారు. వారు ఆమెలో సగం కూడా సంపాధించకపోవడం విశేషం. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరుపిస్తోంది ఈ గుజరాతీ మహిళ.

  వివారాల ప్రకారం.. గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని నాగన గ్రామానికి చెందిన నావల్‌బెన్ దల్సాంగ్‌భాయ్ చౌదరి ఆమె నివసిస్తున్న జిల్లాలో కొత్త విప్లవమే సృష్టించింది. 2019లో ఆమె చిన్నగా ఓ డెయిరీని ప్రారంభించింది. దాన్ని క్రమంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఆమె వద్ద 80 గేదెలు, 40 ఆవులు ఉన్నాయి. వీటి పాలను చుట్టు పక్కల అనేక గ్రామాలకు చెందిన వారికి ఆమె అమ్ముతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను 80 గేదెలు, 45 ఆవులతో డెయిరీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

  2019లోనూ 87.95 లక్షల విలువైన పాలను విక్రయించినట్లు ఆమె వివరించారు. 2020లో రూ.1.10 కోట్ల విలువైన పాలను అమ్మానన్నారు. జిల్లాలో పాల వ్యాపారంలో తాను నం.1 అని ఆమె గర్వంగా తెలిపారు. ఆమె వద్ద ఇప్పుడు దాదాపు 15 మంది ఉద్యోగులు పని చేస్తున్నా.. నావల్‌బెన్ ఉదయాన్నే లేచి పాలు పితకడం మాత్రం మానలేదు. ఆమె సాధించిన విజయాలకు గాను ఆమె రెండు లక్ష్మీ అవార్డులు, మూడు బెస్ట్ పుష్పక్ అవార్డులను పొందారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Business Ideas, Gujarath, MILK, Success story

  ఉత్తమ కథలు