Hyundai : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) ఇటీవల గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్(Hyundai Grand i10 Nios Facelift)ను వర్చువల్‌గా ఇంట్రడ్యూస్ చేసింది. ఇంతలోనే ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.5.68 లక్షల నుంచి రూ.8.46 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ అప్‌డేటెడ్ మోడల్ కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఈ మోడల్ 30 కొత్త ఫీచర్‌లు, 20 కొత్త సెక్యూరిటీ ఆప్షన్‌లు అందిస్తోంది. ఈ లేటెస్ట్ మోడల్ ఇతర పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
నాలుగు ట్రిమ్ లెవల్స్
గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్.. ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా అనే నాలుగు ట్రిమ్ లెవల్స్‌లో లభిస్తుంది. తాజా ఎడిషన్ 1.2L పెట్రోల్ ఇంజన్‌తో పాటు CNG వేరియంట్‌లోనూ లభిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించారు. రూ.11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.
స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా 4 ఎయిర్‌బ్యాగ్స్
ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌లో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా 4 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. భారీ ఫ్రంట్ గ్రిల్‌తో కొత్త బంపర్ డిజైన్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఈ ఎడిషన్‌లో న్యూ డిజైన్ 15- అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. రైడింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ ఫాసియా న్యూ ట్రై-యారో-షేప్ LED DRLను ప్రదర్శిస్తుంది. వెనుక భాగంలో లైట్ బార్ ద్వారా కనెక్ట్ అయిన LED టెయిల్-ల్యాంప్స్ ఉంటాయి.
RDE నిబంధనలకు అనుగుణంగా
గ్రాండ్ i10 నియోస్‌తో పోల్చితే తాజా ఎడిషన్‌లో మెకానికల్‌గా అంతగా మార్పులు చేయలేదు. గ్రాండ్ ఐ 10 నియోస్ లో ఉపయోగించిన 1.2-లీటర్ న్యాచురలీ-యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను RDE నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసి తాజా ఎడిషన్ లో ఉపయోగించారు. ఈ కారు 83 bhp మ్యాక్సిమం పవర్, 114 Nm మ్యాక్సిమం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ సిస్టమ్‌తో పాటు, ఆటోమేటిక్ వేరియంట్ కూడా ఉంటుంది. సీఎన్జీ కారు 95 ఎన్ఎం టార్క్, 62 బీహెచ్‌పీ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ మ్యానువల్ మోడల్ లీటరుకు 20.7 కి.మీ, ఆటోమేటిక్ వేరియంట్ 20.1 కి.మీ మైలేజీ అందిస్తుంది.
Best Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు అదుర్స్,ధర తక్కువే..3కి.మీ నడిపితే రూ.1 ఖర్చు మాత్రమే
అదనపు ఫీచర్స్
గ్రాండ్ i10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ న్యూ స్పార్క్ గ్రీన్ కలర్ స్కీమ్‌తో పాటుగా ఎగ్జిస్టింగ్ కలర్స్ పోలార్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, టీల్ బ్లూ , ఫైరీ రెడ్ వంటి ఐదు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్, రియర్ AC వెంట్‌లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ తాజా ఎడిషన్‌లో ఉన్నాయి. రేంజ్-టాపింగ్ ట్రిమ్స్‌లో క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, టైప్-సి USB ఛార్జింగ్ సాకెట్స్ వంటి ప్రీమియం ఫీచర్‌లు ఉన్నాయి.
టాప్ మోడల్‌లో 6-ఎయిర్‌బ్యాగ్స్
ఈ హ్యాచ్‌బ్యాక్ లైనప్‌లో నాలుగు ఎయిర్‌బ్యాగ్స్ ABS, EBD స్టాండర్డ్స్‌తో తయారు చేశారు. దీంతో ఈ ఎడిషన్‌లో సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే టాప్ మోడల్‌లో 6-ఎయిర్‌బ్యాగ్స్, ISOFIX యాంకరేజస్, ESC, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి బెల్స్, విజిల్స్ అదనంగా ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.