Post Office RD: పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్... లాభాలు ఇవే

Post Office 5-Year Recurring Deposit Account (RD) | పోస్ట్ ఆఫీసులో అనేక డిపాజిట్ స్కీమ్‌లు, పొదుపు పథకాలున్నాయి. వాటిలో రికరింగ్ డిపాజిట్ అధిక వడ్డీ ఇచ్చే పథకం.

news18-telugu
Updated: March 22, 2019, 5:08 PM IST
Post Office RD: పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్... లాభాలు ఇవే
Post Office RD: పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్... లాభాలు ఇవే
news18-telugu
Updated: March 22, 2019, 5:08 PM IST
సేవింగ్స్... ప్రతీ ఒక్కరికీ అవసరం. డబ్బు పొదుపు చేస్తేనే అవసరానికి ఆదుకుంటుంది. సంపద సృష్టించాలంటే పొదుపు తప్పనిసరి. మరి మీరు కూడా నెలనెలా కొంత పొదుపు చేయాలని అనుకుంటున్నారా? మీ డబ్బు సేఫ్‌గా దాచుకోవాలని భావిస్తున్నారా? పోస్టల్ శాఖ 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే పోస్ట్ ఆఫీసులో అనేక డిపాజిట్ స్కీమ్‌లు, పొదుపు పథకాలున్నాయి. వాటిలో రికరింగ్ డిపాజిట్ అధిక వడ్డీ ఇచ్చే పథకం. పోస్ట్ ఆఫీసులో 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

5 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్


ఒక పోస్ట్ ఆఫీసులో మీరు ఎన్ని రికరింగ్ డిపాజిట్(RD) అకౌంట్లయినా తెరవచ్చు.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ క్యాష్ లేదా చెక్ రూపంలో డిపాజిట్ చేయొచ్చు.
రికరింగ్ డిపాజిట్‌ అకౌంట్‌పై వార్షికంగా 7.3 శాతం వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తారు.
కనీసం రూ.10 నుంచి పొదుపు చేయొచ్చు. గరిష్ట పరిమితి ఏమీ లేదు.


ఉదాహరణకు నెలకు రూ.100 చొప్పున ఐదేళ్లు డిపాజిట్ చేస్తే రూ.7250 రిటర్న్స్ వస్తాయి. మీరు చెల్లించేది రూ.6000 మాత్రమే.
Loading...
ఐదేళ్ల తర్వాత కూడా మరో ఐదేళ్లు మీ ఆర్‌డీ అకౌంట్‌ను కొనసాగించొచ్చు.
అత్యవసరంగా డబ్బులు కావాలంటే ఏడాది తర్వాత మీ బ్యాలెన్స్‌లో 50 శాతం వెనక్కి తీసుకోవచ్చు. తర్వాత ఆ మొత్తాన్ని వడ్డీతో సహా ఒకేసారి చెల్లించాలి.
6 వాయిదాలు అడ్వాన్స్‌గా డిపాజిట్ చేస్తే రిబేట్ లభిస్తుంది.
మైనర్లు కూడా ఈ అకౌంట్ తీసుకోవచ్చు. వయస్సు 10 ఏళ్ల పైనే ఉండాలి.
రికరింగ్ డిపాజిట్‌ అకౌంట్‌ జాయింట్‌గా కూడా ఓపెన్ చేయొచ్చు.
ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరో పోస్ట్ ఆఫీస్‌కు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
రికరింగ్ డిపాజిట్‌ అకౌంట్‌‌కు నామినేషన్ సదుపాయం కూడా ఉంది.

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

LIC Navjeevan Plan: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... నవజీవన్ ప్లాన్‌తో లాభాలు ఇవే

March 31 Deadline: ఈ 5 పనులకు మార్చి 31 డెడ్‌లైన్... త్వరగా పూర్తిచేయండి

Smartphone Tip: మీ స్మార్ట్‌ఫోన్ వాటర్‌ప్రూఫేనా? ఇలా తెలుసుకోవచ్చు
First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...