హోమ్ /వార్తలు /బిజినెస్ /

5G Internet: ఇండియాలో 5G సేవలు ప్రారంభం.. మీ ఫోన్‌ సపోర్ట్ చేస్తుందో లేదో ఇలా తెలుసుకోండి

5G Internet: ఇండియాలో 5G సేవలు ప్రారంభం.. మీ ఫోన్‌ సపోర్ట్ చేస్తుందో లేదో ఇలా తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎయిర్‌టెల్ ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నాగ్‌పూర్, సిలిగురితో సహా ఎనిమిది నగరాల్లో మాత్రమే 5Gని అందుబాటులోకి తెచ్చింది. ఈ నగరాల్లోని వారికి మాత్రమే 5G సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక రిలయన్స్ జియో దీపావళి నాటికి మెట్రోనగరాల్లో 5G సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశంలో అక్టోబర్ 1న 5G ఇంటర్నెట్ సేవలు (5G Internet services) లాంచ్ అయ్యాయి. అయితే ఇవి ఆల్రెడీ లాంచ్ అయినంత మాత్రాన ఇప్పటికిప్పుడు మీరు 5G ఇంటర్నెట్ పొందలేరు. మొదటి దశలో భాగంగా ఎయిర్‌టెల్ ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నాగ్‌పూర్, సిలిగురితో సహా ఎనిమిది నగరాల్లో మాత్రమే 5Gని అందుబాటులోకి తెచ్చింది. ఈ నగరాల్లోని వారికి మాత్రమే 5G సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక రిలయన్స్ జియో దీపావళి నాటికి మెట్రోనగరాల్లో 5G సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. అప్పటివరకు మెట్రో నగరాల్లో నివసిస్తున్న 5G స్మార్ట్‌ఫోన్ యూజర్స్ వేచి చూడక తప్పదు.

అయితే ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో కొన్ని విషయాలను యూజర్లు తప్పక తెలుసుకోవాలి. 5G సేవలు ఒకేసారి సెలెక్టెడ్ మెట్రోసిటీలంతటా అందుబాటులోకి రావు. ఈ అల్ట్రా స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ క్రమక్రమంగా మెట్రో నగరాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. మీ ఏరియాలో 5G సిగ్నల్స్ వస్తున్నా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో 5Gని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

* స్మార్ట్‌ఫోన్‌లో 5G ఎలా ఉపయోగించాలి?

- ముందుగా మీ ప్రాంతంలో 5G అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి జియో/ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి. మీ ప్రాంతంలో 5G సర్వీస్ అవైలబుల్‌లో ఉందని కస్టమర్ కేర్‌ ఎగ్జిక్యూటివ్ చెబితే.. 5G నెట్‌వర్క్‌కి మీ ఫోన్‌ సపోర్ట్ చేస్తుందో లేదో నిర్ధారించుకోవాలి.

- ఇందుకు మీ 5G స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి, ఆపై "మొబైల్ నెట్‌వర్క్స్‌" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ 5G అని కనిపిస్తే మీ మొబైల్ 5G నెట్‌వర్క్‌కి సపోర్ట్ అందిస్తుందని అర్థం.

- 5G అని కనిపించిన ఫోన్‌లో 'నెట్‌వర్క్ మోడ్' లేదా 'ప్రీఫర్డ్‌ నెట్‌వర్క్స్‌'లో 5G/4G/3G/2G (ఆటో) అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి.

- అప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న 5G సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తుంది. 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంటే దానిని ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఆపై మీ ఫోన్‌లో 5G లోగో కనిపిస్తుంది. అనంతరం డిఫాల్ట్ డేటా కనెక్టివిటీ ఆప్షన్‌గా 5G ని మీ ఫోన్ ఎన్నుకుంటుంది.

- ఇప్పుడు మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేస్తే.. 5G మీ సర్కిల్/ఏరియాలో అందుబాటులో ఉంటే మీరు 5G స్పీడ్ ఎంజాయ్ చేయవచ్చు.

PMJDY Bank Account: జన్ ధన్ ఖాతాదారులకు గమనిక.. ఈ ఖాతాతో రూ.2.30 లక్షల ప్రయోజనం.. వివరాలిలా..

Home Loan: హోమ్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా.. అవసరమైన డాక్యుమెంట్స్.. ఫాలో అవ్వాల్సిన స్టెప్స్..

* మరిన్ని 5G విశేషాలు

ఇప్పటి వరకు దేశీయ టెలికాం సంస్థలలో ఏవీ కూడా 5G ప్లాన్స్‌, ధరలను వెల్లడించలేదు. ఎక్కువమంది కస్టమర్లను 5Gలో చేర్చుకునేందుకు సరసమైన ధరలలోనే 5G సేవలను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీలు క్లారిటీ ఇచ్చాయి.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: 5g technology

ఉత్తమ కథలు