Home /News /business /

5 PENNY STOCKS THAT WENT ON TO BECOME LARGECAPS MK

Penny to Large Cap Journey: మార్కెట్‌ను శాసిస్తున్న ఈ స్టాక్స్..ఒకప్పుడు పెన్నీ స్టాక్స్ అంటే ఆశ్చర్యపోతారు..

 చరిత్రలోకి వెళితే  చాలా పెన్నీ స్టాక్‌లు మల్టీబ్యాగర్‌లుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు, ఆ పెన్నీ స్టాక్‌లలో అనేకం ఇప్పుడు లార్జ్‌క్యాప్‌లుగా మారాయి. అలా మీకు ఆశ్చర్యం కలిగించే స్టాక్స్ చాలా ఉన్నాయి. తొలినాళ్లలో మీరు వాటిని గుర్తించకపోవచ్చు, కానీ అనేక ప్రసిద్ధ పేర్లు గతంలో పెన్నీ స్టాక్‌లుగా తమ ప్రస్థానం స్టార్ట్ చేశాయి.

చరిత్రలోకి వెళితే చాలా పెన్నీ స్టాక్‌లు మల్టీబ్యాగర్‌లుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు, ఆ పెన్నీ స్టాక్‌లలో అనేకం ఇప్పుడు లార్జ్‌క్యాప్‌లుగా మారాయి. అలా మీకు ఆశ్చర్యం కలిగించే స్టాక్స్ చాలా ఉన్నాయి. తొలినాళ్లలో మీరు వాటిని గుర్తించకపోవచ్చు, కానీ అనేక ప్రసిద్ధ పేర్లు గతంలో పెన్నీ స్టాక్‌లుగా తమ ప్రస్థానం స్టార్ట్ చేశాయి.

చరిత్రలోకి వెళితే చాలా పెన్నీ స్టాక్‌లు మల్టీబ్యాగర్‌లుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు, ఆ పెన్నీ స్టాక్‌లలో అనేకం ఇప్పుడు లార్జ్‌క్యాప్‌లుగా మారాయి. అలా మీకు ఆశ్చర్యం కలిగించే స్టాక్స్ చాలా ఉన్నాయి. తొలినాళ్లలో మీరు వాటిని గుర్తించకపోవచ్చు, కానీ అనేక ప్రసిద్ధ పేర్లు గతంలో పెన్నీ స్టాక్‌లుగా తమ ప్రస్థానం స్టార్ట్ చేశాయి.

ఇంకా చదవండి ...
    Penny to Large Cap Journey: స్టాక్ మార్కెట్  మార్కెట్‌ లాభాలు పొందాలంటే రిస్క్ తప్పనిసరి, మల్టీ బ్యాగర్స్ కొనాలని ప్రతీఒక్కరూ అనుకుంటారు. అలాంటి మల్టీ బ్యాగర్స్ ఒక్కోసారి పెన్నీ స్టాక్స్ రూపంలో కూడా తగులుతుంటాయి. వాట ధర పావలా, అర్థరూపాయి ఉన్నప్పటికీ కోట్లు కురిపించే చాన్స్ ఉంది. అయితే దీని వెనుక పెద్ద మతలబు కూడా ఉంది. ఈ మధ్య కాలంలో లక్ష పెట్టుబడి పెడితే నెలలో కోటి లాంటి ఆర్టికల్స్ చదివి, ముందు వెనుక ఆలోచించకుండా పోనీలే కదా అని లక్ష పెట్టుబడి పెడితే మీ డబ్బు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు మీ డబ్బు ఇక తిరిగి రాదు. అయితే కొన్నిసార్లు సరైన సలహాలు, మార్కెట్ రీసెర్చ్, ఫండమెంటల్స్ పట్ల అవగాహన ఉన్నట్లయితే మాత్రం, పెన్నీ స్టాక్స్ బంగారు బాతులుగా మారడం ఖాయం. అయితే పెన్నీ స్టాక్స్ అన్నీ కూడా మోసపూరితమైనవి కాదు. చరిత్రలోకి వెళితే  చాలా పెన్నీ స్టాక్‌లు మల్టీబ్యాగర్‌లుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు, ఆ పెన్నీ స్టాక్‌లలో అనేకం ఇప్పుడు లార్జ్‌క్యాప్‌లుగా మారాయి. అలా మీకు ఆశ్చర్యం కలిగించే స్టాక్స్ చాలా ఉన్నాయి. తొలినాళ్లలో మీరు వాటిని గుర్తించకపోవచ్చు, కానీ అనేక ప్రసిద్ధ పేర్లు గతంలో పెన్నీ స్టాక్‌లుగా తమ ప్రస్థానం స్టార్ట్ చేశాయి.

    #1 భారతి ఎయిర్‌టెల్ (Bharati Airtel)

    భారతీ ఎయిర్‌టెల్ టెలికమ్యూనికేషన్ సేవలను అందించడంలో,  ప్రపంచంలోని ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లలో, ఎయిర్‌టెల్ 29.82% మార్కెట్ వాటాను కలిగి ఉంది. అయితే నేడు రూ.700 రేంజులో ట్రేడవుతున్న ఈ స్టాక్ డిసెంబర్ 2002లో, కంపెనీ షేర్లు ఒక్కొక్కటి రూ.11 వద్ద ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. అంటే అప్పట్లో  భారతీ ఎయిర్‌టెల్‌లో పెట్టిన రూ. 1 లక్ష ఈరోజు రూ.63.6 లక్షలుగా మారి ఉండేది.



    #2 ఐషర్ మోటార్స్ (Eicher Motors)

    రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌బైక్ బ్రాండ్ తో ఆటో మొబైల్ రంగంలో ఐషర్ మోటార్స్ తన సత్తా చాటుతోంది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మల్టీబ్యాగర్ షేర్లలో ఒకటిగా మారింది. 2000 సంవత్సరంలో, ఐషర్ మోటార్స్ షేర్లు దాదాపు రూ. 3-4 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే డిసెంబర్ 31, 2021లో ప్రస్తుతం ఒక్కో షేరు రూ. 2,588 వద్ద ట్రేడవుతోంది. ఇదిలా ఉంటే 2020లో స్టాక్ స్ప్లిట్‌ జరగక ముందు, ఐషర్ మోటార్స్ షేరు ధర ఏకంగా రూ. 22,000 దాటిందంటే మీరు నమ్మలేరేమో.

    #3 టైటాన్

    'టాటా వాచ్ ప్రాజెక్ట్‌'గా ప్రారంభమైన టైటాన్ కంపెనీ, దేశంలోనే అతిపెద్ద వాచ్ తయారీదారు.Fastrack, సొనాటా, స్కిన్ బై టైటాన్ మరియు మరిన్ని బ్రాండ్‌ల ద్వారా వాచీలు మాత్రమే కాకుండా నగలు, కళ్లజోళ్లు మరియు పెర్ఫ్యూమ్‌లను అందించడం ద్వారా కంపెనీ తన మార్కెట్ వాటాను విస్తరించింది. సంస్థ ఆభరణాల విభాగం, తనిష్క్, కంపెనీ మొత్తం ఆదాయంలో సగానికి పైగా వాటాను కలిగి ఉంది, ఇది కంపెనీకి అత్యంత లాభదాయకమైన విభాగంగా మారింది.



    2000 జనవరిలో కంపెనీ షేరు ధర 7 రూపాయలు. ప్రస్తుతం కంపెనీ షేర్లు ఒక్కో షేరు రూ.2,400 వద్ద ట్రేడవుతున్నాయి. 2002లో ఈ స్టాక్‌లో లక్ష రూపాయల పెట్టుబడి ఇప్పుడు 8 కోట్ల రూపాయలకు చేరింది.



    #4 బజాజ్ ఫైనాన్స్

    బజాజ్ ఫైనాన్స్ ఇది టాప్ భారతీయ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)గా పేరొందింది.  కస్టమర్ ఫైనాన్స్, చిన్న, మధ్య తరహా సంస్థలు (SME), వాణిజ్య రుణాలు ఇస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీలో దాదాపు 52.65% వాటాను కలిగి ఉంది. బజాజ్ ఫైనాన్స్ ప్రధానంగా టూ, త్రీ వీలర్ లోన్‌లపై దృష్టి పెడుతుంది. ఈ స్టాక్ ఒకప్పుడు 2001లో షేరు ధర రూ.2.40 పైసలు ఉన్న ఈ పెన్నీ స్టాక్, ప్రస్తుతం ఒక్కో షేరుకు రూ.7,450 చొప్పున ట్రేడవుతున్నాయి. అంటే 2001లో పెట్టిన లక్ష రూపాయల పెట్టుబడి రెండు దశాబ్దాల తర్వాత రూ.31 కోట్లు అవుతుంది.

    #5 JSW స్టీల్

    JSW స్టీల్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అతిపెద్ద ప్రైవేట్ రంగ స్టీల్ కంపెనీగా అవతరించింది. సంస్థకు దేశంలోనే అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్, విశాలమైన హాట్ స్ట్రిప్ మిల్లు ఉంది. ప్రపంచంలో మొదటిసారి 'గ్రీన్ స్టీల్'ను ఉత్పత్తి చేయడానికి కోరెక్స్ టెక్నాలజీని విజయవంతంగా ఉపయోగిస్తున్న కంపెనీగా సంస్థకు పేరుంది.  ఇక ఈ కంపెనీ కూడా పెన్నీ స్టాక్ గానే ప్రస్థాం స్టార్ట్ చేసింది. దీని షేరు ధర డిసెంబర్ 2001లో రూ. 2 నుండి ఒక్కొక్కటి రూ. 680కి పెరిగింది.  దాదాపు 33,900% లాభాన్ని నమోదు చేసింది. మీరు రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఈరోజు దాని విలువ దాదాపు రూ.3.4 కోట్లు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Multibagger stock, Stock Market

    తదుపరి వార్తలు