• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • 61 PER CENT OF CONSUMERS SAY THEY WILL SHOP DURING THIS FESTIVE SEASON REVEALS SURVEY SS GH

Online Shopping: ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లకు పండుగ కళ

Online Shopping: ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లకు పండుగ కళ

Online Shopping: ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లకు పండుగ కళ (ప్రతీకాత్మక చిత్రం)

Online Shopping | చిన్న వ్యాపారాలు, అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లు, చేనేత కార్మికులు, చేతివృత్తుల వారి ఉత్పత్తులను ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అమ్మితే.. మీరు కొంటారా అని సర్వే చేశారు. దీనికి 80 శాతం మంది కొంటామని చెప్పగా, 10 శాతం మంది మాత్రం ఆసక్తి లేదన్నారు.

  • Share this:
కరోనావైరస్ మహమ్మారి కారణంగా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. భారత్‌లో పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో అమ్మకాలు పెరుగుతాయాని వ్యాపార సంస్థలు ఆశిస్తున్నాయి. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో సుమారు 61 శాతం మంది వినియోగదారులు ఈ పండుగ సీజన్లో ఖర్చు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. వారిలో 51 శాతం మంది కేవలం ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో షాపింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సర్వే తెలిపింది. భారత్‌లోని 330 జిల్లాల్లోని 3,00,000మంది వినియోగదారులపై ఈ సంస్థ సర్వే చేసింది.

షాపింగ్ ఆసక్తి పెరిగింది


గత సంవత్సరం గణాంకాలతో పోల్చినప్పుడు ప్రస్తుతం వినియోగదారుల్లో షాపింగ్ చేయాలనే ఆసక్తి పెరిగింది. 2019 లో 27 శాతం మంది వినియోగదారులు మాత్రమే పండుగ సీజన్లో కొనుగోళ్లకు ఈ-కామర్స్ సైట్లను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 51 శాతానికి పెరగనుంది. పండుగ కొనుగోళ్ల వరకు చూసుకుంటే, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటోన్న వినియోగదారుల సంఖ్య 89 శాతం వరకు పెరిగినట్లు లోకల్ సర్కిల్స్ సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు మూడు శాతం మంది ఈ పండుగ సీజన్‌లో రూ.50 వేలకు పైగా ఖర్చు చేస్తామని చెప్పారు. 14 శాతం మంది రూ.10,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చు చేస్తామని చెప్పారు. మరో 44 శాతం మంది రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేస్తామన్నారు. 12 శాతం మంది ఎంత ఖర్చు చేస్తామో తెలియదని, 27 శాతం మంది తాము ఖర్చు చేయబోమని చెప్పారు. ఈ సీజన్‌లో దేశంలో నమోదయ్యే పండుగ ఖర్చులను లెక్కించడానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయని లోకల్ సర్కిల్స్ సంస్థ అభిప్రాయపడింది.

Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు

Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఏయే మార్గాలను ఎంచుకుంటారంటే


పండుగ కొనుగోళ్లకు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారనే ప్రశ్నకు 26 శాతం మంది ఈ-కామర్స్ సైట్లు, యాప్‌ల ద్వారా షాపింగ్ చేస్తామన్నారు.11 శాతం మంది స్థానిక రిటైల్ దుకాణాల నుంచి హోమ్ డెలివరీ సదుపాయాన్ని పొందుతామని చెప్పారు. 25శాతం మంది స్థానిక దుకాణాలు, ఈ-కామర్స్ సైట్లు, 24 శాతం మంది మాల్స్, లోకల్ రిటైలర్లు, మార్కెట్లకు వెళ్తామని చెప్పారు. 14శాతం మంది చెప్పలేమన్నారు. దీన్ని బట్టి చూస్తే సుమారు 51శాతం మంది వినియోగదారులు ఈ సంవత్సరం ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా షాపింగ్ చేయనున్నట్లు లోకల్ సర్కిల్స్‌ సర్వే పేర్కొంది.

వేటిపై ఆసక్తి ఎక్కువ?


ఎలాంటి ఉత్పత్తులపై ఆసక్తి ఉందని వినియోగదారులను సర్వేలో అడిగారు. దీనికి 15శాతం మంది స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొంటామన్నారు. మరో 19 శాతం మంది ఏసీ, హీటర్, వ్యాక్యూమ్ క్లీనర్ వంటి గృహావసర ఉత్పత్తులు కొంటామని చెప్పారు. 11శాతం మంది ఫర్నీచర్, ఎనిమిది శాతం మంది ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌ ఎంచుకుంటామన్నారు. అత్యధికంగా 32శాతం మంది గ్రాసరీ, సరకులు కొంటామని తెలిపారు. నాలుగు శాతం మంది ఇతర ఉత్పత్తులు ఎంచుకుంటామన్నారు. 11శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. గిఫ్ట్‌ల కోసం ఈ-కామర్స్ సైట్లను ఎంచుకుంటారా అని అడిగినప్పుడు... 37 శాతం మంది అవును అని, 39 శాతం మంది లేదు అని చెప్పారు. 24 శాతం మందికి చెప్పలేమన్నారు.

Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు

Poco C3: అతితక్కువ ధరకే 4GB + 64GB స్మార్ట్‌ఫోన్... పోకో సీ3 రిలీజ్

ఆన్‌లైన్‌ షాపింగ్ ఎందుకు?


ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఎందుకు ఇష్టపడతారని వినియోగదారులను లోకల్ సర్కిల్ సర్వేలో అడిగింది. దీనికి 15 శాతం మంది భద్రత, 11 శాతం మంది సౌలభ్యం, 8 శాతం మంది మంచి ప్రొడక్ట్స్ కోసం అని బదులిచ్చారు. రెండు శాతం మంది సెలక్షన్ కోసం అన్నారు. ఐదు శాతం మంది రిటర్న్స్, రిఫండ్ ఆప్షన్ కోసమని తెలిపారు. 58 శాతం మంది చెప్పారు పైన ఉన్న అన్ని బెనిఫిట్స్ కోసమని వివరించారు. రద్దీగా ఉండే మార్కెట్లు, మాస్కులు ధరించని వారు, సామాజిక దూరం పాటించని వ్యక్తులు వంటి కారణాల వల్ల చాలామంది ఆన్లైన్ షాపింగ్కే మొగ్గు చూపుతున్నామని పేర్కొన్నారు.

చేతివృత్తులు, చేనేత ఉత్పత్తులపై ఆసక్తి


చిన్న వ్యాపారాలు, అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లు, చేనేత కార్మికులు, చేతివృత్తుల వారి ఉత్పత్తులను ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అమ్మితే.. మీరు కొంటారా అని సర్వే చేశారు. దీనికి 80 శాతం మంది కొంటామని చెప్పగా, 10 శాతం మంది మాత్రం ఆసక్తి లేదన్నారు. మరో పది శాతం మంది చెప్పలేమన్నారు. దీన్ని బట్టి చూస్తే చిన్న వ్యాపార సంస్థలు, చేతివృత్తులవారు, చేనేత కార్మికుల పండుగ సంబంధిత వస్తువులను అమ్మడానికి నమోదు చేసుకుంటే చాలా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని లోకల్ సర్కిల్స్ సంస్థ చెబుతోంది. ప్రయాణానికి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు... కేవలం 19 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఈ సీజన్‌లో ప్రయాణాలు చేస్తామన్నారు.

Android Apps: అలర్ట్... ఈ 34 యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్... వెంటనే డిలిట్ చేయండి

Smartphones: మేడ్ ఇన్ చైనా ఫోన్లు వద్దా? నాన్ చైనీస్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... ధర రూ.10,000 లోపే

ఆహార ఉత్పత్తులు కొంటారా?


పండుగ సీజన్ కోసం ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాల కొనుగోలుపై కూడా సర్వే చేశారు. దీనికి 18 శాతం మంది గుర్తింపు పొందిన స్థానిక దుకాణాల నుంచి బేకరీ ఉత్పత్తులు, స్వీట్లు వంటివి కొంటామన్నారు. 13 శాతం మంది డ్రై ఫ్రూట్స్‌, ఫ్రూట్ గిఫ్ట్ బాక్సులు ఆర్డర్ చేస్తమని చెప్పారు. నాలుగు శాతం మంది పూలు కొంటామన్నారు. 33 శాతం మంది బేకరీ ఉత్పత్తులు, స్వీట్లతో పాటు డ్రై ఫూట్స్‌, ఫ్రూట్ గిఫ్ట్ బాక్సులు ఎంచుకుంటామని తెలిపారు. రెండు శాతం మంది పూలతో పాటు డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ గిఫ్ట్ బాక్సులను ఆర్డర్ చేస్తామన్నారు. మరో 30 శాతం మంది పైన చెప్పినవన్నీ కొంటామన్నారు. బెంగళూరు, హైదరాబాద్, నొయిడా, గురుగ్రామ్, కోల్‌కత వంటి పట్టణాలలో చేసిన సర్వేలో.. దాదాపు 60శాతం మంది వినియోగదారులు పండుగ షాపింగ్ కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫాంలను ఎంచుకుంటామని చెప్పారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఈ పండుగ సీజన్లో ఈ-కామర్స్ కంపెనీలు భారీ ఆర్డర్లు పొందనున్నాయని లోకల్ సర్కిల్స్ చెబుతోంది.
Published by:Santhosh Kumar S
First published: