Gmail Hidden Features: జీమెయిల్‌లో మీకు తెలియని 5 సీక్రెట్ ఫీచర్స్.. చూస్తే వావ్ అనాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలో ఎంతో పేరుపొందిన ఈమెయిల్ సర్వీసులలో జీమెయిల్ ఒకటి. ఇందులో చాలా మందికి తెలియని ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. అయితే యూజర్లకు బాగా ఉపయోగకరమైన 5 సీక్రెట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

  • Share this:
ప్రపంచంలో ఎంతో పేరుపొందిన ఈమెయిల్ సర్వీసులలో జీమెయిల్ ఒకటి. ఇందులో చాలా మందికి తెలియని ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. అయితే యూజర్లకు బాగా ఉపయోగకరమైన 5 సీక్రెట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

1. స్మార్ట్ కంపోజ్:

స్మార్ట్ కంపోజ్ ఫీచర్ యూజర్లు ఏం టైప్ చేయబోతున్నారో ముందుగానే ఊహిస్తుంది. ఊహించిన పదాలను మెయిల్ బాక్స్ లో ఇన్సర్ట్ చేయడానికి కూడా స్మార్ట్ కంపోజ్ అనుమతిస్తుంది. ఇందుకు, ట్యాబ్ కీ పై ప్రెస్ చేయాలి. మొబైల్ యూజర్లు ప్రెడిక్ట్ చేసిన పదాల చివర టాప్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి జీమెయిల్ సెట్టింగ్స్ లో "Smart Compose" పై క్లిక్ చేయాలి. తర్వాత "Writing Suggestions On" పై క్లిక్ చేయాలి.

2. షెడ్యూల్ ఈమెయిల్‌ :

షెడ్యూల్ ఫీచర్ ద్వారా ఈమెయిల్‌లను షెడ్యూల్ చేసి సెండ్ చేయొచ్చు. ఇందుకు కంప్యూటర్ లో ఈమెయిల్ కంపోజ్ చేసిన తర్వాత కుడివైపు ఉన్న యారో(arrow) పై క్లిక్ చేయండి. తరువాత “Schedule send” పై క్లిక్ చేయండి. మీరు ఏ టైం కి ఈమెయిల్ షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో.. “Pick date & time” ఆప్షన్ పై క్లిక్ చేసి టైం సెట్ చేయండి. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లలో కూడా “Schedule send” ఫీచర్ ఉంటుంది. మెయిల్ కంపోజ్ చేసిన తరువాత కుడివైపు పైభాగంలో ఉన్న మూడు డాట్స్ పై క్లిక్ చేయాలి. తర్వాత Schedule send పై క్లిక్ చేసి టైం సెట్ చేసుకోవాలి.

3. మెసేజ్ ఫాస్టర్:

ఈ ఫీచర్ ఆర్కైవ్ లేదా డిలీట్ చేసిన వెంటనే మీ లిస్ట్ లోని నెక్స్ట్ లేదా మునుపటి ఈమెయిల్‌ను చూపిస్తుంది. ఈ ఫీచర్ ను జీమెయిల్ డెస్క్‌టాప్ వెర్షన్‌, ఆండ్రాయిడ్‌లో యాక్సెస్ చేయవచ్చు. iosలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు.

4. ఒకే పేజీలో ఎక్కువ మెయిల్‌లు:

ఈ జీమెయిల్ సెట్టింగ్ ద్వారా మీరు మరిన్ని మెయిల్‌లను ఒకేసారి చదవచ్చు. దీని కోసం మీరు జీమెయిల్ జనరల్ ట్యాబ్ సెట్టింగ్‌లలో మాగ్జిమం పేజీ సైజును మార్చాలి. ఇలా చేస్తే డిఫాల్ట్‌గా ఉన్న 50 మెయిల్స్ కి బదులుగా ప్రతి పేజీకి 100 మెయిల్‌లను చూడొచ్చు.

5. డేట్ తో ఈమెయిల్‌ సెర్చ్:

ఓల్డ్ ఈమెయిల్‌ను కనిపెట్టాలంటే, మీరు సెర్చ్ చేసేటప్పుడు "Before:" యూజ్ చేయాలి. లేదా "After:" యూస్ చేయొచ్చు. ఉదాహరణకి మీరు 2010 కంటే ముందుగా వచ్చిన మెయిల్స్ కనిపెట్టాలి అనుకుంటే.. "Before:2010" అని ఈమెయిల్ సెర్చ్‌బాక్స్‌లో టైప్‌ చేసి ఎంటర్ చేయాలి. 2010 తరువాత వచ్చిన ఈమెయిల్స్ కోసం "After:2010" అని సెర్చ్‌బాక్స్‌లో టైప్‌ చేసి ఎంటర్ చేయాలి. నెల, తేదీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి "After:10/10/2010" అని టైప్‌ చేసి ఎంటర్ చేస్తే.. 2010, 10వ నెల, 10వ తేదీ తర్వాత మీకు వచ్చిన ఈ-మెయిల్స్ కనిపిస్తాయి.
Published by:Krishna Adithya
First published: