ఎస్‌బీఐ కస్టమర్లకు నేడు డెడ్ లైన్.. మీరు మొబైల్ అప్ డేట్ చేశారా?

మీ దగ్గరున్న కార్డు మ్యాగ్నెటిక్ స్ట్రైప్‌దా లేక ఈఎంవీదా అని ఎలా తెలుస్తుంది? ఇది తెలుసుకోవడం చాలా సులువు. కార్డు ముందు వైపు గోల్డెన్ చిప్ ఉంటే అది ఈఎంవీ కార్డు. మీ దగ్గర అలాంటి కార్డు ఉంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కార్డుపై చిప్ లేకపోతే నేరుగా మీ హోం బ్రాంచ్‌కు వెళ్లి కార్డు రీప్లేస్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కూడా కార్డు రీప్లేస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: November 30, 2018, 8:47 AM IST
ఎస్‌బీఐ కస్టమర్లకు నేడు డెడ్ లైన్.. మీరు మొబైల్ అప్ డేట్ చేశారా?
SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? మారిన ఎస్‌బీఐ రూల్స్ ఇవే
  • Share this:
మీకు బ్యాంకులో ఖాతా ఉందా? ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా పర్లేదు. కానీ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటే మాత్రం వెంటనే అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే... కస్టమర్లకు ఎస్‌బీఐ కొన్ని డెడ్‌లైన్స్ విధించింది. ఆ డేట్స్ గుర్తుపెట్టుకొని అందుకు తగ్గట్టుగా మీరు మీ ఖాతా విషయంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఆ తేదీలేంటీ? అంతలోపు మీరు ఏం చేయాలి? తెలుసుకోండి.

నవంబర్ 28

మీరు ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి కొత్త ఏటీఎం కార్డు తీసుకొని దాన్ని ఇంకా యాక్టివేట్ చేయలేదంటే... బ్లాక్ అయిపోతుంది జాగ్రత్త. ఖాతాదారులకు స్వయంగా ఎస్‌బీఐ యాజమాన్యం ఇచ్చిన వార్నింగ్ ఇది. నవంబర్ 28 లోగా కొత్త కార్డుల్ని యాక్టివేట్ చేసుకోకపోతే బ్లాక్ చేస్తామని కొద్ది రోజుల క్రితమే హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ గైడ్‌లైన్స్ ప్రకారం మ్యాగ్నెటిక్ కార్డులు వెనక్కి తీసుకొని... వాటి స్థానంలో చిప్ కార్డులు ఇస్తోంది ఎస్‌బీఐ. ఇప్పటికే చాలామంది కొత్త కార్డులు తీసుకున్నారు. కానీ యాక్టివేట్ చేయలేదు. దీంతో వాటిని నవంబర్ 28 లోగా యాక్టివేట్ చేయకపోతే బ్లాక్ చేస్తామంటోంది. అదే జరిగితే మళ్లీ కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే.

ఎస్‌బీఐ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన 3 డెడ్‌లైన్స్ ఇవే..., 3 Deadlines for SBI Customers, Link Mobile Number, Apply for EMV Chip Card, Activate Card
స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా


నవంబర్ 30
మీరు ఎస్‌బీఐ ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని వినియోగించుకుంటున్నారా? అయితే మీరు వెంటనే మీ మొబైల్ నెంబర్‌ను బ్యాంకులో రిజిస్టర్ చేయించాలి. ఇందుకోసం చివరి తేదీని నవంబర్ 30 అని గతంలోనే ప్రకటించింది ఎస్‌బీఐ. అంతలోపు మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయకపోతే డిసెంబర్ 1 నుంచి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఆగిపోతాయి. ఇంటర్నెట్ బ్యాంకు సేవల్ని వినియోగించుకోవాలనుకుంటే... కస్టమర్లు తమ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి లేదా ఆన్‌లైన్‌లో మొబైల్ నెంబర్స్ రిజిస్టర్ చేయించుకోవాలి. ఇప్పటికే ఫోన్ నెంబర్ ఇచ్చినవారికి ఏ సమస్యా లేదు. కస్టమర్లకు ఇ-మెయిల్ అలర్ట్స్‌తో పాటు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ నిబంధనను అమలు చేస్తోంది ఎస్‌బీఐ.

మొబైల్ నెంబర్ ఎలా రిజిస్టర్ చేయించాలి?మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్‌బ్యాంకింగ్ వెబ్‌సైట్ onlinesbi.com క్లిక్ చేయాలి. లాగిన్, పాస్‌వర్డ్ వివరాలు ఎంటర్ చేయాలి. 'మై అకౌంట్ అండ్ ప్రొఫైల్' ట్యాబ్‌ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత 'ప్రొఫైల్ ట్యాబ్' పైన క్లిక్ చేయాలి. 'పర్సనల్ డీటైల్స్/మొబైల్' పైన క్లిక్ చేయాలి. ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. (యూజర్ పాస్‌వర్డ్, ప్రొఫైల్ పాస్‌వర్డ్ వేర్వేరు)
ఆ తర్వాత మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. లేదంటే నేరుగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు అప్‌డేట్ చేయొచ్చు.

ఎస్‌బీఐ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన 3 డెడ్‌లైన్స్ ఇవే..., 3 Deadlines for SBI Customers, Link Mobile Number, Apply for EMV Chip Card, Activate Card

డిసెంబర్ 31
మీ ఏటీఎం కార్డు మ్యాగ్నెటిక్ స్ట్రైప్‌తో ఉందా? అయితే ఆ కార్డును వెంటనే మార్చుకోవాలి. ఆ కార్డు స్థానంలో ఈఎంవీ చిప్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు... ఖాతాదారుల లావాదేవీలకు మరింత సెక్యూరిటీ ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కీలక నిర్ణయం ఇది. చాలాకాలంగా ఈఎంవీ చిప్ కార్డుల్ని జారీ చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు డిసెంబర్ 31 లోగా ఖాతాదారులందరూ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులను చిప్ కార్డులతో రీప్లేస్ చేసుకోవాలని ఎస్బీఐ గతంలోనే సూచించింది. ఇప్పటికే చాలామంది తమ కార్డుల్ని మార్చుకున్నారు. అయితే ఇంకా కార్డు మార్చుకోవాల్సినవాళ్లు ఉన్నారు. డిసెంబర్ 31 లోగా కార్డు మార్చుకోకపోతే... ఇక మీ దగ్గర ఉన్న కార్డు పనిచేయదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లే కాదు... అన్ని బ్యాంకుల కస్టమర్లూ తమ దగ్గరున్న మ్యాగ్నెట్ స్ట్రైప్ డెబిట్, క్రెడిట్ కార్డుల్ని డిసెంబర్ 31 లోగా మార్చుకొని ఈఎంవీ కార్డులు తీసుకోవాల్సిందే.

కార్డు ఎలా గుర్తించాలి?
మరి మీ దగ్గరున్న కార్డు మ్యాగ్నెటిక్ స్ట్రైప్‌దా లేక ఈఎంవీదా అని ఎలా తెలుస్తుంది? ఇది తెలుసుకోవడం చాలా సులువు. కార్డు ముందు వైపు గోల్డెన్ చిప్ ఉంటే అది ఈఎంవీ కార్డు. మీ దగ్గర అలాంటి కార్డు ఉంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కార్డుపై చిప్ లేకపోతే నేరుగా మీ హోం బ్రాంచ్‌కు వెళ్లి కార్డు రీప్లేస్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కూడా కార్డు రీప్లేస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్ చూడండి.
https://bank.sbi/portal/web/personal-banking/magstripe-debit-cardholders

ఇవి కూడా చదవండి:

ఎన్నికల్లో అక్రమాలపై సీవిజిల్ యాప్‌లో ఇలా ఫిర్యాదు చేయండి...

టీవీ, ఫ్రిజ్ కొంటారా? ధరలు పెరగనున్నాయి...

ఫ్లిప్‌కార్ట్ హానర్ డేస్ సేల్‌లో ఆఫర్లు ఇవే...

యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?
Published by: Santhosh Kumar S
First published: November 30, 2018, 8:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading