Home /News /business /

Mahindra XUV 500 కొత్త డిజైన్ చూస్తే మైండ్ బ్లాక్...ధర ఎంతంటే...

Mahindra XUV 500 కొత్త డిజైన్ చూస్తే మైండ్ బ్లాక్...ధర ఎంతంటే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

మహీంద్రా Mahindra XUV500 మోడల్ బాగా గుర్తింపుతెచ్చుకుంది. త్వరలో ఈ కారు తర్వాతి తరం మోడల్ భారత మార్కెట్లో రానుంది. మహీంద్రా Mahindra XUV 500 వాహనాన్ని వచ్చే ఏడాది లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందీ కంపెనీ.

భారత్ లో అత్యుత్తమ వాహనాలను విడుదలచేస్తోన్న ఆటో కంపెనీల్లో మహీంద్రా ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా మహీంద్రా Mahindra XUV500 మోడల్ బాగా గుర్తింపుతెచ్చుకుంది. త్వరలో ఈ కారు తర్వాతి తరం మోడల్ భారత మార్కెట్లో రానుంది. మహీంద్రా Mahindra XUV 500 వాహనాన్ని వచ్చే ఏడాది లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందీ కంపెనీ. ఇప్పటికే చాలా సార్లు ఈ ఎస్ యూవీకి టెస్టింగ్ నిర్వహించారు. తాజాగా ఈ కారు ఇంటిరీయర్ కు సంబంధించి కొన్ని చిత్రాలు బహిర్గతమయ్యాయి. ఈ కారుకు సంబంధించిన వీడియోను రాయల్ రైడర్ బహిర్గతపరిచింది.

ఈ 2021 ఎక్స్ యూవీ 500 వాహనం అంతర్గత విభాగానికి సంబంధించి డ్రైవర్ కాక్ పిట్, రెండు అతిపెద్ద డిస్ ప్లే, ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఆధునిక లుక్ కోసం రెండు స్క్రీన్స్ ను కనెక్ట్ చేశారు. ఇవి కాకుండా సరికొత్తగా డిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, వెనక కూర్చే ప్రయాణికుల కోసం సరికొత్త ఏసీ వెంట్ డిజైన్, ఎలక్ట్రికల్ పనిచేసే పానోరామిక్ సన్ రూఫ్ లాంటి ఫీచర్లు దీని సొంతం.

ఈ కొత్తతరం సెవెన్ సీట్ కాన్ఫిగరేషన్ బెంచ్ టైప్ మిడిల్ రోను కలిగి ఉంది. సిట్టింగ్ మూడో వరుసను ఫోల్డ్ చేసుకునే సౌలభ్యాన్ని ఉంచింది. తర్వాతి తరం XUV 500 ఫీచర్ ఆల్ రో సీట్లతో ఉపయోగించవచ్చు. ప్రస్తుతం తరం కారులో అతి చిన్న బూట్ స్పేస్ ఉంది. మూడో వరుస 50:50 స్ప్లిట్ తో పాటు బూట్ స్పేస్ తో పాటు ఏసీ ఫ్యాన్ వేగాన్ని కూడా నియంత్రించుకోవచ్చు. ఈ వీడియో ప్రకారం మల్టీ ఫంక్షన్ ఫ్లాట్ బోటమ్ సెట్టింగ్ ఉంది. వీటితో కంట్రోల్స్ ను ఆపరేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇంఫోటైన్మెంట్ సిస్టం, ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ ను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా టెలిఫోనిక్ ఆపరేషన్స్ అంటే కాల్స్ తీసుకోవడం, చేయడం లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

సెంట్రల్ కన్సోల్ దగ్గరకొస్తే దీంట్లో క్లైమేట్ కంట్రోల్ సిస్టంను పూర్తిగా రీడిజైన్ చేశారు. అంతేకాకుండా సంప్రదాయకరమైన డిజైన్లు టూడయల్స్, మధ్యలో హోస్ట్ బటన్స్, క్లస్టర్డ్ కన్సోల్ డిజైన్ ను పూర్తిగా తొలగించారు. 2021 మహీంద్రా ఎక్స్ యూవీ 500 మోడల్లో సెంట్రల్ కన్సోల్ కాకుండా రోటేటరీ డయల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, స్టార్ట్ లేదా స్టాప్ బటన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయితే రోటేటరీ డయల్... సెంటర్ కన్సోల్లో డ్రైవ్ మోడ్ ను సెలక్టు చేసినప్పుడు మాత్రమే అందుబాటులో వచ్చాయి. టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టంకు ఆల్టర్నెట్ ఇన్ పుట్ ఇస్తుంది.

ఇవి కాకుండా ఈ కారులో మరికొన్ని అప్డేట్లు కంపెనీ తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఎస్ యూవీ అగ్రెసివ్ స్టాన్స్ తో చిరుత పులి మాదిరి కనిపిస్తుంది. బోనెట్ డోర్స్, టెయిల్ గేట్స్ అండర్ గో డిజైన్, ఈ ఎస్ యూవీ ఫ్రెష్ లుక్ ను తీసుకొస్తుంది. అంతేకాకుండా లెవల్ 1 ఆటోనోమస్ టెక్నాలజీ అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం కూడా ఇందులో ఉంది. ప్రస్తుతం తరం మహీంద్రా ఎక్స్ యూవీ 500 మోడల్ 2011 మోడల్ డిజైన్ ను పోలి ఉంది. కొన్ని సదుపాయాలు లైఫ్ టైం ఉండగా.. మరికొన్నింటిని అప్డేట్ చేసింది. అయితే 2021 మోడల్ మాత్రం పూర్తిగా రీడిజైన్ లుక్ తో రానుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Business, CAR

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు