Home /News /business /

5 THINGS FIRST TIME SIP INVESTORS SHOULD REMEMBER TO EARN HIGHER RETURNS GH VB

SIP Investment Tips: మొదటిసారి SIPలో పెట్టుబడి పెడుతున్నారా..? ఎక్కువ రాబడి కోసం పాటించాల్సిన టిప్స్ ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మొదటిసారి ఇన్వెస్ట్ చేసే వారికి SIP బెస్ట్ ఆప్షన్‌. వీటి ద్వారా తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పెట్టుబడుల యాత్ర ప్రారంభించేందుకు ఉత్తమ మార్గాల్లో ఒకటి మ్యూచువల్‌ ఫండ్స్‌(Mutual Funds). మీరు వీటిల్లో ఒకేసారి డబ్బు పెట్టుబడిగా పెట్టవచ్చు. లేదా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP) ఎంచుకొని చిన్న మొత్తాలను క్రమపద్ధతిలో పెట్టుబడిగా పెట్టవచ్చు. అయితే మొదటిసారి ఇన్వెస్ట్(Invest) చేసే వారికి SIP బెస్ట్ ఆప్షన్‌. వీటి ద్వారా తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి పొందవచ్చు. మీ ఆదాయం, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి వారం, నెల, మూడు నెలలకోసారి లేదా ఆరునెలలకోసారి ఫిక్స్‌డ్‌ మొత్తాన్ని, నెలకు రూ.500లతో కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. మొదటిసారి పెట్టుబడి పెట్టే SIP ఇన్వెస్టర్స్‌కు ఉపయోగపడే చిట్కాలు..

పెట్టుబడి లక్ష్యాలు గుర్తించండి
మీ పెట్టుబడి ప్రారంభించే ముందు మీకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు తప్పనిసరిగా ఉండాలి. SIPలో పెట్టుబడి ప్రారంభించే ముందు మీరు అనుకునే లక్ష్యాలు సాధించేందుకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ పనికొస్తుందో లేదో చూసుకోవాలి. ఈ ఒక్క విషయంలో స్పష్టత ఉంటే ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలి, ఎంత కాలం పెట్టుబడి పెట్టాలనే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇల్లు కొనుగోలు చేయడం, కారు కొనడం, పిల్లల చదువులు, వివాహం వంటి అనేక ఆర్థిక లక్ష్యాలు మీకు ఉండవచ్చు. ఈ అన్ని లక్ష్యాల సాధించుకునేందుకు ఒక SIP సరిపోకపోవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీరు అనేక SIPs లో పెట్టుబడి పెట్టాలి.

Health Insurance: విదేశాల్లో వైద్య ఖర్చులను కవర్ చేసే సరికొత్త హెల్త్‌ ప్లాన్.. ఆ వివరాలు తెలుసుకోండి..


ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి
మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు మార్కెట్‌లో అనేక ఆప్షన్స్.. అంటే ఈక్విటీ ఫండ్‌, డెట్‌ ఫండ్‌, హైబ్రిడ్‌ ఫండ్‌ వంటివి ఉన్నాయి. మీ రిస్క్ తీసుకోగల తత్వం, రాబడి అంచనా, మీ ఆర్థిక లక్ష్యం సాధించుకునేందుకు ఉన్న వ్యవధికి అనుగుణంగా మీరు తగిన మ్యూచువల్‌ ఫండ్‌ ఎంపిక చేసుకోవాలి. రిస్క్‌ తీసుకునే తత్వం ఎక్కువుంటే ఈక్విటీ ఫండ్‌, తక్కువ రిస్క్‌ అనుకుంటే డెట్‌ ఫండ్‌ ఉత్తమం. సాధారణ రాబడి, మధ్యస్థాయి రిస్క్ తీసుకునే సామర్ధ్యం ఉంటే హైబ్రిడ్‌ ఫండ్‌ ఎంచుకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు ఆ కంపెనీ ట్రాక్‌ రికార్డు, పెట్టుబడి ఖర్చు, ఆ స్కీమ్‌ గత పనితీరు, అధిక రాబడి అందించడంలో ఆ ఫండ్‌ మేనేజర్‌ సామర్ధ్యం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి.

పెట్టుబడుల్లో వైవిధ్యం
పెట్టుబడులను వైవిధ్యంగా ఉంచుకోవడం మంచి పెట్టుబడి వ్యూహం. రిస్క్‌ తత్వం, రాబడి అంచనాలతో పాటు వయసు, ఆర్థిక బాధ్యతలు, పెట్టుబడి వ్యవధి, ఆదాయ బాధ్యతల వంటివన్నీ పెట్టుబడిదారు రిస్క్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. రిస్క్‌ను తగ్గించుకోవడంలో డైవర్సిఫికేషన్‌ సాయపడుతుంది. దీని కోసం మీ పెట్టుబడిని వేర్వేరు ఆస్తులు, స్కీములు, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలకు విస్తరింపజేయాలి.

Zodiac Signs-Astrology: ఈ రాశుల వారికి ఇంత క్రూరత్వం ఉంటుందా.. వీరితో జాగ్రత్త.. మీ రాశి కూడా ఉందా..?


SIP పెట్టుబడిని చెక్‌ చేస్తూ ఉండండి
పెట్టుబడి అంటే డబ్బు ఏదో ఒకదానిలో పెట్టుబడిగా పెట్టి మర్చిపోవడం కాదు. పెట్టుబడి పనితీరును క్రమం తప్పకుండా పరిశీలించాలి. కొన్ని సందర్భాల్లో మనం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఆశించిన రీతిలో పనిచేయకపోవచ్చు. దానికి తప్పు ఫండ్ ఎంచుకోవడం లేదా ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులు కారణం కావచ్చు. మీరు తరచూ మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్‌ పనితీరు పరిశీలిస్తే మీరు తగిన చర్యలు చేపట్టేందుకు వెసులుబాటు లభిస్తుంది.

కొత్త SIP ఎప్పుడు ఎంచుకోవాలి?
SIPsలో దీర్ఘకాలం పెట్టుబడి అంటే అధిక రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ, సహనంతో స్థిరంగా పెట్టుబడులు పెట్టాలి. మీ ఆర్థిక లక్ష్యం నెరవేరిన తర్వాత SIP ఆపేసి ఆ నిధిని మరో లక్ష్యం కోసం కొత్త SIP వైపు మళ్లించాలి.
Published by:Veera Babu
First published:

Tags: Investments, SIP

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు