PM Kisan: పింఛన్ల కోసం భారీగా రిజిస్ట్రేషన్లు.. దేశవ్యాప్తంగా 21.40 లక్షల మంది నమోదు.. మీరూ ఇలా దరఖాస్తు చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

PM Kisan Mann Dhan Yojana: వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆసరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల్ని ఆదుకోవడానికి ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో రిజిస్టర్ అయితే రైతులకు నెలకు రూ.3000 పెన్షన్ అందిస్తారు. తెలంగాణలో ఇప్పటివరకు 9 వేలకు పైగా రైతులు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆసరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల్ని ఆదుకోవడానికి ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో రిజిస్టర్ అయితే రైతులకు నెలకు రూ.3000 పెన్షన్ అందిస్తారు. ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన(పీఎం-కేఎంవై) కోసం ఈ నెల 27వ వరకు దేశవ్యాప్తంగా 21,40,650 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభలో ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 31,861మంది, తెలంగాణలో 9,048 మంది రైతులు ఈ పథకానికి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రెండు హెక్టార్ల వరకు పొలం ఉన్న రైతులు ఎవరైనా ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంలో చేరే రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

    పథకంలో చేరేనాటికి వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ప్రీమియం ఉంటుంది. అంటే 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.200 ప్రీమియం చెల్లించాలి. ప్రతీ నెల ప్రీమియం చెల్లించాలి. రైతులు ఎంత ప్రీమియం చెల్లిస్తారో అంతే సమానంగా ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. రిటైర్మెంట్ వయస్సు నుంచి రైతులకు నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. స్కీమ్‌లో చేరిన నాటి నుంచి 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. సరిగ్గా 60 ఏళ్లు దాటగానే వారికి నెలకు రూ.3000 పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ రైతు మరణిస్తే అతని భార్యకు 50% ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్‌లో చేరాలనుకునే రైతులు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌-CSC కు వెళ్లి దరఖాస్తు చేయొచ్చు.

    బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఈ స్కీమ్‌లో చేరడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజనలో చేరిన తర్వాత ప్రతీ నెలా ప్రీమియం చెల్లించాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లాంటి ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్‌లో ఉన్నవారికి ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన వర్తించదు.
    Published by:Veera Babu
    First published: