స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసుకోవాలా... 6 మార్గాలున్నాయి... ఇలా చెయ్యండి

స్మార్ట్ ఫోన్స్

Smart Phone Screen Shot : ఒక్కోసారి మనకు ఇంటర్నెట్‌లో ఫొటోలు డౌన్‌లోడ్ కావు. అలాంటప్పుడు స్క్రీన్‌షాట్ చక్కగా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం.

  • Share this:
స్మార్ట్‌ఫోన్‌లో మనకు బాగా ఉపయోగపడే ఆప్షన్ స్క్రీన్‌షాట్. సపోజ్ మనం ఓ అకౌంట్ నుంచీ మరో అకౌంట్‌కి ఏ మనీ ట్రాన్సాక్షనో చేస్తే... వెంటనే మొబైల్ స్క్రీన్‌పై ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. దాన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎంతో మేలు. ఆ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్ కాలేదని ఎవరైనా అంటే... ప్రూఫ్ చూపించడానికి స్క్రీన్‌షాట్ ఇమేజ్ ఉపయోగపడుతుంది. ఎలాంటి స్మార్ట్‌ఫోన్ నుంచైనా స్క్రీన్ షాట్ తీసేందుకు ఆరు మార్గాలున్నాయి. ఈ పద్ధతుల్ని ఆండ్రాయిడ్, విండోస్, యాపిల్ ఐఫోన్లకు ఉపయోగించవచ్చు. ఇంకెందుకాలస్యం... ఆ మార్గాలేంటో తెలుసుకుందాం... స్క్రీన్ షాట్లు తీసుకుందాం.

1. ఆండ్రాయిడ్ : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లైతే, రెండు మార్గాల్లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీ ఫోన్ పవర్ బటన్, హోం బటన్ కలిపి ప్రెస్ చెయ్యండి. స్క్రీన్‌షాట్ వస్తుంది. రెండో మార్గంలో పవర్ బటన్ ప్రెస్ చేసి... వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చెయ్యాలి. అంతే షాట్ వస్తుంది.

2. విండోస్ మొబైల్ : మీరు విండోస్ మొబైల్ వాడుతుంటే, మీరు ఫోన్ పవర్ బటన్, హోమ్ బటన్ ఒకేసారి ప్రెస్ చెయ్యాలి. ఐతే... మీరు విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టంని మీ మొబైల్‌లో వాడుతున్నట్లైతే ఈ ట్రిక్ పనిచెయ్యదు.

3. ఐ ఫోన్ : ఐఫోన్‌లో స్క్రీన్ షాట్ కోసం ఫోన్ పవర్ బటన్, హోం బటన్ ఒకేసారి ప్రెస్ చెయ్యాలి. స్క్రీన్ షాట్‌ ఇమేజ్ గ్యాలరీలో సేవ్ అవుతుంది.

4. ఐకాన్ : కొన్ని ఫోన్ తయారీ కంపెనీలు... స్క్రీన్ షాట్‌కి కూడా ఐకాన్ ఇస్తున్నాయి. ఈ ఐకాన్ ఫోన్‌లోని నోటిఫికేషన్ బార్‌లో కనిపిస్తుంది. ముందుగా ఏ స్క్రీన్‌ను షాట్ తీసుకోవాలనుకుంటున్నామో సెట్ చేసుకొని... తర్వాత నోటిఫికేషన్ బార్‌లోకి వెళ్లి స్క్రీన్ షాట్ ఐకాన్ ట్యాప్ చెయ్యాలి. ఆటోమేటిక్‌గా స్క్రీన్ షాట్ వస్తుంది.

5. స్వైప్ : కొన్ని స్మార్ట్‌ఫోన్లలో స్క్రీన్ షాట్ కోసం స్వైప్ ఆప్షన్ ఉంటుంది. మీ మూడు చేతివేళ్లను స్క్రీన్‌పై పై నుంచీ కిందకు స్వైప్ చెయ్యాలి. ఈ టైంలో మొబైల్‌లోని ఫింగర్ ప్రింట్ ఫీచర్ ఆన్‌లో ఉండాలి.

6. గూగుల్ అసిస్టెంట్ : ఫోన్‌లో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి గూగుల్ అసిస్టెంట్ కూడా చక్కటి ఆప్షన్‌గా గుర్తింపు పొందింది. ఇందుకోసం గూగుల్ అసిస్టెంట్ యాప్ ఓపెన్ చెయ్యాలి. లేదంటే ఓకే గూగుల్ అని పలికినా సరిపోతుంది. గూగుల్ అసిస్టెంట్ యాక్టివ్ అవుతుంది. స్క్రీన్ షాట్ కోసం వాయిస్ కమాండ్ ఇస్తే సరిపోతుంది. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఈ యాప్... షేర్ చెయ్యాలా అని అడుగుతుంది. అది మీ ఇష్టం.

 

ఇవి కూడా చదవండి :


300 కోట్ల ఏళ్ల నాటి గోళాలు... గ్రహాంతర వాసులు తయారుచేశారా... మిస్టరీగా మిగిలిన ప్రశ్


ఏటీఎం పిన్‌ మర్చిపోయారా... రీసెట్ చేసుకోవచ్చు... ఇలా చెయ్యండి...


తల లేకుండా 18 నెలలు బతికిన కోడి... ఎలా సాధ్యమైందంటే...


గుడ్లగూబ ఫొటోను రోజూ చూస్తే... మీకు కలిగే ప్రయోజనాలు ఇవీ...

First published: