హోమ్ /వార్తలు /బిజినెస్ /

Demat account: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా..అయితే ఫ్రీ డీమ్యాట్ అకౌంట్స్ మీ కోసం...

Demat account: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా..అయితే ఫ్రీ డీమ్యాట్ అకౌంట్స్ మీ కోసం...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Demat account maintenance charges: మెయింటెనెన్స్ ఛార్జీలు లేకుండా ఉచితంగా డీమ్యాట్ అకౌంట్‌ను అందిస్తున్న బ్రోకరేజీ సంస్థల వివరాలు మీ కోసం..

స్టాక్ ఎక్స్చేంచ్‌లలో ట్రేడింగ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ఉండాలి. దీన్ని డీమెటీరియలైజ్డ్ అకౌంట్ అని కూడా అంటారు. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీలు వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. స్టాక్స్‌కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌ వివరాలన్నీ దీంట్లో కనిపిస్తాయి. డీమ్యాట్ అకౌంట్ ఉన్నవారికి ఇంటర్నెట్ పాస్‌వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్ అవసరం. ట్రాన్సాక్షన్స్ ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్ కోసం డీమ్యాట్ అకౌంట్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇది బ్యాంక్ అకౌంట్ మాదిరిగానే పనిచేస్తుంది. కానీ క్యాష్‌కు బదులుగా షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఎలక్ట్రానిక్ బాండ్లు వంటివి డిపాజిట్ అవుతాయి. డీమ్యాట్ అకౌంట్‌ తీసుకున్నవారు దాన్ని వినియోగించకున్నా మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాలి. కొన్నిసార్లు ఇది కస్టమర్లకు భారంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత్‌లోని కొన్ని బ్రోకరేజీ సంస్థలు జీవితకాలం ఉచితంగా డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లను అందిస్తున్నాయి.

డీమ్యాట్ అకౌంట్ ఒక స్టోరేజ్ అయితే ట్రేడింగ్ అకౌంట్ అనేది ఇంటర్‌ఫేజ్‌. కస్టమర్లు కొనుగోలు చేసిన షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు డీమ్యాట్ అకౌంట్‌లో డిపాజిట్ అవుతాయి. వీటిని ట్రేడింగ్ అకౌంట్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్‌లలో అమ్మవచ్చు, కొనుగోలు చేయవచ్చు. కొన్ని సంస్థలు డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లపై ఎలాంటి మెయింటెన్స్ ఛార్జీలనూ విధించట్లేదు. మరికొన్ని సంస్థలు లైఫ్‌టైమ్ ఫ్రీ డిమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లను అందిస్తున్నాయి.

ఐ ట్రేడ్ ఆన్‌లైన్ (iTradeOnline)

టెక్నాలజీ సహాయంతో iTradeOnline ద్వారా కస్టమర్లు సులభంగా స్టాక్స్ లావాదేవీలు చేసుకోవచ్చు. వినియోగదారులు ప్రతి ఆర్డర్‌కు రూ.20 లేదా 0.03 శాతంలో ఏది తక్కువగా ఉంటే, ఆ మొత్తాన్ని ఛార్జీగా చెల్లించాలి. అన్ని విభాగాల్లో దీని సాయంతో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ముందస్తు బ్రోకరేజ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఐ ట్రేడ్ ఆన్‌లైన్ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లపై టర్నోవర్ కమిట్‌మెంట్లు ఉండవు.

ప్రోస్టాక్స్ (Prostocks)

ఈ సంస్థను ఎస్ పి తోష్నివాల్, సౌరభ్ రాంకా అనే ఇద్దరు వ్యక్తులు 2016 ఫిబ్రవరిలో స్థాపించారు. ఈ సంస్థ ఈక్విటీ ట్రేడింగ్, కరెన్సీ ట్రేడింగ్, డెరివేటివ్స్ ట్రేడింగ్, డిపాజిటరీ సర్వీస్‌ల విభాగంలో సేవలు అందిస్తుంది. ప్రోస్టాక్స్‌లో ఇంట్రాడే, ఎఫ్ అండ్ ఓ ట్రేడ్ బ్రోకరేజ్‌పై రూ.15 తగ్గింపు లభిస్తుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు లేకుండా ఉచితంగా డీమ్యాట్ అకౌంట్‌ను పొందవచ్చు. ఆన్‌లైన్ విధానంలో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈక్విటీ డెలివరీ ట్రేడింగ్‌పై ఎలాంటి బ్రోకరేజీ ఛార్జీలు లేవు.

ఆర్‌మనీ (RMoney)

RMoney కూడా ఒక డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ. దీని ద్వారా కస్టమర్లు కమోడిటీ, ఈక్విటీ, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్, పీఎంఎస్‌లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అన్ని ఆర్థిక అవసరాలకు RMoney కామన్ ప్లాట్‌ఫాంలా పనిచేస్తుంది. దీని ద్వారా ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ తీసుకున్నవారు కమోడిటీ ట్రేడింగ్ కోసం పర్సనల్ డీలర్ సపోర్ట్ పొందవచ్చు. ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఛార్జీలు లేవు. ఇంట్రాడే ట్రేడింగ్‌పై పెద్దగా పరిమితులు ఉండవు. ఆర్ మనీ డీమ్యాట్ అకౌంట్‌పై లైఫ్‌టైమ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు లేవు. దీంతోపాటు వినియోగదారులు కస్టమైజ్డ్ బ్రోకరేజ్ ప్లాన్‌ పొందవచ్చు.

ట్రస్ట్‌లైన్ (Trustline)

ట్రస్ట్‌లైన్ అనేది ఈక్విటీ రిసెర్చ్, అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ. చెన్నైకి చెందిన ఈ సంస్థ మిడ్, స్మాల్ క్యాప్ ఫైనాన్షియల్ రిసెర్చ్‌పైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. ట్రస్ట్‌లైన్ ద్వారా ఎలాంటి ఛార్జీలు లేకుండా, ఉచితంగా లైఫ్‌టైమ్ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్‌లను కస్టమర్లు తీసుకోవచ్చు.

ఫిన్వాసియా (Finvasia)

దీన్ని ఫిన్‌టెక్ కంపెనీ స్థాపించింది. ఈ సంస్థ కూడా అన్ని రకాల ఆర్థిక సేవలను అందిస్తోంది. దీంట్లో బ్రోకరేజ్, అకౌంట్ ఓపెనింగ్, క్లియరింగ్స్, AMC వంటి ఛార్జీలన్నీ ఉచితం. ఇలాంటి జీరో ఛార్జీ ఆఫర్లతో కస్టమర్లు లబ్ధి పొందవచ్చు. డిస్కౌంట్ బ్రోకర్ అయిన ఫిన్వాసియా ఉచితంగా లైఫ్‌టైమ్ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్‌లను అందిస్తోంది.

Published by:Krishna Adithya
First published:

Tags: Stock Market

ఉత్తమ కథలు