Ducati Bikes: డుకాటీ నుంచి రెండు కొత్త బైక్స్ లాంచ్...ఇక ధూం మచాలే...ధూం

ఇటలీకి చెందిన ఈ సూపర్‌బైకుల తయారీ సంస్థ డుకాటీ (Ducati)

ఇటలీకి చెందిన ఈ సూపర్‌బైకుల తయారీ సంస్థ డుకాటీ (Ducati) ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేని కొన్ని ఉత్తమ మోటార్‌సైకిల్ ఇంజిన్‌లను విడుదల చేసింది. వాటిలో డుకాటీ ఎయిర్-కూల్డ్ ఎల్-ట్విన్ ఇంజిన్ (Ducati air-cooled L-twin engine) ఒకటిగా నిలుస్తోంది.

  • Share this:
ఇటలీకి చెందిన ఈ సూపర్‌బైకుల తయారీ సంస్థ డుకాటీ (Ducati) ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేని కొన్ని ఉత్తమ మోటార్‌సైకిల్ ఇంజిన్‌లను విడుదల చేసింది. వాటిలో డుకాటీ ఎయిర్-కూల్డ్ ఎల్-ట్విన్ ఇంజిన్ (Ducati air-cooled L-twin engine) ఒకటిగా నిలుస్తోంది. ఈ ఇంజిన్ ను డుకాటీ కంపెనీ బైక్‌లలో వాడటం ప్రారంభించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఇంజిన్ ఉనికి జ్ఞాపకార్థం కంపెనీ ఇటీవల 2022 స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో (2022 Scrambler 1100 Tribute Pro) యానివర్సరీ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. అలాగే దాదాపు వందేళ్ల కాలంలో కంపెనీ సాధించిన అభివృద్ధిని సూచించేలా స్క్రాంబ్లర్ 800 అర్బన్ మోటార్డ్‌ (Scrambler 800 Urban Motard)ని కూడా విడుదల చేసింది.

రంగు అనేది వాహనాల రూపురేఖల పూర్తిగా మార్చేయగలదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కంపెనీ.. 50వ వార్షికోత్సవ ఎడిషన్‌కు 1970 కాలంనాటి డుకాటీ 750 స్పోర్ట్ బైక్‌ రంగును పెయింట్ చేసింది. దీంతో తాజాగా విడుదలైన స్క్రాంబ్లర్ 1100 బైక్ లుక్కు అచ్చం 1970 డుకాటీ 750 వలె కనిపిస్తోంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌పై డుకాటీ 750 స్పోర్ట్ తరహాలో బైక్ పేరు రాశారు. ఈ నేమ్ డిజైన్ ను గియుగియారో(Giugiaro) రూపొందించింది. స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైక్‌కు జియల్లో ఓక్రా ఎల్లో (Giallo Ocra yellow) కలర్ వాడారు. పవర్‌ట్రెయిన్, సీట్లపై బ్లాక్, బ్రౌన్ కలర్ షేడ్స్‌ అందించారు. స్క్రాంబ్లర్ 800 అర్బన్ మోటార్డ్ బైక్‌ను ఎరుపు, నలుపు, తెలుపు రంగులతో చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

బైక్‌ల పర్ఫామెన్స్

స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో.. 1079-సీసీ, ఎల్-ట్విన్ పవర్‌ట్రెయిన్ ద్వారా 4750 ఆర్‌పీఎమ్ వద్ద 88 ఎన్ఎమ్ పీక్ టార్క్, 7500 ఆర్‌పీఎమ్‌ వద్ద 86 హెచ్‌పీ పవర్ తో నడుస్తుంది. స్క్రాంబ్లర్ 800 అర్బన్ మోటార్డ్ 803-సీసీ, ఎల్-ట్విన్ ఇంజిన్ సాయంతో 8250 ఆర్‌పీఎమ్ వద్ద 73 హెచ్‌పీ పవర్.. 66.2 ఎన్ఎమ్ వద్ద 5250 ఆర్‌పీఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైక్ యాక్టివ్, జర్నీ, సిటీ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో అందుబాటులోకి వస్తుంది. ట్రాక్ కంట్రోల్, ఏబీఎస్ వంటి కార్నింగ్ ట్రాక్షన్ కంట్రోల్ టెక్నాలజీతో ఈ బైక్ రోడ్డుపై అద్భుతమైన కంట్రోల్ పవర్ అందిస్తుంది. ఈ రెండు బైకులలో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. ఇది ప్రయాణించే రోడ్డును బట్టి మృదువైన మార్పును అందిస్తుంది. 1100 ట్రిబ్యూట్ ప్రో కయాబా-సోర్స్డ్ రియర్ మోనో-షాక్ అబ్సర్బెర్స్ సాయంతో స్మూత్ మోటో రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. 800-సీసీ బైక్ ముందు వైపు 41 ఎంఎం కయాబా షాక్ అబ్సర్బర్స్ ఇచ్చారు. ఈ బైక్స్ ధరలను, మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే తేదీని సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Published by:Krishna Adithya
First published: