హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investments: పోస్టాఫీస్ స్కీమ్స్‌తో పన్ను ప్రయోజనాలు..సెక్షన్ 80C ట్యాక్స్ బెనిఫిట్స్ అందించేవి ఇవే..

Investments: పోస్టాఫీస్ స్కీమ్స్‌తో పన్ను ప్రయోజనాలు..సెక్షన్ 80C ట్యాక్స్ బెనిఫిట్స్ అందించేవి ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదాయ పన్ను చట్టంలో కొన్ని సెక్షన్ల ప్రకారం, పన్ను ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఐదు పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ద్వారా ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అందిపుచ్చుకోవచ్చు. అవేంటో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Investments: ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు, సంస్థలు ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తంపై ట్యాక్స్(Tax) చెల్లించాలి. రేపటి నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ట్యాక్స్ గురించి పన్ను చెల్లింపుదారులు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఆదాయ పన్ను చట్టంలో కొన్ని సెక్షన్ల ప్రకారం, పన్ను ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఐదు పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ద్వారా ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అందిపుచ్చుకోవచ్చు. అవేంటో చూద్దాం.

* నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)

పోస్టాఫీస్ అందించే NSC స్కీమ్‌లో కనీసం రూ.1,000, ఆ తర్వాత రూ.100 గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లపై గరిష్ట పరిమితి లేదు. NSC మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు కాగా, ప్రస్తుత వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌పై రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు.

* సుకన్య సమృద్ధి యోజన (SSY)

పదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్ల పేరు మీద సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి అకౌంట్‌పై ప్రస్తుతం వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన కనీస ప్రారంభ డిపాజిట్ రూ.250 కాగా, గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జమ్షన్ అందిస్తుంది.

* పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్

ఇండియా పోస్ట్ అందించే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటుంది. ఈ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తారు. దీంట్లో కనీస పెట్టుబడి రూ.1,000 కాగా, గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. అయితే రూ.1.5 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలు ఉంటాయి. 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ కింద చేసిన పెట్టుబడిపై సెక్షన్ 80C ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్‌పై ప్రస్తుత వడ్డీ రేటు 7 శాతంగా ఉంది.

Monthly Income Scheme: ప్రతీ నెలా ఆదాయం ఇచ్చే స్కీమ్... రేపటి నుంచి డబుల్

* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. SCSS ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌తో వస్తుంది. దీనిపై సంవత్సరానికి 8 శాతం వడ్డీ రేటు ఉంటుంది. మెచ్యూరిటీ ముగిసిన తర్వాత ఐదేళ్ల టెన్యూర్ రెన్యువల్ చేసుకోవచ్చు. ఇందులో చేసే రూ.15 లక్షల వరకు పెట్టుబడిపై, సెక్షన్ 80C ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.

* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అకౌంట్‌లో చేయాల్సిన మినిమం డిపాజిట్ రూ. 500 కాగా, మ్యాగ్జిమం డిపాజిట్ లిమిట్ రూ.1.5 లక్షలుగా ఉంది. PPF ద్వారా ప్రతి సంవత్సరం కాంపౌండ్ వడ్డీ పొందవచ్చు. దీనిపై ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి కలిగిన PPF, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం మూడు రెట్లు పన్ను ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ స్కీమ్‌లో డిపాజిట్, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది.

First published:

Tags: Post office scheme, Tax benefits

ఉత్తమ కథలు