news18
Updated: November 10, 2020, 2:48 PM IST
ప్రతీకాత్మకచిత్రం
- News18
- Last Updated:
November 10, 2020, 2:48 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ 270 ఎలక్ట్రోరల్ ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది ఆయన అధికారిక ప్రమాణస్వీకారం ఉండనుంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం బంగారం ధరలపై కనిపించింది. జో బిడెన్ విజయంపై అంచనాల మధ్య వారాంతాన బంగారం ధరలు బలపడ్డాయి. మరోవైపు తాజాగా పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లు చేపట్టడంతో ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు మరింతగా వేడెక్కాయి. దీంతో బంగారం, వెండి ధరలు జోరందుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో బిడెన్ గెలుపు భారత్ లో బంగారం ధరలపై ప్రభావం చూపనుందా..?
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పటికీ, సెనేట్ నియంత్రణ స్థితి మాత్రం ఇంకా పరిష్కరించబడలేదు. విజయం దాదాపు ఖాయమైనప్పటికీ జార్జియాలో జరిగే రెండు సెనేట్ రన్ ఆఫ్ రేసుల కోసం డెమొక్రాట్లు జనవరి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అప్పటివరకు ఈ సందిగ్ధత కొనసాగుతుంది. కరోనావైరస్-తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అమెరికా ప్రభుత్వం గణనీయమైన ఉద్దీపన ప్యాకేజీని అమలు చేసింది. దీంతో ఆసియా మార్కెట్ ప్రారంభ సెషన్లో పసిడి ధరలు పెరిగాయి.
జోబిడెన్ గెలుపు, భారీ ఉద్దీపన ప్యాకేజీ అంచనాల నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి పెరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు వరకు ప్యాకేజీలపై సందిగ్ధత కారణంగా అటు ఈక్విటీ, ఇటు బులియన్ మార్కెట్లు ఆచితూచి వ్యవహరించాయి. భారీ ప్యాకేజీ ప్రకటించేందుకు జో బిడెన్ సానుకూలంగా ఉండటంతో డాలర్ వాల్యూ బలహీనపడింది. దీనికితో బంగారంపై కూడా ఒత్తిడి పెరిగింది. దీర్ఘకాలిక యుఎస్ ట్రెజరీ బాండ్ దిగుబడి పడిపోవడంతో డాలర్ తక్కువ ఆకర్షణీయమైన పెట్టుబడిగా మారనుంది. తద్వారా మార్కెట్లో పసిడి డిమాండ్ బాగా పెరుగుతుంది.
ఊహించిన దానికంటే చిన్న ఉద్దీపన ప్రకటించడం
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి తానే ఎన్నిక అవుతాననే అంచనాతో ఎన్నికల అనంతర భారీ ఉద్దీపన ప్యాకేజీపై ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఆయన ఓడిపోవడంతో కొద్ది వారాలు మాత్రమే అధ్యక్ష పదవి ఉండనున్నాడు. ప్రస్తుతం, విభజించబడిన కాంగ్రెస్ ద్వారా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆయనకు రాజకీయ ప్రోత్సాహం లేదా మూలధనం కూడా లేదు. కాగా, జో బిడెన్ అధ్యక్షడిగా ఎన్నికవడానికి కావాల్సిన మెజార్టీ సాధించినప్పటికీ, సెనేట్లో కూడా మెజారిటీ సాధించాల్సి ఉంది. అప్పుడే బిడెన్, పెలోసి, సెనేట్ డెమొక్రాటిక్ నాయకుడు చక్ షుమెర్ తమ సొంత ప్రణాళికను ముందుకు తీసుకురాగలుగుతారు. ట్రంప్ పరిపాలనలో జరిగిన ఖర్చుల స్థాయిని నిరోధించడానికి రిపబ్లికన్ సెనేట్ చర్యలు చేపట్టనుంది. ఇది సుమారు 1.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుదంని అంచనా.
అయితే, డెమోక్రాట్లు తాము గెలిస్తే 2.4 ట్రిలియన్ డాలర్ల పెద్ద ఉద్దీపన ప్యాకేజీ అందించాలని ఇదివరకు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనితో పోలిస్తే రిపబ్లికన్లు ప్రకటించిన ప్యాకేజీ ఊహించిన దాని కంటే తక్కువగా ఉండటం బంగారం ధరలు పెరగడానికి దోహధం చేస్తుంది. అమెరికన్ ప్రజలకు కోవిడ్–19 అదనపు తక్షణ సహాయం అందించకపోవడం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రమాదం కలిగిస్తుందని, ఇది దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు
ఫెడ్ రిజర్వ్ విధాన వైఖరి : ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటైన ఫ్రెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని చెక్కుచెదరకుండా చేసింది. అంతేకాక, రికవరీని కొనసాగించడానికి ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేసింది. దీనిపై ఛైర్మన్ పావెల్ మాట్లాడుతూ, ‘‘ఆర్థిక వ్యవస్థ ఇంకా ఊహించిన దానికంటే మెరుగ్గా వృద్ధి చెందుతున్నప్పటికీ, అమెరికాలో కోవిడ్–19 కేసుల పెరుగుదల దీనికి ఆటంకం కలిస్తుంది. దీని కారణంగా యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ గత ఐదు నెలల్లో అతి తక్కువ ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలిగింది. ఎక్కువ మంది అమెరికన్లు పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు.’’ అని అన్నారు.ఆర్థికంగా బలోపేతంగా ఉన్న అమెరికాలోనే పరిస్థితి ఇలా ఉంటే, ప్రపంచంలోనే జనాభాలో రెండో అతిపెద్ద దేశం అయిన భారత్లో మరిన్ని అదనపు ఉద్దీపన అవసరాన్ని గుర్తుచేసింది. తద్వారా రాబోయే రోజుల్లో పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 10, 2020, 2:42 PM IST