PF BALANCE: మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా? ఈ 5 టిప్స్ ట్రై చేయండి

PF BALANCE | మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 5 మార్గాలున్నాయి. ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్, ఈపీఎఫ్ఓ యాప్, ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్... వీటి ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ సులువుగా తెలిసిపోతుంది.

news18-telugu
Updated: March 2, 2019, 3:52 PM IST
PF BALANCE: మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా? ఈ 5 టిప్స్ ట్రై చేయండి
PF BALANCE | మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 5 మార్గాలున్నాయి. ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్, ఈపీఎఫ్ఓ యాప్, ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్... వీటి ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ సులువుగా తెలిసిపోతుంది.
  • Share this:
ప్రావిడెంట్ ఫండ్ లేదా పీఎఫ్... ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్ అంటే ఏంటో తెలుసు. గతంలో పీఎఫ్ బ్యాలెనస్ తెలుసుకోవడం అనేది ఓ పెద్ద సవాల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎంప్లాయ్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) సభ్యులైన మీకు మీ కంపెనీ యాజమాన్యం స్టేట్‌మెంట్ ఇచ్చేంత వరకు బ్యాలెన్స్ గురించి ఎదురుచూడాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 5 మార్గాలున్నాయి. ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్, ఈపీఎఫ్ఓ యాప్, ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్... వీటి ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ సులువుగా తెలిసిపోతుంది.

epfo e sewa, epfo member home, pf balance checking, epfo employee login, epfo passbooks, pf balance check without uan number, how to see pf balance, pf balance missed call, pf balance by sms, Umaang app, పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్, పీఎఫ్ బ్యాలెన్స్ కాల్, పీఎఫ్ బ్యాలెన్స్ ఉమాంగ్ యాప్

1. ఉమాంగ్ యాప్
మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే అందులో ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ఇది. అందులో ప్రభుత్వ సేవలన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు. మీ క్లెయిమ్‌ని ట్రాక్ చేయొచ్చు. ఉమాంగ్ యాప్ ఉపయోగించడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోవచ్చు

epfo e sewa, epfo member home, pf balance checking, epfo employee login, epfo passbooks, pf balance check without uan number, how to see pf balance, pf balance missed call, pf balance by sms, Umaang app, పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్, పీఎఫ్ బ్యాలెన్స్ కాల్, పీఎఫ్ బ్యాలెన్స్ ఉమాంగ్ యాప్

2. ఈపీఎఫ్ఓ పోర్టల్యూనిఫైడ్ పోర్టల్ కాకుండా పీఎఫ్ పాస్‍బుక్స్ కోసం ఈపీఎఫ్ఓ మరో వెబ్‌సైట్ నిర్వహిస్తోంది. ఇందులో ట్రాన్స్‌ఫర్స్ లాంటి ఇతర సేవల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నెంబర్(UAN) నెంబర్ ఆధారంగా పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. www.epfindia.gov.in వెబ్‌సైట్‌లో 'For Employees' విభాగంలో 'Our Services' క్లిక్ చేయాలి. లేదా https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అయితే అంతకంటే ముందే UAN యాక్టివేట్ చేయాలి.

Read this: PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

epfo e sewa, epfo member home, pf balance checking, epfo employee login, epfo passbooks, pf balance check without uan number, how to see pf balance, pf balance missed call, pf balance by sms, Umaang app, పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్, పీఎఫ్ బ్యాలెన్స్ కాల్, పీఎఫ్ బ్యాలెన్స్ ఉమాంగ్ యాప్

3. ఎస్ఎంఎస్
7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించి పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. EPFOHO UAN ENG అని మెసేజ్ పంపాలి. ENG అంటే మీరు కోరుకునే భాషలోని మొదటి మూడు అక్షరాలు. మీరు తెలుగులో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే EPFOHO UAN TEL అని పంపాలి. తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళ్ భాషల్లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీ ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ లాంటి వివరాలు UAN లింక్ చేయడం తప్పనిసరి.

Read this: మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

epfo e sewa, epfo member home, pf balance checking, epfo employee login, epfo passbooks, pf balance check without uan number, how to see pf balance, pf balance missed call, pf balance by sms, Umaang app, పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్, పీఎఫ్ బ్యాలెన్స్ కాల్, పీఎఫ్ బ్యాలెన్స్ ఉమాంగ్ యాప్

4. మిస్డ్ కాల్
మీరు యూఏఎన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ మెసేజ్ వస్తుంది. ఇందుకోసం కూడా మీ ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ లాంటి వివరాలు UAN లింక్ చేయడం తప్పనిసరి.

Read this: Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై

epfo e sewa, epfo member home, pf balance checking, epfo employee login, epfo passbooks, pf balance check without uan number, how to see pf balance, pf balance missed call, pf balance by sms, Umaang app, పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్, పీఎఫ్ బ్యాలెన్స్ కాల్, పీఎఫ్ బ్యాలెన్స్ ఉమాంగ్ యాప్

5. ఈపీఎఫ్ఓ యాప్
గూగుల్ ప్లే స్టోర్‌లో EPFO యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మొదట 'Member' ఆ తర్వాత 'Balance/passbook'పై క్లిక్ చేయాలి. మీ UAN నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఇలా ఈ 5 మార్గాల్లో మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Jobs: మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మంచి ఉద్యోగాలు... భారీ జీతాలు...

Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం
First published: March 2, 2019, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading