హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Punch Camo: ఇండియాలో టాటా పంచ్‌ ‘కామో’ ఎడిషన్ లాంచ్.. SUVలో కొత్తగా చేసిన మార్పులు ఇవే

Tata Punch Camo: ఇండియాలో టాటా పంచ్‌ ‘కామో’ ఎడిషన్ లాంచ్.. SUVలో కొత్తగా చేసిన మార్పులు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశపు నమ్మకమైన బ్రాండ్ టాటా నుంచి మరో కొత్త కారు లాంచ్ అయింది. టాటా పంచ్ మార్కెట్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కొత్తగా ‘టాటా పంచ్ కామో’ (Tata Punch Camo) పేరుతో అప్‌డేటెడ్ SUVని కస్టమర్లకు పరిచయం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారతదేశపు నమ్మకమైన బ్రాండ్ టాటా (TATA) నుంచి మరో కొత్త కారు (New Car) లాంచ్ అయింది. గత ఏడాది మార్కెట్లోకి వచ్చి అమ్మకాల్లో దూసుకుపోతున్న టాటా పంచ్‌ మోడల్‌లో కొత్త ఎడిషన్‌ను కంపెనీ రూపొందించింది. టాటా పంచ్ మార్కెట్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కొత్తగా ‘టాటా పంచ్ కామో’ (Tata Punch Camo) పేరుతో అప్‌డేటెడ్ SUVని కస్టమర్లకు పరిచయం చేసింది. ఇండియాలో దీని ధర రూ. 6.85 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. కాజిరంగ ఎడిషన్ తర్వాత టాటా పంచ్‌ సిరీస్‌లో వచ్చిన కొత్త స్పెషల్ ఎడిషన్ కామోనే (Tata Punch Camo) కావడం విశేషం. దీని ప్రత్యేకతలు పరిశీలిద్దాం.

ధర ఎంత?

టాటా పంచ్ రెగ్యులర్ వేరియంట్ల ధరలు ప్రస్తుతం రూ. 5.93 లక్షల నుంచి రూ. 9.49 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. అయితే లేటెస్ట్ కామో ఎస్‌యూవీ ధర ఇండియాలో రూ. 6.85 లక్షల నుంచి రూ. 8.63 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. టాటా పంచ్ కామో.. అడ్వెంచర్, అకాంప్లిష్డ్ ట్రిమ్ లెవల్స్‌లో మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. మోడల్‌ను బట్టి ధరలు వేర్వేరుగా ఉన్నాయి.

New Cars: ఫెస్టివల్ సీజన్‌లో ఇండియాలో రిలీజ్ అవుతున్న కార్లు ఇవే.. ధరలు, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి...

కొత్తగా చేసిన మార్పులు..

కొత్త ఎడిషన్‌లో కంపెనీ కొన్ని కాస్మెటిక్, స్టైలింగ్ మార్పులు చేసింది. ఇది పియానో ​​బ్లాక్ అండ్ ప్రిస్టీన్ వైట్ డ్యుయల్ టోన్ రూఫ్ కలర్ ఆప్షన్లతో, కొత్త ఫోలేజ్ గ్రీన్ పెయింట్ స్కీమ్‌తో అందుబాటులో ఉంది. కారు ఫెండర్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, 16-అంగుళాల చార్‌కోల్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌పై కామో బ్యాడ్జింగ్‌ ఉంటుంది. ఇలాంటి చిన్న మార్పులు తప్ప తాజా పంచ్ కామో ఎడిషనల్‌లో పెద్ద మార్పులేమీ చేయలేదు.

Top 5 Automatic Cars Under 10 Lakh: ఆటోమేటిక్ కార్ కొనాలనుకుంటున్నారా? అయితే.. రూ.10 లక్షల్లోపు లభించే 5 బెస్ట్ మోడళ్లు ఇవే.. ఓ లుక్కేయండి

ఈ SUVలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేసే 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, కెమెరాతో రియర్ పార్కింగ్ సెన్సార్లు, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. కామో ఎడిషన్ ఇంటీరియర్ మిలిటరీ గ్రీన్ కలర్‌లో ఉంటుంది.

మోటార్ పర్ఫార్మెన్స్, ప్రత్యేకతలు

టాటా పంచ్‌ కామో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తోపాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ ఎస్‌యూవీలో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇంధనాన్ని పొదుపుగా వాడే స్టార్ట్/స్టాప్ ఫంక్షనాలిటీ ఈ ఇంజిన్ ప్రత్యేకత. ఇది 6000 ఆర్‌పీఎం వద్ద 84.48 హెచ్‌పీ పవర్‌ను, 3300 ఆర్‌పీఎం వద్ద 113 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Cars, Latest offers, Tata cars

ఉత్తమ కథలు