2022 HONDA CBR650R LAUNCHED IN INDIA PRICED AT RS 9 35 LAKH GH VB
Honda CBR 650R: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా CBR 650R బైక్ లాంచ్.. ధర, ఫీచర్ల పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ టూవీలర్ బ్రాండ్ ‘హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా’ భారత మార్కెట్లోకి సరికొత్త ‘2022 సీబీఆర్650ఆర్’ (Honda CBR 650R) బైక్‌ను లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లోకి ఈ బైక్‌ను రూ. 9.35 లక్షల (ఎక్స్-షోరూమ్, హర్యానా) ధర వద్ద ఆవిష్కరించింది.
ప్రముఖ టూవీలర్ బ్రాండ్ ‘హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా’ భారత మార్కెట్లోకి సరికొత్త ‘2022 సీబీఆర్650ఆర్’ (Honda CBR 650R) బైక్‌ను లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లోకి ఈ బైక్‌ను రూ. 9.35 లక్షల (ఎక్స్-షోరూమ్, హర్యానా) ధర వద్ద ఆవిష్కరించింది. హోండా కంపెనీ ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్‌ను స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు హోండా బిగ్‌వింగ్ టాప్‌లైన్ షోరూమ్‌ని సందర్శించడం ద్వారా బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. గురుగ్రామ్, ముంబై, బెంగళూరు, ఇండోర్, కొచ్చి, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ లాంచింగ్ సందర్భంగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సీఈఓ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ..“నూతన సంవత్సరంలో మా సంస్థ నుంచి తొలి బైక్‌ను విడుదల చేస్తుండటం పట్ల సంతోషిస్తున్నాను.
హోండా సీబీఆర్650ఆర్ మోడల్లో శక్తివంతమైన ఇంజన్‌ను అమర్చాం. ఈ బైక్ ఆర్ఆర్ మెషీన్ అడ్రినలిన్ రష్, స్పోర్టీ పర్ఫార్మెన్స్ను అందిస్తుంది. వినియోగదారులు ఈ మిడిల్ వెయిట్ బైక్‌పై నిజమైన రైడింగ్ థ్రిల్‌ను ఆస్వాదించవచ్చు.” అని పేర్కొన్నారు.
ఈ కొత్త మోడల్ లాంచ్ గురించి హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ ‘‘ CBR650R కొత్త, అనుభవజ్ఞులైన రైడర్లకు మెరుగైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ కొత్త CBR650R బైక్ ఏరోడైనమిక్ & అల్ట్రా-షార్ప్ అప్పీల్‌ని అందిస్తుంది.” అని చెప్పారు.
స్పోర్టీ డిజైన్‌తో అదిరిపోయే లుక్..
CBR 650R బైక్‌లో 649cc, 4 సిలిండర్, DOHC 16- వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 87bhp, 57.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ మొత్తం రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి గ్రాండ్ ప్రిక్స్ రెడ్ కాగా, మరొకటి మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ కలర్. హోండా సిబిఆర్650ఆర్ బైక్ అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. ఇది కొత్త స్పోర్టీ గ్రాఫిక్స్‌తో పాటు ఆరెంజ్ హైలైట్లతో ఆకర్షనీయమైన లుక్‌ను అందిస్తుంది.
దీని వెనుక సీటు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ బైక్ హై అండ్ లో ఫెయిరింగ్ పొందటం వల్ల మరింత స్పోర్టీ లుక్‌లో అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. తాజా CB650R బైక్ మునుపటి మోడల్ కంటే ఖరీదైనది. దీని కోసం దాదాపు రూ. 50 వేలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ బైక్ ధర హోండా నింజా 650 కంటే ఎక్కువగా, హోండా Z900తో సమానంగా ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.