మార్కెట్లోకి వచ్చిన కొత్త Innova Crysta Facelift కేవలం లక్ష రూపాయలకే బుక్ చేసుకోండిలా...

టయోటా సంస్థ నుంచి ప్రతిష్టాత్మకంగా అక్టోబర్‌లో Innova Crysta Faceliftను డిజైన్ ను మార్కెట్లో ఆవిష్కరించింది. కాగా టయోటా ఈ కారు డెలివరీని మాత్రం డిసెంబర్ 2020 నుండి ప్రారంభించనుంది.

news18-telugu
Updated: November 15, 2020, 12:30 PM IST
మార్కెట్లోకి వచ్చిన కొత్త Innova Crysta Facelift కేవలం లక్ష రూపాయలకే బుక్ చేసుకోండిలా...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
టయోటా సంస్థ నుంచి ప్రతిష్టాత్మకంగా అక్టోబర్‌లో Innova Crysta Faceliftను డిజైన్ ను మార్కెట్లో ఆవిష్కరించింది. కాగా టయోటా ఈ కారు డెలివరీని మాత్రం డిసెంబర్ 2020 నుండి ప్రారంభించనుంది. ఈ కారును సెలక్ట్ డీలర్‌తో లక్ష రూపాయలకు బుక్ చేసుకోవచ్చు. ఈ టయోటా కారులో, గ్లోస్-బ్లాక్ ఫ్రంట్ గ్రిల్‌తో క్రోమ్ సరౌండ్ ఫ్లాష్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను ప్రత్యేక ఫీచర్లుగా కంపెనీ అందించనుంది. టయోటా Innova Crysta Facelift ముందు బంపర్‌పై పలు మార్పులతో పాటు ఎల్‌ఇడి ఫాగ్ లాంప్స్‌ను కొత్త మోడల్ లో సవరించింది. ఇతర ఎక్స్ టర్నల్ మార్పుల్లో భాగంగా కొత్త డ్యూయల్-టోన్ 16-అంగుళాల చక్రాలు మరియు LED ల్యాంపులను జోడించింది

Innova Crysta Facelift ఫీచర్స్Innova Crysta Facelift లోపల 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అందించారు. దీనిలో, మీరు ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్‌ను పొందనున్నారు. కొత్త ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఆల్-బ్లాక్ ఇంటీరియర్ మరియు 6-సీట్ల లేఅవుట్ అందుబాటులో ఉంటుంది. 6 సీట్ల మోడల్‌లో రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు ఉండగా, 7 సీట్ల మోడల్‌కు రెండవ వరుసలో బెంచ్ సీటు లభిస్తుంది. దీనికి బ్లాక్ కలర్ కెప్టెన్ సీట్లు మరియు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, సీట్ టేబుల్, వెనుక ప్యాసింజర్ ఎంటర్టైన్మెంట్ తో కొత్త అప్ హోల్ స్టరీ లభిస్తుంది .

Innova Crysta Facelift ఇంజన్ 2.4-లీటర్ డీజిల్ మరియు 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో వస్తుంది. పెట్రోల్ ఇంజన్ 164 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్ మరియు 343 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

Innova Crysta Facelift ధర ఎంతంటే...

కొత్త Innova Crysta Facelift ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర 15 లక్షల 66 వేల రూపాయలు. అదే సమయంలో, దాని టాప్ మోడల్ రూ .23 లక్షల 63 వేలు కావచ్చు.
Published by: Krishna Adithya
First published: November 15, 2020, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading