Honda SP 125: ఇండియాలో హోండా కంపెనీ బైక్‌లకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు సరికొత్త హోండా 2023 SP 125 బైక్ లాంచ్ అయింది. ఆన్ బోర్డ్ డయాగ్నొసిస్ సెకండ్ జనరేషన్(OBD2) ఇంజిన్‌ని ఈ బైక్ కలిగి ఉండటం విశేషం. బీఎస్ 6 ప్రమాణాలతో రూపొందించిన ఈ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. మరి, ఈ బైక్ ఫీచర్లు, ధర, తదితర వివరాలను తెలుసకుందాం.
ఓలా ఎస్1 నుంచి టీవీఎస్ ఐక్యూబ్ వరకు.. రూ.లక్షలోపు టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఇవే..
* ఫీచర్లు
డిజైన్ పరంగా 2023 హోండా SP 125 ఆకట్టుకుంటోంది. అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ డీసీ హెడ్ ల్యాంప్ కారణంగా స్పోర్టీ లుక్‌లో కనిపిస్తోంది. ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ స్విచ్, 5 స్పీడ్ గేర్ బాక్స్, రియర్ సస్పెన్షన్, కాంబీ బ్రేక్ సిస్టం(సీబీఎస్) డిజైన్, వెనుక నుంచి బోల్డ్ లుక్‌లో కనిపించే టెయిల్ ల్యాంప్ బైక్‌కు హైలైట్‌గా నిలుస్తున్నాయి. రైడర్‌కి ఇన్‌ఫర్మేషన్ ఇచ్చే డిజిటల్ మీటర్ ఆకట్టుకుంటోంది. ఫ్యుయల్ ఎఫిషియన్సీ, గేర్ పొజిషన్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఈసీవో ఇండికేటర్‌లను డిజిటల్ మీటర్ రైడర్‌కి చూపిస్తుంది.
* రెండు వేరియంట్లు.. 5 కలర్ ఆప్షన్‌లు
హోండా 2023 SP 125 బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డ్రమ్, డిస్క్ బైక్‌లను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ఢిల్లీ ఎక్స్ షోరూం ధర ప్రకారం డ్రమ్ వేరియంట్ రూ.85,131 వస్తుండగా, డిస్క్ వేరియంట్ రూ.89,131కి అందుబాటులో ఉంది. మొత్తంగా ఐదు రంగుల్లో బైక్ డిజైన్ అయింది. బ్లాక్(Black), మ్యాటె యాక్సిక్ గ్రే మెటాలిక్(Matte Axis Grey Metallic), ఇంపీరియల్ రెడ్ మెటాలిక్(Imperial Red Metallic), పియర్ల్ సిరెన్ బ్లూ(Pearl Siren Blue), న్యూమ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్(NewMat Marvel Blue Metallic) కలర్స్‌లలో ఈ బైక్ అందుబాటులో ఉంది.
Instagram : ఇన్‌స్టాలో అదిరే ఫీచర్.. ఇకపై ఫ్రెండ్స్‌తో పోస్ట్‌ల షేరింగ్ చాలా ఈజీ
* సాఫీగా ప్రయాణం సాగించేలా..
రైడర్ సాఫీగా ప్రయాణం సాగించేందుకు అనువుగా SP 125 బైక్‌ని హోండా తీర్చిదిద్దింది. అధునాతన ఫీచర్లతో సరసమైన ధరకే ఈ బైక్‌ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఎన్హాన్స్‌డ్ స్మార్ట్ పవర్(eSP) టెక్నాలజీతో బూస్ట్ చేసిన PGM-FI ఇంజిన్‌తో బైక్‌ని కంపెనీ రూపొందించింది. కొద్ది పాటి పవర్‌తోనే ఇంజిన్ స్టార్ట్ అయ్యేందుకు eSP టెక్నాలజీ సహాయ పడుతుంది. హోండా ఏసీజీ స్టార్టర్‌ని కూడా ఇది కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 10.9nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 10.72 బ్రేక్ హార్స్ పవర్‌ని జనరేట్ చేయగలుగుతుంది.
* కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా
కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా OBD2 కాంప్లియంట్ హోండా 2023 SP 125 బైక్‌ని లాంచ్ చేసినట్లు హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అత్సుతి ఒగాటా వెల్లడించారు. స్పోర్టీ, స్టైలిష్‌గా ఉండటంతో పాటు అందుబాటు ధరలోనే బైక్ కస్టమర్లను చేరుకుంటోందని ఒగాటా తెలిపారు. మోటార్ సైకిల్ ఔత్సాహికులను తప్పకుండా సంతృప్తి పరుస్తుందని ఒగాటా ధీమా వ్యక్తం చేశారు. కస్టమర్ల అంచనాలకు తగ్గట్టు వాహనాల తయారీపై దృష్టి సారిస్తున్నామని, ఇందుకు హోండా 2023 SP 125 బైక్ ఓ ఉదాహరణ అంటూ ఒగాటా వెల్లడించారు. మరోవైపు, ఇదే ఆర్థిక సంవత్సరంలో హోండా రెండు రకాల ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ని తీసుకు రానున్న విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.