Home /News /business /

2022 MARUTI SUZUKI ALTO K10 BOOKING BEGINS WITH TOKEN PRICE RS 11000 KNOW EXPECTED SPECIFICATIONS SS

Maruti Suzuki Alto K10: మారుతీ సుజుకీ ఆల్టో కే10 బుకింగ్ ప్రారంభం... కేవలం రూ.11,000 చెల్లిస్తే చాలు

Maruti Suzuki Alto K10: మారుతీ సుజుకీ ఆల్టో కే10 బుకింగ్ ప్రారంభం... కేవలం రూ.11,000 చెల్లిస్తే చాలు
(image: Maruti Suzuki)

Maruti Suzuki Alto K10: మారుతీ సుజుకీ ఆల్టో కే10 బుకింగ్ ప్రారంభం... కేవలం రూ.11,000 చెల్లిస్తే చాలు (image: Maruti Suzuki)

Maruti Suzuki Alto K10 | ఆల్టో కార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మారుతీ సుజుకీ నుంచి 2022 ఆల్టో కే10 (Alto K10) కార్ వచ్చేస్తోంది. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ కార్ మార్కెట్లోకి రానుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
మారుతీ సుజుకీ సరికొత్త కార్ లాంఛ్ చేయబోతోంది. 2022 మారుతీ సుజుకీ ఆల్టో కే10 (2022 Maruti Suzuki Alto K10) మోడల్‌ను రిలీజ్ చేయనుంది. మారుతీ నుంచి సరికొత్త ఆల్టో కార్ (Alto Car) రాబోతోందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆల్టో కే10 పేరుతో ఈ మోడల్ రిలీజ్ చేస్తున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆల్టో కే10 కార్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. మారుతీ సుజుకీ అరెనా డీలర్‌షిప్స్ ద్వారా ఈ కారును బుక్ చేయొచ్చు. లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా బుకింగ్ చేయొచ్చు. కస్టమర్లు కేవలం రూ.11,000 చెల్లించి 2022 మారుతీ సుజుకీ ఆల్టో కే10 బుక్ చేసుకోవచ్చు.

43 లక్షలకు పైగా కస్టమర్లతో ఆల్టో ప్రభావవంతమైన కార్ బ్రాండ్‌గా మారిందని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ఈ బ్రాండ్‌కు 22 ఏళ్ల వారసత్వం ఉన్నట్టు తెలిపారు. 2022 మారుతీ సుజుకీ ఆల్టో కే10 మోడల్‌కు సంబంధించి ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్స్ ప్రచారంలో ఉన్నాయి.

IRCTC South India Tour: విశాఖపట్నం నుంచి 6 రోజులు సౌత్ ఇండియా టూర్... ప్యాకేజీ వివరాలు ఇవే

మారుతీ సుజుకీ నుంచి తొలి ఆల్టో కార్ 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఆ తర్వాత రెండో తరం ఆల్టో కార్ 2012 లో వచ్చింది. ఇప్పుడు ఓ దశాబ్దం తర్వాత మూడో తరం ఆల్టో కార్ వస్తోంది. ఆల్టో కార్ ఆర్కిటెక్చర్, ఇంజిన్‌లో అప్‌గ్రేడ్స్ ఉంటాయని భావిస్తున్నారు. సుజుకీ నుంచి ఎస్-ప్రెస్సో, సెలెరియో, బ్యాలెనో, ఎర్టిగా కార్ల లాగానే ఆల్టో కే10 కూడా హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటుందని అంచనా.

ఇంజిన్ అప్‌గ్రేడ్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. 7.0-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, 796cc మోటార్, 1.0 లీటర్ K10C Dual-Jet, 48 bhp పవర్ ఔట్‌పుట్, 69Nm టార్క్ పవర్ ఔట్‌పుట్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లాంటి ఫీచర్స్ ఉంటాయని అంచనా. ఆల్టో కే10 సీఎన్‌జీ వర్షన్ కూడా రానుందన్న ప్రచారం జరుగుతోంది. ఎక్స్ షోరూమ్ ధర రూ.4.10 లక్షల నుంచి రూ.4.80 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

SBI Alert: ఎస్‌బీఐ కొత్త రూల్... మొబైల్ యాప్‌లో ఈ స్టెప్స్ ఫాలో అవండి



ఇక త్వరలో లాంఛ్ కాబోయే మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా కార్‌కు 25,000 బుకింగ్స్ వచ్చాయి. మరోవైపు కొత్తగా లాంఛ్ అయిన 2022 మారుతీ సుజుకీ బ్రీజా కారుకు 75,000 బుకింగ్స్ వచ్చాయి. ఈ రెండు ఎస్‌యూవీలకు కలిపి ఏకంగా 1 లక్షకు పైగా బుకింగ్స్ రావడం విశేషం.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, Cars, Maruti cars, Maruti su, MARUTI SUZUKI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు