TVS Raider: టీవీఎస్ నుంచి అద్భుతమైన రైడర్ బైక్.. తక్కువ ధరలో మార్కెట్లోకి విడుదల.. పూర్తి వివరాలివే..

టీవీఎస్ రైడర్ బైక్

TVS Raider: ద్విచక్రవాహనాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో టీవీఎస్ ఒకటి. ఈ సంస్థ కమ్యూటర్ మోటార్ సైకిళ్లను భారత మార్కెట్లో విడుదల చేస్తూ మంచి విక్రయాలు అందుకుంటోంది. తాజాగా టీవీఎస్‌ సరికొత్త బైక్‌ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. అదే టీవీఎస్ రైడర్‌.

  • Share this:
ద్విచక్రవాహనాల(Two Wheeler) ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో టీవీఎస్(TVS) ఒకటి. ఈ సంస్థ కమ్యూటర్ మోటార్ సైకిళ్లను భారత మార్కెట్లో విడుదల చేస్తూ మంచి విక్రయాలు అందుకుంటోంది. తాజాగా టీవీఎస్‌ సరికొత్త బైక్‌ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. అదే టీవీఎస్ రైడర్‌. ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధరను రూ. 77,500 (ఎక్స్ షోరూం)గా నిర్దేశించింది. ఫస్ట్ క్లాస్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ 125సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. బజాజ్ పల్సర్ 125, హోండా సీబీ షైన్ ఎస్పీ లాంటి మోటార్ సైకిళ్లకు పోటీగా మార్కెట్లోకి దూసుకొచ్చింది.

Whatsapp tricks: టైప్ చేయకుండా మెస్సేజ్ పంపడం.. ఓపెన్ చేయకుండా చదవడం.. ఇలాంటి ట్రిక్స్ తెలుసుకోండి..


రైడర్ బైక్ ప్రత్యేకతలు..
ప్రస్తుతం ఉన్న టీవీఎస్ మోడళ్ల మాదిరిగా బాడీ కాంపోనెంట్స్, మెకానికల్స్ దీనిలో పొందుపరచలేదు. సరికొత్త మోడల్‌గా ఈ బైక్‌ భారత విపణిలోకి వచ్చింది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఇండికేటర్లు, ట్రెడిషనల్ హాలోజెన్ యూనిట్లతో ఫ్రంట్ సైడ్ ఆకర్షణీయంగా ఉంది. అంతేకాకుండా స్పోర్టీ అగ్రెసివ్ లుక్ తో ఆకట్టుకుంటోంది. మస్కులర్ అప్పీయరెన్స్‌తో కనిస్తున్న ఈ వాహనంలో టెయిల్ ల్యాంప్స్‌ కూడా ఎల్ఈడీవే అమర్చారు. రివర్స్ లిట్ డిజిటల్ డిస్‌ప్లే ఇందులో మరో ప్రధాన ఆకర్షణ.

Google Drive: నెట్ అవసరం లేకున్నా గూగుల్ డ్రైవ్ పనిచేస్తుంది.. అదెలా అంటే..


ఆప్షనల్ టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన టీవీఎస్ స్మార్ట్ జోనెక్ట్ వేరియంట్ కూడా ఈ మోడల్‌లో ఉంది. ఇది బ్లూటూత్, వాయిస్ అసిస్ట్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, రియర్ మోనోషాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ సీట్.. వంటి వాటిని పొందుపరిచారు. సేఫ్టీ కోసం బ్రేకింగ్‌కు సపోర్ట్ చేసే సీబీఎస్ అమర్చారు.

ఇంజిన్..
ఈ సరికొత్త టీవీఎస్ రైడర్‌ 124సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 11.32 పీఎస్ పవర్, 11.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఎకో, పవర్ రైడింగ్ మోడ్స్‌లో ప్రయాణిస్తుంది. ఈ సిగ్మెంట్ లో ఈ డ్రైవింగ్ మోడ్స్ ఉన్న మొదటి బైక్ ఇదే కావడం విశేషం.

"టీవీఎస్ రైడర్‌ నేకెడ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. బెస్ట్ రైడ్ మోడ్స్, క్లాస్ యాక్సలిరేషన్, మోనోషాక్ ఆధారిత రైడ్ హ్యాండ్లింగ్ వంటికి బైక్‌కు ప్రత్యేకం. టీవీఎస్ ఇంటెల్లీ గో, ఈటీఎఫ్ఐ లాంటి వాటి వల్ల మైలేజ్ పెరుగుతుంది" అని టీవీఎస్ మోటార్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్డార్ స్పష్టం చేశారు. ఈ సరికొత్త టీవీఎస్ రైడర్‌.. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో.. స్ట్రైకింగ్ రెడ్, బ్లేజింగ్ బ్లూ, వికెడ్ బ్లాక్, ఫియరీ యెల్లో లాంటి కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది
Published by:Veera Babu
First published: