జపనీస్ బైక్ మేకర్ కవాసకి(Kawasaki) నింజా సిరీస్ (Ninja Series)లో సరికొత్త బైక్ (New Bike)ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఫెస్టివల్ సీజన్ దృష్టిలో పెట్టుకుని యువతను ఆకర్షించడానికి నింజా ZX-10R, 2023 ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.15.99లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. అయితే నింజా 650, 2022 ఎడిషన్‌ను కవాసకి గతేడాది లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ధర రూ.6.61 లక్షలు(ఎక్స్‌షోరూం).
* అట్రాక్టివ్ ఫ్రేమ్‌వర్క్
నింజా ZX-10R బైక్ ఫ్రేమ్‌వర్క్ మల్టిపుల్ గ్రాఫిక్స్‌తో ఆకర్షణీయమైన రంగుల్లో యువతను అట్రాక్ట్ చేసేలా ఉంది. రెండు కలర్స్‌లో లభ్యమవుతుంది. లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్ ఇంతకు ముందు మార్కెట్లో ఉండగా, పెరల్ రోబోటిక్ వైట్ పూర్తిగా కొత్తది.
నింజా 650, 2022 ఎడిషన్ బైక్ కూడా పర్ల్ రొబోటిక్ వైట్, లైమ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. సెంటర్లో క్యావిటీ కూడిన డాషింగ్ డ్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్ ఫీచర్స్‌తో ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్, న్యారో టెయిల్ సెక్షన్‌తో బైక్ చూడ ముచ్చటగా ఉంటుంది.
* సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్‌తో పంచ్ ఇంజిన్
నింజా ZX-10R ఇంజిన్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు లేవు. ఈ బైక్ 998-సీసీ, ఫోర్-సిలిండర్స్, లిక్విడ్-కూల్డ్ పవర్‌ట్రెయిన్‌లో రన్ అవుతూ 13,200 rpm వద్ద గరిష్టంగా 200 bhpని అందించగలదు. ఇక టార్క్ విషయానికి వస్తే.. 11,400 rpm వద్ద 114.9 Nmతో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. పంచ్ ఇంజిన్.. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. నింజా 650, 2022 ఎడిషన్ బైక్ 649 సీసీ, ప్యారలల్ ట్విన్, లిక్విడ్ కూల్ ఇంజిన్ 67.4 బీహెచ్పీ పవర్, 64ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
* లేటెస్ట్ ఎడిషన్ రూ.62,000 అధికం
కవాసకి బైక్ మోడల్స్‌లో నింజా సిరీస్ అత్యంత ప్రజాదరణ పొందింది. సరసమైన లీటర్-క్లాస్ బైక్‌లలో నింజా ZX-10R ఒకటి. ఈ సరికొత్త 2023 ఎడిషన్ బైక్.. పెరల్ రోబోటిక్, లైమ్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. 2021 ఎడిషన్‌తో పోల్చితే తాజాగా ఎడిషన్ ధర రూ.62,000 పెరిగింది.
ఇది కూడా చదవండి : రేపే ప్రధాని నరేంద్ర మోదీ 72వ బర్త్ డే.. ఆయన ఆస్తుల విలువ తెలిస్తే అవాక్కవుతారు!
* ఫోర్ రైడింగ్ మోడ్స్
నింజా ZX-10Rలో స్పోర్ట్, రెయిన్, రైడర్, రోడ్ వంటి డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. దీనితో పాటు బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇది లాంగ్ రైడ్లలో అవసరమైన కంఫర్ట్ అందిస్తుంది. ఈ బైక్‌కు 4.3-అంగుళాల TFT డిస్ప్లే ఉంటుంది. ఇది బైక్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని చూపుతుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా సీబీఆర్ 1000ఆర్ఆర్-ఆర్, సుజుకి హయాబుసా, డుకాటి పానిగేల్, అప్రిలియా RSv4 వంటి బైక్ మోడల్స్‌కు నింజా ZX-10Rను పోటీగా నిలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.