ఆదాయపు పన్ను తగ్గించుకోవాలా? ఇలా చేయండి!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్... ట్యాక్స్ పేయర్స్‌కు ఇదో పెద్ద సవాల్. ఓవైపు గడువు ముంచుకొస్తుంటే టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వం నెల రోజులు గడువు పెంచింది. జూలై 31గా ఉన్న గడువును ఆగస్ట్ 31కి మార్చింది. అయినా ఇప్పటికీ చాలామంది ఐటీఆర్ ఫైల్ చేయలేదు. ఆదాయపు పన్నును వీలైనంతగా తగ్గించుకోవడానికి ఏమేం చేయాలో తెలియక తికమక పడటమే కారణం. ఏ ఖర్చులు ఏ సెక్షన్ కిందకు వస్తాయో కూడా అవగాహన ఉండదు కొందరికి. మీ ఆదాయపు పన్నును తగ్గించే ఐదు పన్ను మినహాయింపులేవో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 29, 2018, 4:45 PM IST

  • Share this:

1. ఇంటి అద్దె మినహాయింపు

మీ సాలరీ స్లిప్‌లో హెచ్‌ఆర్ఏ గురించి లేకపోయినా, మీరు ఉద్యోగస్తులు కాకపోయినా సెక్షన్ 80జీజీ కింద మీకు ఇంటి అద్దె మినహాయింపు వర్తిస్తుంది. మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు.
(i) మొత్తం ఆదాయంలో 10 % లోపు అద్దె.
(ii) మొత్తం ఆదాయంలో 25%
(iii) నెలకు రూ.5,000
వ్యక్తిగతం/హిందూ అవిభాజ్య కుటుంబం లేదా భాగస్వామి/పిల్లలు ఎలాంటి వసతి కలిగి ఉండకూడదు. అద్దె ఆదాయం ఉండకూడదు.

2. ఇంటి రుణంపై ఛార్జీలు, వాయిదాలు
మీరు ఈ మధ్యే హోమ్ లోన్ తీసుకున్నారా? అయితే మీరు ప్రాసెసింగ్ ఫీజ్‌తో పాటు ఇతర ఛార్జీలు కూడా చెల్లించి ఉంటారు కదా. ఈ ఫీజులను కూడా సెక్షన్ 24 కింద వడ్డీలా లెక్కేస్తారు. కాబట్టి వీటిని మినహాయింపుగా పొందొచ్చు. అంతేకాదు ఇంటికి డౌన్ పేమెంట్ కట్టేందుకు బంగారం తాకట్టు పెట్టి లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకున్న డబ్బుపైనా మినహాయింపు పొందొచ్చు. మీ దగ్గర సరైన లోన్ అగ్రిమెంట్ ఉంటే సెక్షన్ 24 కింద మీరు చెల్లించిన వడ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చు.

3. సేవింగ్స్/పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లో వడ్డీ
సేవింగ్స్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌పై వచ్చే వడ్డీని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా పరిగణిస్తారు. అయితే మీరు సెక్షన్ 80టీటీఏ కింద రూ.10,000 వరకు మినహాయింపు పొందొచ్చు. మీ పిల్లలు వికలాంగులైతే వారి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటి సేవింగ్స్ చేస్తే దానిపై వచ్చిన వడ్డీని వేరుగా చూపించుకోవచ్చు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా చూపించాల్సిన అవసరం లేదు.

4. స్పెసిఫైడ్ డిసీజెస్
నాడీ సంబంధ వ్యాధులు, ప్రాణాంతక క్యాన్సర్లు, ఎయిడ్స్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి కొన్ని వ్యాధులన్నీ స్పెసిఫైడ్ డిసీజెస్ విభాగంలోకి వస్తాయి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఇలాంటి వ్యాధులకు చికిత్స పొందుతున్నట్టైతే ట్రీట్మెంట్ ఖర్చు లేదా రూ.40 వేల వరకు ఏది తక్కువైతే అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పరిమితి 60-79 ఏళ్ల సీనియర్ సిటిజన్లకు రూ.60 వేలు, 80ఏళ్లు పైబడ్డ సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.80 వేలు.

5. వైకల్యం
40% వైకల్యం ఉన్నవారు 80యూ కింద రూ.75,000 వరకు, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా 40% వైకల్యంతో బాధపడుతుంటే సెక్షన్ 80డీడీ కింద రూ.75,000 వరకు, 80 % వైకల్యం ఉంటే రూ.1,25,000 వరకు మినహాయింపు పొందొచ్చు.

ఇవి కూడా చదవండి:

#జర భద్రం: ఐటీఆర్ రీఫండ్ మెసేజ్ వచ్చిందా?

ఐటీ రిటర్న్స్‌: ఈ 10 టిప్స్ మీకోసమే!

ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్: 10 లాభాలు

ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేస్తున్నారా? ఇది మీకోసమే!

Photos: ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేస్తున్నారా? ఈ 5 మర్చిపోకండి!
Published by: Santhosh Kumar S
First published: August 29, 2018, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading