Jeep Grand Cherokee : ప్రముఖ ఆఫ్-రోడింగ్ ఎస్యూవీ తయారీదారు జీప్ ఇండియా (Jeep India) తన ఫ్లాగ్షిప్ గ్రాండ్ చెరోకీ (Grand Cherokee) SUVని భారత్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఫిఫ్త్ జనరేషన్గా ఈ SUV ఇండియాలో అరంగేట్రం చేయనుంది. ఫిఫ్త్ జనరేషన్ గ్రాండ్ చెరోకీ SUV సిరీస్ ప్రొడక్షన్ కూడా ఇండియాలో స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ వాహనాన్ని పుణేలోని రంజన్‌గావ్ ఫెసిలిటీలో అసెంబుల్ చేస్తున్నారు. కంపెనీ ఇటీవల తన అధికారిక వెబ్సైట్లో ఈ అప్‌కమింగ్ SUV టీజర్‌ను షేర్ చేసింది. నవంబర్ 17న కొత్త గ్రాండ్ చెరోకీ మోడల్‌ను లాంచ్ చేస్తామని వెల్లడించింది. కాగా ఆల్రెడీ ఈ SUV బుకింగ్ విండో ఓపెన్ అయింది.
https://twitter.com/JeepIndia/status/1589564471009488896?t=ZRC91EX77nYYeSJSLfivyQ&s=19
కంపెనీ ఇండియాలోనే తయారు చేస్తున్న నాలుగో మోడల్ ఇది. 2022 జీప్ గ్రాండ్ చెరోకీ బుకింగ్స్ సెలెక్టెడ్ కంపెనీ డీలర్షిప్స్, ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. డెలివరీలు ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ ఫిఫ్త్ జనరేషన్ గ్రాండ్ చెరోకీ ఎస్యూవీ గతేడాది జనవరి నెలలోనే గ్లోబల్‌గా రిలీజ్ అయింది. దాదాపు రెండేళ్ల తర్వాత దీనిని కంపెనీ ఇండియాలో పరిచయం చేస్తోంది.
ఫీచర్లు
2022 జీప్ గ్రాండ్ చెరోకీ సరికొత్త ఆర్కిటెక్చర్, ఏరోడైనమిక్ బాడీతో వస్తుంది. అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) గల ఈ ఎస్‌యూవీలో ఫుల్-స్పీడ్ ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ ప్లస్ పెడెస్టేరియన్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, బ్లైండ్ స్పాట్.. క్రాస్ పాత్ డిటెక్షన్, పాసివ్ పెడెస్టేరియన్ ప్రొటెక్షన్, డ్రౌసీ డ్రైవర్ డిటెక్షన్, యాక్టివ్ లేన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంటర్సెక్షన్ కొలిజన్ అసిస్ట్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 2022 జీప్ గ్రాండ్ చెరోకీలో 110కి పైగా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి.
LIC Policy: రోజుకు రూ.70 పొదుపు చేస్తే రూ.48 లక్షలు పొందొచ్చు! ఈ ఎల్ఐసీ స్కీమ్ గురించి తెలుసా?
డిజైన్ ఎలా ఉంది?
గ్రాండ్ చెరోకీ ముందు భాగంలో స్లిమ్ LED హెడ్‌లైట్స్, పెద్ద గ్రిల్స్, LED ఫాగ్ ల్యాంప్లతో కూడిన భారీ లోయర్ ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది. కంపెనీ యూజర్లకు 24×7 డెడికేటెడ్ సర్వీస్ అందిస్తుంది. ఈ SUVని క్వాడ్రా-ట్రాక్ I 4×4 సిస్టమ్, సెలెక్-టెర్రైన్ ట్రాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో అమర్చారు. క్యాబిన్‌ను ప్రీమియం కాప్రి లెదర్ మెత్తలతో చిల్లులు గల ఇన్సర్ట్లతో ఆఫర్ చేశారు. భారీ పనోరమిక్ సన్‌రూఫ్‌తో లోయర్డ్, టేపర్డ్ రూఫ్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా పరిచయం చేశారు.
స్లిమ్ HVAC వెంట్స్, యాక్టివ్ నాయిస్ కంట్రోల్ సిస్టమ్, 3 పాయింట్ సీట్‌బెల్ట్, మొత్తం 5 మంది ప్రయాణికుల కోసం ఆక్యుపెంట్ డిటెక్షన్, 10-అంగుళాల హెడ్స్ అప్ డిస్ప్లే, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్, క్లస్టర్ ప్యానెల్, 10.25-అంగుళాల ఫ్రంట్ ప్యాసింజర్ ఇంటరాక్టివ్ డిస్ప్లే, రిమోట్ ఫంక్షన్లతో కూడిన ఫుల్లీ కనెక్టివిటీ ప్యాకేజీ వంటి అదిరిపోయే ఫీచర్లు కూడా ఇందులో ఆఫర్ చేశారు. గ్లోబల్ మార్కెట్లో గ్రాండ్ చెరోకీ మూడు డిఫరెంట్ ఇంజన్స్‌తో లాంచ్ అయింది. వీటిలో 2.0-లీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్, 5.7-లీటర్ V8, 3.6-లీటర్ V6 ఉన్నాయి. గ్రాండ్ చెరోకీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ భారతదేశంలో అందుబాటులోకి రావచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.