హోమ్ /వార్తలు /బిజినెస్ /

BMW New Car: భారత్‌లో కొత్త BMW లగ్జరీ కారు లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

BMW New Car: భారత్‌లో కొత్త BMW లగ్జరీ కారు లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW నుంచి కొత్త కారు వస్తుందంటేనే చాలు.. అది ఓ రేంజ్‌లో ఉంటుందని భావిచడం సహజం. ఇలాంటి అంచనాలతోనే మరో కొత్త ప్రీమియం వెహికల్ ఈ బ్రాండ్ నుంచి రిలీజ్ అయింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW నుంచి కొత్త కారు వస్తుందంటేనే చాలు.. అది ఓ రేంజ్‌లో ఉంటుందని భావిచడం సహజం. ఇలాంటి అంచనాలతోనే మరో కొత్త ప్రీమియం వెహికల్ ఈ బ్రాండ్ నుంచి రిలీజ్ అయింది. ఇండియన్ మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ (BMW 3 Series Gran Limousine) వచ్చేసింది. మునుపటి ఎడిషన్లతో పోలిస్తే మరింత అధునాతనంగా, ఎక్కువ సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఉండేలా దీన్ని రూపొందించారు.

రెండు వేరియంట్లలో

BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో ఇది రూపుదిద్దుకుంది. 330Li పెట్రోల్, 320 Ld డీజిల్ వేరియంట్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు వేరియంట్లు డిజైన్ పరంగా, ఫీచర్స్ పరంగా అత్యుత్తమంగా ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ ఎక్స్ షో రూం ధర రూ.57.90 లక్షలుగా నిర్ణయించింది. ఇక డీజిటల్ వేరియంట్ వాహనం ధర రూ.59.50లక్షలు కావడం విశేషం.

మెరుగైన మైలేజీ

330Li 2.0 లీటర్ల ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 258 హార్స్ పవర్, 400Nm టార్క్‌ని అందిస్తోంది. 6.2 సెకన్లలో ఈ వాహనం గంటకు 0 నుంచి 100కి.మీ వేగాన్ని అందుకోగలదు. లీటరు ఇంధనానికి 15.39కి.మీ దూరం ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. ఇక, 320Ld 2.0 లీటర్ల ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 190 హార్స్ పవర్‌తో పాటు 400Nm టార్క్‌ని అందించగలదు. మైలేజీలో పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే ఇది కాస్త మెరుగ్గా ఉంది. లీటరుకు 19.61కి.మీ మైలేజీ ఇస్తుందని సంస్థ వెల్లడించింది. ఇక 7.6 సెకన్లలో ఈ వాహనం గంటకు 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మైలీజీ పరంగా ఇది కస్టమర్లకు కాస్త ఊరట కలిగిస్తోంది.

స్టైలిష్ డిజైన్

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆడి ఏ4, మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ వాహనాలకు పోటీగా దీన్ని తీర్చిదిద్దారు. కొన్ని విషయాలతో పోలిస్తే ఈ రెండింటి కన్నా గ్రాన్ లిమోసిన్ అత్యుత్తమంగా ఉంది. బీఎండబ్ల్యూ స్టాండర్డ్ వెహికల్స్‌తో పోలిస్తే గ్రాన్ లిమోసిన్ లాంగ్ వీల్‌ బేస్‌ని కలిగి ఉంది. స్టాండర్డ్ 3 సిరీస్‌తో పోలిస్తే 110 మి.మీ అధిక వీల్‌బేస్‌ని కలిగి ఉంది. పొడవు, వెడల్పు, ఎత్తు విషయంలోనూ గ్రాన్ లిమోసిన్ ఒక అడుగు ముందుంది. 4,823 మి.మీ పొడవును కలిగి ఉంది. ఇక స్పోర్టింగ్ వీల్స్‌ని తలపించేలా సరికొత్త డిజైన్‌తో రూపుదిద్దుకుంది. లార్జర్ ఎయిర్ ఇన్‌టేక్స్, రీ డిజైన్ చేసిన కిడ్నీ గ్రిల్లెస్, రీ డిజైన్ చేసిన బంపర్, మునపటి వాటితో పోలిస్తే సన్నని హెడ్‌లైట్, ఇన్వర్టెట్ ఎల్ ఆకారంలో ఉన్న డే టైమ్ ఎల్‌ఈడీలను ఈ వాహనానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.

అధునాతన ఫీచర్లు

లేటెస్ట్ బీఎండబ్ల్యూ వెహికల్ ఇంటీరియర్, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారు. దీంట్లో 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంది. ఇందులో లేటెస్ట్ ఐ డ్రైవ్ ఆండ్రాయిడ్ 8 ఆపరేటింగ్ సిస్టంని అమర్చారు. డ్రైవర్‌కి మంచి పట్టు అందించేలా స్టీరింగ్ వీల్‌ని కొత్తగా రూపొందించారు. త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉండడం అదనపు సౌకర్యం. టచ్ లేదా వాయిస్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. సెంట్రల్ కన్సోల్‌లో కొత్తగా డిజైన్ చేసిన డ్రైవ్ సెలెక్టర్ లివర్‌తో అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది.

First published:

Tags: Bmw car, Cars

ఉత్తమ కథలు