• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • 30 MID AND SMALL CAP STOCKS YOU CAN BET ON AT CURRENT LEVELS MK GH

Mid And Small Cap Stocks: మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ కోసం చూస్తున్నారా? వీటిపై ఒక కన్నేయండి

Mid And Small Cap Stocks: మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ కోసం చూస్తున్నారా? వీటిపై ఒక కన్నేయండి

ప్రతీకాత్మకచిత్రం

బడ్జెట్ తరువాత ఈ మార్పులు వస్తున్నట్లు సూచీల ప్రస్తుత ధోరణిని బట్టి అంచనా వేయవచ్చు. నిఫ్టీలో తదుపరి మార్పులను అంచనా వేయడానికి బ్యాంకింగ్ ఇండెక్స్‌ను గమనించాలని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

  • Share this:
    గత కొన్ని రోజులుగా బెంచ్ మార్క్ సూచీలను పరిశీలిస్తే స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ రెండూ మంచి లాభాలను సాధిస్తున్నట్లు తెలుస్తోంది. 2021 ఫిబ్రవరి 10 నాటికి నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్టాక్స్ 0.79 శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 కూడా 0.74 శాతం లాభాలను సాధించాయి. బడ్జెట్ తరువాత ఈ మార్పులు వస్తున్నట్లు సూచీల ప్రస్తుత ధోరణిని బట్టి అంచనా వేయవచ్చు. నిఫ్టీలో తదుపరి మార్పులను అంచనా వేయడానికి బ్యాంకింగ్ ఇండెక్స్‌ను గమనించాలని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బుల్లిష్ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని dips కొనుగోళ్లు కొనసాగించాలని సూచిస్తున్నారు. వీటిల్లో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం వీటిని కొనుగోలు చేయవచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

    గత వారం బెంచ్‌మార్క్ సూచీలు 9 శాతానికి పైగా పెరిగాయి. దీంతో నిఫ్టీ 1300 పాయింట్లు, సెన్సెక్స్‌ 4446 పాయింట్లకు చేరుకుంది. Ace ఈక్విటీ డేటా కూడా ఇదే ఫలితాలను ఊహించినా బ్రాడర్ మార్కెట్లు పరిగణనలోకి తీసుకోలేదు. దీని ప్రకారం రివ్యూకు ముందు ఫిబ్రవరి 5తో ముగిసిన వారానికి నిఫ్టీ మిడ్ క్యాప్ 7 శాతానికి పైగా లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 6 శాతానికి పైగా లాభాలను సాధించింది. బడ్జెట్ తరువాత ఇండెక్స్ పెరుగుదల ఒక స్థాయికి చేరి కొనసాగుతోంది. దీంతోపాటు మార్కెట్ కన్సాలిడేషన్ కూడా ఉండటంతో ఎక్కువ లాభాల కోసం ఇన్వెస్టర్లు స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్‌ను కోరుకుంటున్నారు. ఇందుకు RSI లేదా రిలేటివ్ స్ట్రెన్త్ ఇండెక్స్ వంటి టెక్నికల్ ఇండికేటర్లు overbought, oversold కండిషన్‌కు అనుగుణంగా స్టాక్‌లను తెలియజేస్తున్నాయి.

    ప్రస్తుతం మార్కెట్లలో స్టాంగ్ అప్‌వర్డ్ ట్రాజెక్టరీ కనిపిస్తోంది. దీంతో RSI ద్వారా అధిక కొనుగోళ్లు నమోదవుతున్న పరిస్థితుల్లో అమ్మకాల ఒత్తిడిని అధిగమించే స్క్రిప్‌లను ఎంచుకోవచ్చు. ఇది కొత్త బుల్లిష్ జోన్‌లో మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఒకవేళ ఇవే పరిస్థితులు స్థిరంగా ఉంటే సమీప భవిష్యత్తులో లాభాలు 25 శాతానికి పైగా ఉండవచ్చు. వీటన్నింటిని బట్టి చూస్తే మిడ్ క్యాప్‌లతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో స్మాల్ క్యాప్స్‌ను ఎంచుకోవడం మంచిదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు 30 మిడ్, స్మాల్ క్యాప్‌లను ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు. వీటిల్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఏజిస్ నుంచి 20 స్టాక్స్‌ను ఎంచుకోవచ్చు. అవేంటంటే...

    1. ఏజిస్ లాజిస్టిక్స్
    2. అఫ్లే (ఇండియా) లిమిటెడ్
    3. బజాజ్ ఎలక్ట్రికల్స్
    4. బిర్లా కార్పొరేషన్
    5. CEAT
    6. సెంచరీ ప్లైబోర్డ్స్
    7. దిలీప్ బిల్డ్‌కాన్
    8. డిక్సన్ టెక్నాలజీస్
    9. ఈక్విటాక్స్ హోల్డింగ్స్
    10. గ్రాఫైట్ ఇండియా
    11. HEG
    12. హిడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా
    13. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్
    14. ఇండియామార్ట్ ఇంటర్‌మెష్
    15. ఇండియన్ బ్యాంక్
    16. కజారియా సిరామిక్స్
    17. కల్పతరూ పవర్ ట్రాన్స్మిషన్
    18. కరూర్ వైశ్యా బ్యాంక్
    19. KEC ఇంటర్నేషనల్
    20. పర్సిస్టెంట్ సిస్టమ్స్

    నిఫ్టీ మిడ్ క్యాప్ 100లో 10 స్టాక్స్
    1. అదానీ ఎంటర్ ప్రైజెస్
    2. అపోలో టైర్స్
    3. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
    4. కెనరా బ్యాంక్
    5. కమ్మిన్స్ ఇండియా
    6. ఇమామీ
    7. గుజరాత్ గ్యాస్
    8. IRCTC
    9. TVS మోటార్
    10. వోల్టాస్
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు