Home /News /business /

3 TIERS OF 120 BIRDS LAYER CAGE SEMI AUTOMATIC CAGE SYSTEM IS LOWER COST MK

Business Ideas: పెరట్లోనే కోళ్ల ఫారం...పెద్ద స్థలం అవసరం లేదు...నెలకు రూ.20 వేల వరకూ ఆదాయం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పొట్ట చేతపట్టుకొని వలస పోతున్న వారుసైతం ఈ పద్ధతిలో కోళ్లను పెంచితే మంచి ఆదాయం లభిస్తుంది. గుడ్లు పెట్టగలిగే 120 కోళ్లను పెరట్లో సునాయాసంగా పెంచుకునే ‘త్రీ టైర్‌ కేజ్‌ సిస్టమ్‌’ గురంచి తెలుసుకోండి. వీటిని ఇంటి వెనుక పెరట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కేజ్‌ని ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందవచ్చు.

ఇంకా చదవండి ...
  3 tier poultry cage: కరోనా కాలంలో చాలా మంది యువత పట్టణాల్లో ఉద్యోగాలు కోల్పోయి పల్లెలకు చేరారు. అయితే ఇకపై పట్టణాలకు వలస వెళ్లే దుస్థితి లేకుండా కొన్ని మార్గాల్లో వ్యవసాయం చేస్తే ఆదాయం లభిస్తుంది. ఉన్న గ్రామంలోనే ఉంటూ కొద్ది పాటి శ్రమతో, కాస్త పెట్టుబడితో నిరంతరం ఆదాయం పొందవచ్చు. అదే కోళ్ల పెంపకం, నిజానికి కోళ్ల ఫారం అనగానే ఎకరాల కొద్దీ స్థలం, పెద్ద పెట్టుబడి గుర్తొస్తాయి. కానీ పెరట్లోనే గుడ్లు పెట్టే కోళ్ల పెంపకానికి చిన్నపాటి పంజరం ఏర్పాటు చేసుకుంటే చాలు. నెలకు రూ. 10 నుంచి 20 వేల ఆదాయం పొందవచ్చు.  పొట్ట చేతపట్టుకొని వలస పోతున్న వారుసైతం ఈ పద్ధతిలో కోళ్లను పెంచితే మంచి ఆదాయం లభిస్తుంది. గుడ్లు పెట్టగలిగే 120 కోళ్లను పెరట్లో సునాయాసంగా పెంచుకునే ‘త్రీ టైర్‌ కేజ్‌ సిస్టమ్‌’ గురంచి తెలుసుకోండి. వీటిని ఇంటి వెనుక పెరట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కేజ్‌ని ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందవచ్చు.

  ఈ త్రీ టైర్ కేజ్ సిస్టం ఏర్పాటుకు 8 అడుగులు వెడల్పు, 8 అడుగుల పొడవున స్థలం అవసరమవుతుంది. గుడ్లు పెట్టే కోళ్లను పెంచుకునేందుకు మూడు అంతస్థుల పంజరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు 7.5 అడుగులు, వెడల్పు 7 అడుగులు, ఎత్తు 7 అడుగులు ఉంటుంది. ఒక వైపు 3 కానాలు, రెండో వైపు మరో 3 కానాలను కోళ్ల కోసం ఏర్పాటు చేశారు. దీనికిపైన 20 లీటర్ల ఫైబర్‌ ట్యాంకు ఏర్పాటు చేసుకోవాలి. రోజూ దీన్ని నింపితే చాలు. ఆ నీరు కోళ్లకు అందుబాటులోకి వస్తాయి.

  18-19 వారాల వయసు నుంచి కోడి గుడ్లు పెట్టటం ప్రారంభిస్తుంది. ఆ వయసులో ఉన్న 120 కోళ్లను పెంచుకోవటం ప్రారంభిస్తే సుమారు సంవత్సర కాలం పాటు అవి గుడ్లు పెడతాయి. ఆ కోళ్లను అమ్మేసి.. మళ్లీ గుడ్లు పెట్టే వయసున్న కోడి పెట్టలను కొనుక్కొని పంజరంలో పెంచుకోవచ్చు. 120 కోళ్లలో రోజుకు కనీసం 110 గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది.

  కోళ్లను పంజరంలో ఉంచే పెంచాలి. బయటకు వదిలే అవసరం లేదు. తెల్లవారుజామున 120 కోళ్లకు దాణాను వేయాలి. పంజరం పైన 6 అడుగుల ఎత్తులో అమర్చిన చిన్న ట్యాంకులో 20 లీటర్ల నీరు పోయాలి. కోళ్లు ముక్కుతో పొడిస్తే నీరు అందుబాటులోకి వచ్చి వాటి దాహం తీర్చే ఏర్పాటు ఈ పంజరంలో ఏర్పాటు చేసుకోవాలి. సాయంత్రం దాణాను వేయాలి. రాత్రి లైట్లు తీసివేయాలి.. అంతే. నేలకు కొంత ఎత్తున కోళ్లు పంజరంలో ఉంటాయి కాబట్టి పాములు, కుక్కల బెడద ఉండదు.

  ‘త్రీ టైర్‌ కేజ్‌ సిస్టమ్‌’


  ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నపాటి కోళ్ల ఫారాన్ని నిర్వహించడం పెద్ద కష్టం ఏమీ ఉండదు. గుడ్లను ఇంటి దగ్గరే స్వయంగా అమ్ముకోవచ్చు. గుడ్లు పెట్టే వయసున్న 120 కోళ్లతో పాటు మూడు అంతస్థుల కేజ్‌ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలంటే రూ.40 నుంచి 50 వేల వరకు ఖర్చవుతుంది. ఇంటి దగ్గరే గుడ్లను మార్కెట్ రేటు ప్రకారం అమ్ముకోవచ్చు. ఇతరత్రా ఖర్చులు పోను ఒక్కో పంజరం నుంచి నెలకు రూ. పది నుంచి 20 వేల నికరాదాయం వస్తుంది.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Business Ideas

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు