Bajaj Pulsar N250, F250: పల్సర్ బైక్ లవర్లకు శుభవార్త.. అదిరే లుక్ తో మార్కెట్లోకి కొత్త మోడల్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

పల్సర్ బైక్ లవర్లకు బజాజ్ (Bajaj) శుభవార్త చెప్పింది. Pulsar N250, F250 పేరుతో రెండు మోడళ్లను భారత మార్కెట్లోకి(Indian Market) విడుదల చేసింది. ఈ మోడళ్లకు సంబంధించిన ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    మార్కెట్లో పల్సర్ (Pulsar) బైక్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మార్కెట్లోకి ఎన్ని కొత్త కొత్త బైక్ లు వచ్చినా పల్సర్ డిమాండ్ మాత్రం పెరగడం తప్పా తగ్గట్లేదంటే అతిషయోక్తి కాదు. తాజాగా మరింత ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్లతో బజాజ్ (Bajaj) సంస్థ పల్సర్ కొత్త మోడల్(Bajaj Pulsar N250, F250) ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పల్సర్ 250 మోడల్ ను ఇండియాలో విడుదల చేసింది బజాజ్. పల్సర్ ఎన్250 (Pulsar N250, F250) పేరుతో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చింది. ఈ బైక్ తో పాటు పల్సన్ ఎఫ్ 250 (Pulsar F250) పేరుతో మరో మోడల్ ను విడుదల చేసింది బజాజ్. పల్సర్‌ ఎన్‌250 ధర రూ. 1.30 లక్షలు కాగా, పల్సర్ ఎఫ్250 ధర రూ. 1.40 లక్షలు. ఈ నూతన మోడళ్ల బుకింగ్స్ గురువారం నుంచే ప్రారంభమయ్యాయి. నవంబర్ మొదటి వారం నుంచి డెలివరీలు మొదలుకానున్నట్లు బజాజ్ తెలిపింది.

    ప్రత్యేక ఫీచర్లు..
    ఈ బైక్ 250 సిరీస్‌ను గత మోడళ్లకు పూర్తి భిన్నంగా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ బైక్ లో మొత్తం ఐదు గేర్లు ఉంటాయి. ఈ బైక్ ఇంజన్‌ విషయానికి వస్తే 249 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌/ఆయిల్‌-కూల్డ్‌ మోటార్‌(249cc single-cylinder oil-cooled). 21.5 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ బైక్ ముందు వైపు టెలిస్కోపిక్‌, వెనుకవైపు మోనోషాక్‌ సస్పెన్షన్‌ అమర్చారు. ఎల్‌ఈడీ డీఎల్‌ఆర్‌ ప్రొజెక్టర్‌ లెన్స్‌ హెడ్‌ ల్యాంప్‌, డబుల్‌ బ్యారెల్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. స్పోర్ట్స్‌ బైక్‌ తరహాలో ఇంధన ట్యాంకు, స్ల్పిట్‌ సీట్‌ ఉంది. ఇంకా ఏబీఎస్‌తో కూడిన డిస్క్‌ బ్రేక్స్‌ ఏర్పాటు చేశారు.
    Dominar 400: బజాజ్ డోమినార్​ 400 అప్​గ్రేడ్​​ వెర్షన్ బైక్ లాంచ్​.. అద్భుతమైన​ రైడింగ్​​ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చే స్పోర్ట్స్​ బైక్​

    పుణేలోని కంపెనీ ప్లాంట్‌లో న్యూ బ‌జాజ్ ప‌ల్స‌ర్ 250ని ఉత్ప‌త్తి చేపడతారు. బీఎస్‌6 ప్ర‌మాణాల‌తో కూడిన న్యూ బ‌జాజ్ ప‌ల్స‌ర్ 250సీసీ టెక్నో గ్రే, రేసింగ్ రెడ్ క‌లర్స్‌లో క‌స్ట‌మ‌ర్ల‌ను అమితంగా ఆక‌ట్టుకోనుంది. ఈ నూతన మోడల్ పల్సర్ బైక్ కేటీఎం 200 డ్యూక్‌, సుజుకి జిక్స‌ర్ 250, య‌మ‌హ ఎఫ్‌జ‌డ్‌25 తదితర మోడల్ బైక్ లకు పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published: