హోమ్ /వార్తలు /బిజినెస్ /

2021 KTM 125 Duke: కొత్త లగ్జరీ బైక్‌ను విడుదల చేసిన KTM...ఇక రోడ్లపై దుమ్ము రేపండి...

2021 KTM 125 Duke: కొత్త లగ్జరీ బైక్‌ను విడుదల చేసిన KTM...ఇక రోడ్లపై దుమ్ము రేపండి...

(Photo: KTM)

(Photo: KTM)

తాజాగా ‘2021 KTM 125 Duke’ బైక్‌ను ఆ సంస్థ మన దేశంలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.1.50 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న KTM డీలర్‌షిప్‌లలో ఈ బైక్‌ను కస్టమర్లు కొనుక్కోవచ్చని ఆ సంస్థ ప్రకటించింది.

లగ్జరీ బైక్‌ల విభాగంలో KTM కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడూ సరికొత్త బైక్‌లను KTM అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా ‘2021 KTM 125 Duke’ బైక్‌ను ఆ సంస్థ మన దేశంలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.1.50 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న KTM డీలర్‌షిప్‌లలో ఈ బైక్‌ను కస్టమర్లు కొనుక్కోవచ్చని ఆ సంస్థ ప్రకటించింది. KTM 1290 SUPER DUKE R వేరియెంట్ ఆధారంగా సరికొత్త డ్యూక్‌ను కేటీఎం రూపొందించింది. దీనికి డిజైన్‌ పరంగా కొన్ని మార్పులు చేసింది. ఈ స్ట్రీట్ ఫైటర్ బైక్‌కు ఉన్న బోల్ట్-ఆన్ రియర్ సబ్‌ఫ్రేమ్ (bolt-on rear subframe), స్టీప్లై రైజింగ్ లైన్స్, పెద్ద స్టీల్ ట్యాంక్ వంటి ఫీచర్లు రైడర్లను ఆకట్టుకుంటాయి.

ఆ ఫీచర్లు కూడా..

కొత్త బైక్ ఎర్గోనామిక్స్ కూడా మార్చారు. రైడింగ్ పొజిషన్‌, రివైజ్డ్‌ రైడర్, ప్యాసింజర్ సీట్లు సరికొత్తగా కనిపిస్తున్నాయి. మార్పులు చేసిన పెద్ద ఫ్యుయెల్ ట్యాంక్ రైడింగ్‌లో సౌకర్యంగా ఉంటుంది. ఇది మంచి లెగ్ కాంటాక్ట్, ఫీల్‌ని అందిస్తుంది. ఫ్యుయెల్ ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లు కావడం విశేషం. గత మోడళ్లకంటే ఇది చాలా ఎక్కువ. బైక్‌ ముందు, వెనుక భాగాల్లో పూర్తిగా కొత్త WP సస్పెన్షన్ ఉంటుంది. సరికొత్త సస్పెన్షన్ సిస్టమ్ KTM 125 DUKEకు అదనపు ఆకర్షణ. దీనికి 125-cc liquid cooled fuel injected engineను అమర్చారు. ఇది 9,250rpm వద్ద అత్యధికంగా 14.5 PS శక్తిని, 8,000rpm వద్ద 12 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యంగ్ రైడర్లకు ప్రత్యేకం

కొత్త బైక్‌ను విడుదల చేసిన సందర్భంగా Bajaj Auto Ltd ప్రెసిడెంట్ (Probiking) సుమిత్ నారంగ్ మాట్లాడారు. 1290 వేరియెంట్‌ ఆధారంగా అదనపు ఫీచర్లతో కొత్త డ్యూక్‌ బైక్‌ను తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. “ఈ విభాగంలో కస్టమర్లు ఇంతకుముందు చూడని ఫీచర్లతో KTM 125 DUKEను అభివృద్ధి చేశాం. అల్ట్రా లైట్ వెయిట్ ట్రేల్లిస్ ఫ్రేమ్, సబ్‌ఫ్రేమ్‌లు.. రేజర్ షార్ప్‌ కంట్రోల్‌ను అందిస్తాయి. దీని కొత్త స్టైలింగ్ యంగ్ రైడర్స్‌ను ఆకట్టుకుంటుంది. 2018లో మొదటిసారి KTM 125 DUKEను విడుదల చేశాం. ఇది భారత్‌లోని యువ రైడర్లకు మొదటి ప్రాధాన్యంగా మారింది. ఈ ఎంట్రీ లెవల్‌ మోడల్‌ను కస్టమర్ల ఆసక్తులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తున్నాం. తాజాగా విడుదల చేసిన 2021 KTM 125 Duke మోడల్‌ కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుంది” అని సుమిత్ వివరించారు.

Published by:Krishna Adithya
First published:

Tags: Automobiles, Bike, CAR, Cars

ఉత్తమ కథలు