Alibaba Market : రూ. 25లక్షల కోట్లు మాయం.. "ఆలీబాబా"కు న‌ష్టం ఏం జ‌రిగింది?

అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా

Alibaba : పాల‌కుల విధానాల‌ను ఎదురు చెప్తే ఎలా ఉంటుందో చూడాలంటే ఈ-కామర్స్‌ (E-Commerce) సంస్థ  వ్యవస్థాపకుడు జాక్ మాను చూస్తే తెలుస్తుంది. ప్ర‌భుత్వ విధానాల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్యల‌తో ఆగ్ర‌హం చెందిన ప్ర‌భుత్వం సంస్థ‌ను దెబ్బ‌తీసింది. దీంతో ఆలీబాబా సంస్థ 344 బిలియన్‌ డాలర్లు న‌ష్ట‌పోయింది.

 • Share this:
  పాల‌కుల విధానాల‌ను ఎదురు చెప్తే ఎలా ఉంటుందో చూడాలంటే ఈ-కామర్స్‌ (E-Commerce) సంస్థ  వ్యవస్థాపకుడు జాక్ మాను చూస్తే తెలుస్తుంది. ప్ర‌భుత్వ విధానాల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్యల‌తో ఆగ్ర‌హం చెందిన చైనా (China) ప్ర‌భుత్వం ఆయ‌న‌ను సాంకేతికంగా ఇబ్బంది పెట్టింది దీంతో ఆయ‌న 344 బిలియన్‌ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 25లక్షల కోట్లకుపైగా న‌ష్ట‌పోయారు. ప్ర‌పంచంలో ఈ ఏడాది ఈ స్థాయిలో న‌ష్టాలు మూట‌గ‌ట్టుకొన్న సంస్థ లేదంటే అతిశ‌యోక్తికాదు. ప్ర‌పంచంలో ఈ ఏడాది ఈ కామ‌ర్స్ రంగానికి స్వ‌ర్ణ‌యుగం లాంటిది క‌రోనా కార‌ణంగా జ‌నానికి ఈ కామ‌ర్స్ రంగం ఎంతో చేరువైంది. ఈ స‌మ‌యంలో ఈ స్థాయి న‌ష్టం అంటే మామూలు విష‌యం కాదని అంత‌ర్జాతీయ వ్యాపార వ‌ర్గాలు చెబుతున్నాయి.

  అస‌లేం జ‌రిగింది..
  అక్టోబ‌ర్ 24, 2020లో చైనాలో ‘ది బండ్ సమిట్‌’ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఈ సంద‌స్సుకు ఆలీబాబా వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు జాక్ మా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆర్థిక అంశాల‌పై ఆయ‌న మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఆయ‌న ఎత్తి చూపారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు అవసరమని సూచించారు.

  IDFC Credit Cards: ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి వడ్డీ లేకుండా డబ్బులు తీసుకునే చాన్స్..


  చైనాలో మెరుగైన‌ ఆర్థిక విధానాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో ప్ర‌భుత్వానికి చిరెత్తుకొచ్చింది. ఆలీబాబాపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.

  ఏం చేసింది..
  ఈ క్ర‌మంలోనే జాక్ మా స్థాపించిన యాంట్‌ గ్రూప్‌ను ఐపీవోకు వెళ్లకుండా చైనా ప్ర‌భుత్వం అడ్డుకుంది. దీంతో స్టాక్‌ మార్కెట్లలో అలీబాబా షేర్లు కూడా పతనమవుతూ వచ్చాయి. ఇంకేముంది.. అలీబాబా గ్రూప్‌ సంపదతో పాటు జాక్‌ మా నికర సంపద కూడా హారతికర్పూరంలో కరగడం మొదలుపెట్టింది. ఎంతలా అంటే ఏడాది కాలంలో అలీబాబా తన మార్కెట్‌ విలువలో 344 బిలియన్‌ డాలర్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది. ఒక్క అలీబాబానే కాదు.. దాని అనుబంధ సంస్థల షేర్లు కూడా భారీగానే పతనమయ్యాయి.

  ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిందా?
  జాక్‌మాను కొన్ని నెలల క్రితం చైనా నిర్బంధంలోకి తీసుకుందని చాలామంది భావించారు. ఆయన ఎవరికీ కనపడకుండా పోవడంతో ఇదే నిజమని అందరూ అనుకున్నారు. కానీ మూడు నెలల తరువాత.. ఈ జనవరిలో జాక్ మా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఆయన గతంలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఉపాధ్యాయుల బృందంతో జాక్ మా ఒక వీడియోలో మాట్లాడారు. దీంతో నిర్బంధం ఆరోపణలు నిజం కాదని తేలింది. అలీబాబా నుంచి వైదొలగిన తరువాత ఆయన ధార్మిక కార్యకలాపాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా లో-ప్రొఫైల్‌ను కొనసాగిస్తున్నాడు.
  Published by:Sharath Chandra
  First published: