Ford Figo: భారత మార్కెట్​లోకి ఫోర్డ్​ ఫిగో ఆటోమేటిక్​ వేరియంట్​.. ధర, ఫీచర్లు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ఫోర్డ్​ నుంచి భారత మార్కెట్​లోకి సరికొత్త వేరియంట్ విడుదలైంది. ఫోర్డ్​ తాజాగా తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ ఫిగోలో ఆటోమేటిక్​ వేరియంట్​ను లాంఛ్​ చేసింది.

  • Share this:
అమెరికన్​ కార్​ బ్రాండ్​ ఫోర్డ్​ నుంచి భారత మార్కెట్​లోకి సరికొత్త వేరియంట్ విడుదలైంది. ఫోర్డ్​ తాజాగా తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ ఫిగోలో ఆటోమేటిక్​ వేరియంట్​ను లాంచ్​ చేసింది. ఇప్పటివరకు ఫోర్డ్​ కేవలం మాన్యువల్​ గేర్​బాక్స్​ ఆప్షన్ కార్లనే విక్రయిస్తూ వస్తోంది. తాజాగా విడుదలైన ఆటోమేటిక్​ వేరియంట్​తో భారత మార్కెట్​లోకి వేగంగా విస్తరించాలని యోచిస్తోంది. ఈ ఆటోమేటిక్​ ఫోర్డ్​ ఫిగో కారు టైటానియం, టైటానియం ప్లస్​ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఆటోమేటిక్​ వేరియంట్​ బుకింగ్స్​ను కంపెనీ ప్రారంభించింది. రూ. 11,000 చెల్లించి ముందస్తు బుకింగ్​ చేసుకోవచ్చు. బుకింగ్​ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.  ఈ ఫోర్డ్​ ఫిగో టైటానియం వేరియంట్​ రూ. 7.75 లక్షలు, టైటానియం ప్లస్​ వేరియంట్​ రూ. 8.20 లక్షల ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ రెండు వేరియంట్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఫోర్డ్​ ఫిగోలో మొత్తం 5 కలర్​ ఆప్షన్లను అందించారు. రూబీ రెడ్​, మూన్ డస్ట్​ సిల్వర్​, స్మోక్​ గ్రే, వైట్​ గోల్డ్​, డైమండ్ వైట్​ కలర్స్​లో ఇది అందుబాటులో ఉంటుంది.
Indane Gas Booking Offer: ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు బంపరాఫర్.. రూ. 900 డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ.. ఆఫర్ కొన్ని రోజులే..

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్​ వేరియంట్ 1.2 లీటర్​, 3 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఇంజిన్​ 95 బిహెచ్​పి పవర్​, 119 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్​లో​ 6 స్పీడ్​ టార్క్​ కన్వర్టర్​ ఆటోమేటిక్ గేర్​ బాక్స్​ను కూడా జతచేసింది. ఫోర్డ్​ ఇండియా 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​తో కూడా ఈ ఆటోమేటిక్​ హ్యాచ్​బ్యాక్​ను విడుదల చేసింది. ఈ డీజిల్​ ఇంజిన్ 100 బిహెచ్​పి వవర్​, 215 ఎన్​ఎమ్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్​ 5 స్పీడ్​ మాన్యువల్​ గేర్​ బాక్స్​ ఆప్షన్​లో అందుబాటులో ఉంటుంది.

24.4 కిలోమీటర్ల మైలేజీ..
ఈ ఆటోమేటిక్​ వేరియంట్​ లీటర్​కు 24.4 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. కొత్త ఫోర్డ్​ ఫిగో ఆటోమేటిక్​లో 15 ఇంచెస్​ డ్యుయల్​ టోన్​ అల్లాయ్​ వీల్స్​, ఎలక్ట్రోక్రోమిక్​ ఐఆర్​విఎం, రెయిన్​ సెన్సింగ్​ వైపర్స్​, 7 ఇంచెస్​ టచ్​ స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్​ వంటి ఫీచర్లను అందించింది. ఇక, దీనిలోని సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ట్రాక్షన్​ కంట్రోల్, ఎబిఎస్​ విత్​ ఈబిడి, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ కంట్రోల్​, ఫోర్డ్​ పాస్​ కనెక్ట్​ కార్​ టెక్నాలజీ, ఆటో హెడ్​ల్యాంప్స్​, పుష్​ బటన్​ స్టార్ట్​/స్టాప్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, రియర్​ పార్కింగ్​ సెన్సార్​ వంటివి చేర్చింది. ఈ కారు భారత మార్కెట్​లో హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ 10 నియోస్​, మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ 20, వోక్స్వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ వంటి కార్లకు గట్టి పోటీనివ్వనుంది.
Published by:Nikhil Kumar S
First published: