హోమ్ /వార్తలు /బిజినెస్ /

Activa Premium Edition: హోండా నుంచి యాక్టివా ప్రీమియం ఎడిషన్‌ లాంచ్.. దీని ధర, ప్రత్యేకతలు ఇవే..

Activa Premium Edition: హోండా నుంచి యాక్టివా ప్రీమియం ఎడిషన్‌ లాంచ్.. దీని ధర, ప్రత్యేకతలు ఇవే..

(Photo: HMSI)

(Photo: HMSI)

Activa Premium Edition: టూవీలర్ తయారీ దిగ్గజం హోండా 2-వీలర్స్ ఇండియా తీసుకొచ్చిన యాక్టివా స్కూటర్‌ ఎంతగా పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ స్కూటర్‌కు మరిన్ని ప్రీమియం ఫీచర్లు యాడ్ చేసి కొత్త యాక్టివా ప్రీమియం ఎడిషన్‌ (Activa Premium Edition)ను లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టూవీలర్ తయారీ దిగ్గజం హోండా 2-వీలర్స్ ఇండియా (Honda 2-Wheelers India) తీసుకొచ్చిన యాక్టివా స్కూటర్‌ ఎంతగా పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. దీనికి సరికొత్త ఫీచర్లు (Features) జోడిస్తూ కొత్త వెర్షన్‌లను ఎప్పటికప్పుడు కంపెనీ పరిచయం చేస్తోంది. తాజాగా ఈ స్కూటర్‌కు మరిన్ని ప్రీమియం ఫీచర్లు యాడ్ చేసి కొత్త యాక్టివా ప్రీమియం ఎడిషన్‌ (Activa Premium Edition)ను లాంచ్ చేసింది. యాక్టివా ప్రీమియం ఎడిషన్‌ను భారతదేశంలో రూ.75,400 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. డీలక్స్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్కూటర్ మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అయింది.

ఆకర్షణీయమైన కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో వచ్చిన 2022 హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్‌కు వెనుక భాగంలో గ్రాబ్ రైల్స్‌ అందించారు. ముందు కవర్‌పై ఉన్న గోల్డెన్ హోండా మార్క్‌ను గోల్డెన్ గార్నిష్‌తో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అలానే 3D గోల్డెన్ 'యాక్టివా' ఎంబ్లమ్‌ను, ప్రీమియం ఎడిషన్ స్ట్రెప్స్‌ను సైడ్స్‌లో ఆఫర్ చేశారు.

అలా ఫ్రంట్ & సైడ్ యాంగిల్స్‌లో స్కూటర్ చాలా అట్రాక్టివ్ గా మారిపోయింది. ఇందులో కొత్తగా ఆఫర్ చేసిన డార్క్ బ్రౌన్ కలర్ (Saddle brown) సీట్లు, కేఫ్ బ్రౌన్ కలర్ ఇన్నర్ కవర్లు స్కూటర్ మొత్తానికి ప్రీమియం లుక్ అందించాయి. మెరిసే బంగారు వర్ణం వీల్స్ దీని స్టైల్‌నే మార్చేశాయి.

కొత్త యాక్టివా లాంచ్ సందర్భంగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సీఈఓ అయిన శ్రీ అట్సుషి ఒగాటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ముందు నుంచి టాప్ స్కూటర్‌గా రాణిస్తున్న హోండా యాక్టివా, అన్ని అంశాలతో కూడిన అప్పీల్‌తో దేశంలోని అన్ని వయసుల వారికి సేవలు అందించింది.

ఇది కూడా చదవండి :  రూ.200 ఆదా చేస్తే రూ.28 లక్షలు మీ సొంతం.. ఈ ఎల్ఐసీ పాలసీపై ఓ లుక్కేయండి

గత రెండు దశాబ్దాలుగా బ్రాండ్ Activa టెక్నాలజీ పరంగా మెరుగ్గా మారడమే కాకుండా దాని డిజైన్ అప్పీల్‌ను పెంచుకుంది. ప్రతి కొత్త అప్‌డేట్‌తో మరింత షార్ప్‌గా, ట్రెండీగా మారింది. 2022 ప్రీమియం ఎడిషన్‌తో యాక్టివాను సరికొత్త అవతార్‌లో తీసుకు రావడం సంతోషంగా ఉంది" అని అట్సుషి ఒగాటా అన్నారు.

2022 యాక్టివా ప్రీమియం ఎడిషన్ బ్లాక్డ్ అవుట్-ఫ్రంట్ సస్పెన్షన్ & ఇంజన్ కవర్‌తో వస్తుంది. మెకానికల్ గా చూసుకుంటే.. ఈ స్కూటర్‌లో కొత్త ఇంజన్ ఏమి ఇవ్వలేదు. ఇందులోని హార్డ్‌వేర్, ఇంజన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు రెగ్యులర్ స్కూటర్‌లో లాగానే ఉంటాయి. స్కూటర్ రెగ్యులర్ మోడల్ వలె ఈ ప్రీమియం ఎడిషన్ అదే 109.51cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto mobile, Bikes, E scootor, Ev scooters, Honda, SCOOTER

ఉత్తమ కథలు