ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతదేశం (India)లో అదిరిపోయే కార్ల (New Cars)ను తరచుగా లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ కంపెనీ ఇండియాలో 2022 ఆడి క్యూ3 (2022 Audi Q3)కారును విడుదల చేసింది. రూ.44.89 లక్షల ప్రారంభ ధరతో ఆడి క్యూ3 మోడల్‌ను మళ్లీ సరికొత్తగా భారతదేశంలో రిలీజ్ చేసింది. ఈ ప్రీమియం కాంపాక్ట్ SUV కారు టాప్-స్పెక్ టెక్నాలజీ ట్రిమ్‌ను రూ.50.39 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. మొదటి 500 మంది కస్టమర్లకు కంపెనీ స్పెషల్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఇందులో 2+3 సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీ, 3 సంవత్సరాల లేదా 50 వేల కి.మీ వరకు కాంప్రహెన్సివ్ సర్వీస్ వాల్యూ ప్యాకేజీ అందిస్తోంది. అంతేకాదు, ఆల్రెడీ ఆడి కార్లకు యజమానులైన ఇండియా కస్టమర్లకు మరిన్ని ప్రత్యేక లాయల్టీ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది.న్యూ జనరేషన్ (Audi Q3) ప్రీవియస్ జనరేషన్ పోలిస్తే అన్ని కోణాల్లో చాలా విశాలమైనది. దీనర్థం ఈ కొత్త కారు ఇంటీరియర్‌లో మెరుగైన స్పేస్ అందిస్తుంది. ఇందులో 18-అంగుళాల 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ అందించగా వాటి డిజైన్ బాగా ఆకట్టుకుంటోంది. ఈ ఎస్యూవీ ఆరెంజ్, వైట్, గ్రే, బ్లాక్, బ్లూ.
* క్యూ3 ఇంజన్
ఈ కొత్త SUV వాహనం 2-లీటర్ పెట్రోల్ TFSI ఇంజన్‌తో 187bhp, 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో SUV గంటకు 0-100 కిలోమీటర్ల వేగానికి 7.3 సెకన్లలో చేరుకుంటుంది. క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా కారు చక్రాలలోకి శక్తి వెళ్తుంది. అందువల్ల సేఫ్‌గా డ్రైవ్ చేయడం కుదురుతుంది. స్టీరింగ్ వీల్‌పై ప్యాడిల్ షిఫ్టర్లు, ఆడి డ్రైవ్ సెలెక్ట్‌తో డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇందులో అందించారు.
* క్యూ3 ఇంటీరియర్
ఈ కారు డ్యాష్‌బోర్డ్‌లో ఫ్రీ-ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చారు. డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్లపై డెకరేటివ్ అల్యూమినియం ఇన్సర్ట్స్ అందించగా అవి అట్రాక్టివ్‌గా ఉన్నాయి. అయితే ఈ ప్రీమియం కారులో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం ఫిజికల్ డయల్స్, బటన్లను అందించింది. ఇవి కాకుండా వీటికి డిజిటల్ బటన్స్ అందించి ఉంటే ఇంటీరియర్ డిజైన్ ఇంకా అదిరిపోయేది.
ఇది కూడా చదవండి : ఆఫీసుకు రావాల్సిందే.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు దిగ్గజ సంస్థ ఎండ్ కార్డ్.!
* క్యూ3 టెక్నాలజీ
ఈ కారులోని అల్యూమినియం లుక్‌లో మిర్రర్ అడ్జస్ట్మెంట్ స్విచ్‌లోని ఎలిమెంట్స్, పవర్ విండో స్విచ్‌లు, పార్కింగ్ బ్రేక్ కంట్రోల్ బటన్, డోర్ స్ట్రిప్స్ చూసేందుకు అద్భుతంగా ఉంటాయి. ఇక ఇందులో అందించిన టెక్నాలజీలు చాలానే ఉన్నాయి. మల్టీమీడియా ఇంటర్ఫేస్ (MMI) టచ్‌తో MMI నావిగేషన్ ప్లస్, ఆడి డ్రైవ్ సెలెక్ట్, ఆడి వర్చువల్ కాక్‌పిట్ ప్లస్, యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్ (30 కలర్స్), గెస్చర్-కంట్రోల్డ్ టెయిల్‌గేట్‌తో కంఫర్ట్ కీ, ఎలక్ట్రికల్‌గా ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యే లగేజ్ కంపార్ట్మెంట్ లిడ్, వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్‌తో ఆడి ఫోన్ బాక్స్, ఆడి సౌండ్ సిస్టమ్ (పది స్పీకర్లు, 180 W) వంటి కళ్లు చెదిరే ఫీచర్లతో క్యూ3 కారు లాంచ్ అయ్యింది.
* క్యూ3 కలర్ ఆప్షన్
క్యూ3 పల్స్ ఆరెంజ్, గ్లేసియర్ వైట్, క్రోనోస్ గ్రే, మిథోస్ బ్లాక్, నవర్రా బ్లూ వంటి 5 కలర్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే ఒకాపి బ్రౌన్, పెర్ల్ బీజ్ అవైలబుల్‌లో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Audi, BUSINESS NEWS, New cars, SUV