5KG GAS : ఇకపై 5 కేజీల సిలిండర్ల పంపిణీ... కేంద్రం ఆలోచన...

Pradhan Mantri Ujjwala Yojana : మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక... నిరుపేదలకు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ఆల్రెడీ ఉన్న పథకాన్ని కొన్ని మార్పులతో విస్తరిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 29, 2019, 9:30 AM IST
5KG GAS : ఇకపై 5 కేజీల సిలిండర్ల పంపిణీ... కేంద్రం ఆలోచన...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం ద్వారా బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం... లోక్ సభ ఎన్నికల్లో గ్రామాల్లో మహిళల ఓట్లను ఎక్కువగా రాబట్టుకుంది. కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తరించబోతోంది. అదనంగా 5 కేజీల వంటగ్యాస్ సిలిండర్లను నిరుపేదలకు ఇవ్వబోతోంది. PMUY కింద పేదరిక రేఖకు దిగువన ఉండేవారికి వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ కనెక్షన్‌కీ రూ.1,600 ఇస్తోంది. కుటుంబంలోని మహిళ పేరున గ్యాస్ కనెక్షన్ ఇస్తోంది. అధికారిక వర్గాల ప్రకారం... కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉండేలా చెయ్యాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిసింది. ఇప్పటివరకూ 7కోట్ల 19 లక్షల మందికి కనెక్షన్లు ఇచ్చారు. ఇకపై ఈ స్కీం ప్రకారం 5 కేజీల సిలిండర్ల వాడకాన్ని తప్పనిసరి చెయ్యనున్నారు. తద్వారా ఈ సిలిండర్లు దేశమంతా అందుబాటులో ఉండి, అందరూ గ్యాస్ పై వంటలు చేసుకునే అవకాశం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.

ఉజ్వల స్కీంలో ఏడాదికి 3 శాతమే సిలిండర్ల రీఫిల్లింగ్ జరుగుతోంది. అదే... జాతీయ సగటు చూస్తే... ఏడాదికి 7 సిలిండర్ల రీఫిల్లింగ్ ఉంది. ఇందుకు కారణం... రీఫిల్లింగ్ చేస్తున్న సిలిండర్లలో చాలా వరకూ సబ్సిడీ లేనివి కావడమే. చిన్న సిలిండర్ల వాడకాన్ని పెంచితే, ఎక్కువ మంది వీటిని ఉపయోగిస్తే, యావరేజ్‌ వాడకం పెరుగుతుందని కేంద్రం లెక్కలేస్తోంది.

14.2 కేజీల సిలిండర్‌‌కి ఢిల్లీలో కస్టమర్ రూ.712 రూపాయలు చెల్లిస్తున్నాడు. సబ్సిడీ స్కీం కింద కేంద్రం రూ.214 రూపాయల్ని ఆ కుటుంబంలో మహిళ అకౌంట్‌లో వేస్తోంది. అదే విధంగా 5 కేజీల సిలిండర్‌కి రూ.260 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దానికి సబ్సిడీగా రూ.80 రూపాయలు ఇవ్వనుంది కేంద్రం.

 

ఇవి కూడా చదవండి :

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్... కాసేపట్లో కడపకు పయనం

ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోతాయా? బీజేపీ ప్లాన్ వేస్తోందా?
First published: May 29, 2019, 9:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading