పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 11, 2018, 3:38 PM IST
పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 11, 2018, 3:38 PM IST
పదివేల జీతం తీసుకునే ఉద్యోగి అయినా... పదికోట్లు సంపాదించే వ్యాపారవేత్త అయినా... జీవితంలో ఏదో ఓ దశలో అప్పు అవసరం. ఇలాంటి సమయంలో ఆదుకునేదే పర్సనల్ లోన్. పిల్లల ఫీజులైన, పెళ్లిళ్లైన, ఆస్పత్రి ఖర్చులేవైనా సరే అవసరానికి ఆదుకుంటాయి పర్సనల్ లోన్స్. అయితే వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎక్కువ కాబట్టి అత్యవసరమైతే తప్ప వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆస్తులు, షేర్స్ లాంటి పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు పర్సనల్ తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.

1. రుణ యోగ్యత
లోన్ తీసుకునే ముందు అసలు మీకు ఎంత వరకు బ్యాంకు ఇవ్వగలుగుతుందో తెలుసుకోండి. బ్యాంకు వెబ్‌సైట్‌లో పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్‌లో ఇది తెలుసుకోవచ్చు. మీ ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యం, క్రెడిట్ స్కోర్ లాంటి అంశాలపై మీ రుణ యోగ్యత ఆధారపడి ఉంటుంది. లోన్ అమౌంట్, కాలపరిమితి ఒక్కో సంస్థలో ఒక్కోలా ఉంటాయి.

2. తిరిగి చెల్లించే సామర్థ్యం
లోన్ తీసుకునే ముందు మీరు ఈఎంఐ సమయానికి చెల్లించగలరా లేదా అన్న విషయాన్ని విశ్లేషించుకోండి. లోన్ ఇచ్చే ముందే బ్యాంకులు ఈ అంశాన్ని పరిశీలిస్తాయి. అయితే మీ ఆదాయం, ఖర్చులు, పొదుపు లాంటివి మీరే విశ్లేషించుకొని ఈఎంఐలకు డబ్బులు మిగుల్తాయో లేదో చూసుకోవాలి.3. ముందస్తు చెల్లింపులపై జరిమానాలు
మీరు తీసుకున్న అప్పును కాలపరిమితికన్నా ముందే చెల్లించినా జరిమానా విధిస్తుంది బ్యాంకు. కారణం మీరు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందమే. అయితే కొన్ని బ్యాంకులు ముందస్తు చెల్లింపులపై ఎలాంటి జరిమానాలు విధించవు. అలాంటి సంస్థల దగ్గరే లోన్ తీసుకోవాలి.
Loading...
4. వడ్డీ రేట్లు
మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు 8 నుంచి 16 శాతం వరకు ఉంటాయి. మీరు వేర్వేరు బ్యాంకుల వడ్డీ రేట్లు పోల్చుకొని చూడాలి. వడ్డీ రేట్లు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ లోన్ తీసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పెన్షనర్లు... ఇలావేర్వేరు వర్గాలకు వేర్వేరు వడ్డీ రేట్లుంటాయి.

5. ఈఎంఐ చెల్లింపులు
మీరు తీసుకున్న అప్పు, వడ్డీ, కాలపరిమితిపై మీ ఈఎంఐ ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు ఇతర ఫీజులు, ఛార్జీలు బ్యాంకు నియమ నిబంధనలకు అనుగుణంగా చెల్లించాలి.

ఇవి కూడా చదవండి:

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!

ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్

బీపీ చెక్ చేసే ఐఫోన్ యాప్!

మోటో జీ6 ప్లస్ వచ్చేసింది!
First published: September 11, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...